AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరోసారి ఉద్యమానికి సిద్ధమవుతున్న సీజేపీ.. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు డిమాండ్!

కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ సీజేపీ ఆందోళనలను ఉధృతం చేసింది. ఓటర్ల జాబితాల అవకతవకలు, ఎన్నికల సంఘం అంతర్గత విభేదాలపై నిరసన. అక్టోబర్ 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ నిరసనకు పిలుపునిచ్చింది. శాంతియుత మార్గంలో ప్రజాస్వామ్య పోరాటానికి సిద్ధమని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ప్రకటించారు.

మరోసారి ఉద్యమానికి సిద్ధమవుతున్న సీజేపీ.. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు డిమాండ్!
Cjp Demands Cec Resign
Balaraju Goud
|

Updated on: Oct 03, 2026 | 9:56 AM

Share

కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలను ఉధృతం చేసింది. ఒకవేళ ఆయన రాజీనామా చేయకపోతే, అక్టోబర్ 10న ఢిల్లీలోని ప్రసిద్ధ జంతర్ మంతర్ వద్ద మరోసారి భారీ నిరసన ప్రదర్శనకు దిగుతామని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ప్రకటించారు. ముంబైలోని శివాజీ పార్కులో వేలాది మందితో నిరసన తెలిపిన సీజేపీ తదుపరి ఢిల్లీ వేదికగా ఆందోళన జరుపుతామని ప్రకటించింది. ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో జరిగిన అవకతవకల ఆరోపణలు, అలాగే ఇటీవల ఎన్నికల సంఘంలో వెలుగు చూసిన అంతర్గత విభేదాల నేపథ్యంలో సీజేపీ ఈ డిమాండ్‌ను తెరపైకి తెచ్చింది.

ఢిల్లీ పోలీసులకు దీప్కే వార్నింగ్!

జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయకపోతే, అక్టోబర్ 10న దేశం నలుమూలల నుంచి నిరసనకారులు ఢిల్లీకి పాదయాత్రగా వచ్చి జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతారనీ ఢిల్లీ పోలీసులు మమ్మల్ని ఆపడానికి ప్రయత్నిస్తే, వారు ఎక్కడ అడ్డుకుంటే అదే ప్రదేశం మాకు జంతర్ మంతర్ అవుతుందని హెచ్చరించారు. తమ నిరసన ప్రదర్శన పూర్తిగా శాంతియుతంగానే ఉంటుందని, మహాత్మా గాంధీ చూపిన అహింసా మార్గంలో నడుస్తామని ఆయన స్పష్టం చేశారు. గత జూలై 20న చోటుచేసుకున్న క్రూరత్వాన్ని ఈసారి పునరావృతం చేయవద్దని ఢిల్లీ పోలీసులను, ప్రభుత్వాన్ని కోరారు. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలు కోరుకునే ప్రతి పౌరుడు ఈ ప్రజాస్వామ్య పోరాగంలో భాగం కావాలని ఆయన పిలుపునిచ్చారు

జూలై 20 ఏం జరిగింది ?

నీట్ పేపర్ లీక్ పరీక్షా విధానంలో మార్పులు కోరుతూ జూలై 20వ తేదీన సీజేపీ విద్యార్దులు చేపట్టిన పార్లమెంటు మార్చ్ సమయంలో విద్యార్థి నిరసనకారులు, పోలీసుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. ఈ ఆందోళనల్లో పలువురు విద్యార్థులు, అలాగే ఢిల్లీ పోలీసులు, ఆర్ఏఎఫ్, సీఆర్పీఎఫ్ , సిబ్బంది గాయపడ్డారు. నిరసనకారులపై భద్రతా సిబ్బంది లోహపు పెల్లెట్లు ప్రయోగించారనే ఆరోపణలు సంచలనం సృష్టించాయి. ఈ ఘటనలపై ఆగస్టులో సుప్రీంకోర్టు సీరియస్ అయింది.నిరసనలో పాల్గొన్న చదువుకునే విద్యార్ధులపై ప్రభుత్వం సూచనమేరకు కోర్టు ఆదేశాలతో పోలీసులు కేసులు ఎత్తివేశారు..హింస, పోలీసుల దురాగతాల ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపేందుకు అత్యున్నత న్యాయస్థానం ఒక ఉన్నత స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేసింది.ప్రస్తుతం కమిటి విచారణ కొనసాగుతుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us