AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prema : ఆ నిర్ణయం తీసుకోకపోతే కుంగిపోయేదాన్ని.. విడాకులపై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ ప్రేమ..

ఒకప్పుడు టాలీవుడ్‌ను తన అందం, అభినయంతో ఓ ఊపు ఊపిన నటి ప్రేమ, తన సినీ ప్రస్థానాన్ని, వ్యక్తిగత జీవిత విశేషాలను వెల్లడించారు. సినిమా రంగంలోకి రాకముందు తాను జాతీయ స్థాయి వాలీబాల్ ప్లేయర్‌నని తెలిపారు. సునీల్ కుమార్ దేశాయ్ దర్శకత్వంలో కన్నడ చిత్రం సవ్యసాచి ద్వారా వెండితెరకు పరిచయమైన ప్రేమ, తాజాగా తన పర్సనల్ లైఫ్ గురించి పంచుకున్నారు.

Rajitha Chanti
|

Updated on: Oct 23, 2026 | 8:48 PM

Share
90ల దశకంలో తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమలలో ప్రేమ హీరోయిన్. తనదైన అభినయంతో, అందంతో అగ్ర కథానాయికగా వెలుగొందిన ఆమె స్టార్ హీరోలతో కలిసి నటించింది. తెలుగులో 'దేవి', 'ధర్మచక్రం' వంటి అద్భుతమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు అత్యంత సన్నిహితురాలైన ఆమె, ఒక వెలుగు వెలిగి ఆ తర్వాత సినిమాలకు దూరమయ్యారు. అయితే ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించి గతంలో ఒక ప్రముఖ ఇంటర్వ్యూలో పంచుకున్న ఆసక్తికర విషయాలు ప్రస్తుతం మళ్లీ చర్చనీయాంశంగా మారాయి.

1 / 5
ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న ప్రేమ.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన వివాహ జీవితం, ఎదురైన మానసిక వేదన , విడాకుల నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణాలను ఆమె ఎంతో ధైర్యంగా బయటపెట్టారు. ప్రతి యువతి లాగే తాను కూడా పెళ్లి విషయంలో ఎన్నో కలలు కన్నానని, అయితే పెళ్లి తర్వాత తన జీవితంలో ఊహించని పరిణామాలు ఎదురయ్యాయని ప్రేమ వెల్లడించారు. వివాహ బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత తనకు నచ్చినట్లుగా బతకడానికి లేదా కనీస స్వేచ్ఛ కూడా దక్కలేదని ఆమె అన్నారు.

2 / 5
 జీవిత భాగస్వామితో సర్దుకుపోవడానికి ఎంతగానో ప్రయత్నించినప్పటికీ, రోజురోజుకూ పరిస్థితులు మరింత దిగజారడంతో మానసికంగా తీవ్రంగా కుంగిపోయినట్లు తెలిపారు. ఒక నటిగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన తనకు, సొంత ఇంటిలో లభించిన ఆంక్షలు క్షోభను మిగిల్చాయని ఆమె పేర్కొన్నారు. సమాజం ఏమనుకుంటుందో అనే భయంతో ఇబ్బందికర కాపురాన్ని జీవితాంతం మోయలేకపోయానని, చివరికి తన ఆత్మగౌరవం ముఖ్యం భావించి ధైర్యంగా విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు ప్రేమ స్పష్టం చేశారు.

3 / 5
ఈ నిర్ణయం తీసుకునే ముందు తాను పడిన మానసిక వేదన అంతా ఇంతా కాదని, అయితే కుటుంబ సభ్యుల అండదండలతో తాను కోర్టు ద్వారా చట్టపరంగా విడాకులు తీసుకుని బయటికి వచ్చానని చెప్పారు. ఒక మహిళ జీవితంలో పెళ్లి అనేది ఎంత ముఖ్యమో, ఒకవేళ ఆ బంధం సరైనది కాకపోతే బయటికి వచ్చి సొంత కాళ్లపై నిలబడటం అంతకంటే ముఖ్యమని ఆమె అన్నారు.. ప్రస్తుతం ఒంటరిగానే ఉన్నప్పటికీ ఎంతో ప్రశాంతంగా, ఆత్మవిశ్వాసంతో జీవిస్తున్నానని నటి ప్రేమ తన మనసులోని మాటలను పంచుకున్నారు.

4 / 5
కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే, 24 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నానని, కుటుంబ సభ్యుల ఒత్తిడితో పాటు తనకు కూడా పెళ్లి చేసుకోవాలనిపించిందని చెప్పారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ, తర్వాత అభిప్రాయ భేదాలు రావడంతో మ్యూచువల్‌గా విడిపోవాలని నిర్ణయించుకున్నామని ప్రేమ వెల్లడించారు. ప్రస్తుతం తాను చాలా సంతోషంగా ఉన్నానని, కుటుంబంతో గడుపుతూ, మళ్లీ సినిమాల్లో నటిస్తున్నానని తెలిపారు. మళ్లీ పెళ్లి చేసుకునే ఆలోచన ప్రస్తుతం లేదని స్పష్టం చేశారు.

5 / 5
Follow Us