AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రతి రోజూ ఒక పచ్చి టమాటా తిన్నారంటే.. శరీరంలో జరిగే 7 అద్భుతమైన మార్పులు ఇవే!

ప్రతిరోజూ ఒక పచ్చి టమోటాను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఇందులో సమృద్ధిగా ఉండే విటమిన్ సి శరీర రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా, చర్మానికి సహజమైన మెరుపును అందిస్తుంది. విటమిన్ ఎ ల్యూటిన్ కంటి చూపును పెంచుతాయి. తక్కువ క్యాలరీలు ఉండే టమోటా బరువు తగ్గడానికి కూడా ఎంతో సహాయపడుతుంది. పూర్తి ప్రయోజనాలు తెలియాలంటే ఫుల్‌ డిటెల్స్‌లోకి వెళ్లాల్సిందే..

ప్రతి రోజూ ఒక పచ్చి టమాటా తిన్నారంటే.. శరీరంలో జరిగే 7 అద్భుతమైన మార్పులు ఇవే!
Raw Tomato Benefits
Jyothi Gadda
|

Updated on: Oct 03, 2026 | 10:23 AM

Share

మన వంటింట్లో సులభంగా లభించే కూరగాయలలో టమాటా ఒకటి. సాధారణంగా కూరలు, సార్లు, పచ్చళ్లలో వాడే టమాటాను వండకుండా పచ్చిగా తీసుకోవడం వల్ల శరీరానికి రెట్టింపు పోషకాలు లభిస్తాయి. రోజువారీ ఆహారంలో కనీసం ఒక పచ్చి టమోటాను చేర్చుకోవడం వల్ల లభించే ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే:

గుండె ఆరోగ్యానికి మేలు:

టమోటాకు ఎరుపు రంగును ఇచ్చే లైకోపీన్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, పొటాషియం రక్తపోటును సమర్థవంతంగా నియంత్రిస్తాయి. ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, హృదయ సంబంధిత సమస్యలు రాకుండా కాపాడుతాయి.

చర్మ సౌందర్యం, కాంతి:

టమోటాలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడి, చర్మంపై ముడతలు పడకుండా చూస్తుంది. పచ్చి టమోటాను క్రమం తప్పకుండా తింటే చర్మం లోపలి నుండి శుభ్రపడి, సహజమైన రంగు, కాంతి పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి

జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది:

టమాటాలో పీచు పదార్థం, నీటి శాతం ఎక్కువగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను వేగవంతం చేసి, తిన్న ఆహారం సులభంగా అరిగేలా చేస్తాయి. మలబద్ధకం సమస్యను నివారిస్తాయి.

రోగనిరోధక శక్తి పెరుగుదల:

విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వల్ల ఇది శరీరంలో తెల్ల రక్తకణాల ఉత్పత్తిని పెంచి, రోగనిరోధక వ్యవస్థను ఒక కేడయంలా రక్షిస్తుంది. వాతావరణ మార్పుల వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లను తట్టుకునే శక్తి లభిస్తుంది.

క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది:

టమాటాలోని యాంటీఆక్సిడెంట్లు శరీరంలో ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే కణాల నష్టాన్ని నివారిస్తాయి. ముఖ్యంగా ప్రోస్టేట్, కడుపు, పెద్దప్రేగు క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడంలో పచ్చి టమోటా కీలక పాత్ర పోషిస్తుంది.

బరువు తగ్గడానికి సహాయం:

తక్కువ క్యాలరీలు ఉండే టమోటాలను సలాడ్‌గా ఉప్పు, మిరియాల పొడి చల్లుకుని తినడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. ఇది అనవసరమైన ఆకలిని తగ్గించి, శరీర కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది.

కంటి చూపు మెరుగవుతుంది:

టమోటాలో విటమిన్ ఎ, ల్యూటిన్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి రేచీకటి, కంటిశుక్లాలు వంటి సమస్యలు రాకుండా నివారించి చూపును పదునుగా ఉంచుతాయి.

రోజువారీ ఆహారంలో పచ్చి టమాటాను భాగం చేసుకుని, సహజ సిద్ధమైన పద్ధతిలో మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి!

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
పెరిగిన రకూన్‌ల సంఖ్య.. పంట నష్టంతో రైతులు విలవిల !
పెరిగిన రకూన్‌ల సంఖ్య.. పంట నష్టంతో రైతులు విలవిల !
కేవలం రూ.40 చెల్లిస్తే వాట్సప్‌లోనే క్యాస్ట్ సర్టిఫికేట్
కేవలం రూ.40 చెల్లిస్తే వాట్సప్‌లోనే క్యాస్ట్ సర్టిఫికేట్
ఏపీకి తుఫాన్ ముప్పు.. రాబోయే 5 రోజులు భారీ వర్షాలు..
ఏపీకి తుఫాన్ ముప్పు.. రాబోయే 5 రోజులు భారీ వర్షాలు..
'జైలర్ 2' రికార్డు కలెక్షన్లు.. ఎట్టకేలకు నెరవేరనున్న కోలీవుడ్ కల
'జైలర్ 2' రికార్డు కలెక్షన్లు.. ఎట్టకేలకు నెరవేరనున్న కోలీవుడ్ కల
క్రెడిట్ కార్డు ఉపయోగించడం లేదా..? మీకే నష్టం.. ఎలా అంటే..?
క్రెడిట్ కార్డు ఉపయోగించడం లేదా..? మీకే నష్టం.. ఎలా అంటే..?
కూర్చునే విధానాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
కూర్చునే విధానాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
వెంకీ, త్రివిక్రమ్ ల 'ఆదర్శ కుటుంబం 'ట్రైలర్ వచ్చేసింది
వెంకీ, త్రివిక్రమ్ ల 'ఆదర్శ కుటుంబం 'ట్రైలర్ వచ్చేసింది
రైతన్నకు ఎంత కష్టమొచ్చే.. కరువు పంజాతో చేతికొచ్చిన పంట కళ్లముందే
రైతన్నకు ఎంత కష్టమొచ్చే.. కరువు పంజాతో చేతికొచ్చిన పంట కళ్లముందే
ఇంట్లో ఇడ్లీలు మిగిలిపోతున్నాయా? ఈ మసాలా స్నాక్ చేస్తే అదుర్స్
ఇంట్లో ఇడ్లీలు మిగిలిపోతున్నాయా? ఈ మసాలా స్నాక్ చేస్తే అదుర్స్
ఇషాన్ కిషన్ స్థానంలో కొత్త ప్లేయర్.. ఎవరంటే?
ఇషాన్ కిషన్ స్థానంలో కొత్త ప్లేయర్.. ఎవరంటే?