AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: రైతన్నకు ఎంత కష్టమొచ్చే.. కరువు పంజాతో చేతికొచ్చిన పంట కళ్లముందే నాశనం..!

తెలంగాణ అన్నదాతపై కరవు పంజా విసురుతోంది. నైరుతి రుతుపవనాలు నిరాశపరచడం, అక్టోబర్ నెలలోనూ వాన జాడ లేకపోవడంతో రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. అక్టోబర్ మొదటి మూడు వారాల్లో ఏకంగా 95 శాతం లోటు వర్షపాతం నమోదవగా.. రాష్ట్రవ్యాప్తంగా 315 మండలాల్లో కరవు పరిస్థితులు నెలకొన్నట్లు అధికారిక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. పత్తి, వరి పంటలు తీవ్రంగా దెబ్బతిని రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.

Telangana: రైతన్నకు ఎంత కష్టమొచ్చే.. కరువు పంజాతో చేతికొచ్చిన పంట కళ్లముందే నాశనం..!
Rain Deficit Dries Up Telangana Farmer Hopes
Siva Nagaraju
| Edited By: |

Updated on: Oct 23, 2026 | 9:57 PM

Share

తెలంగాణలో రైతన్నకు కష్టాలు మొదలయ్యాయి. వానాకాలం ముగిసినా వర్షం జాడ కనిపించడం లేదు. అక్టోబర్‌ నెలలోనూ ఆకాశం మేఘం పట్టడం లేదు. పొలాల్లో తేమ తగ్గుతోంది. పంటలు నీటి కోసం ఎదురుచూస్తున్నాయి. పెట్టిన పెట్టుబడి చేతికి వస్తుందో లేదోనని రైతులు దిగులు పడుతున్నారు. వర్షం లేకపోతే రైతు బతుకు ఎలా ఉంటుందో పల్లెల్లో అడిగితే చాలు. పొలం వైపు చూస్తూ రైతు పడే బాధ కనిపిస్తుంది. వాన కోసం విత్తనం ఎదురుచూస్తే, రైతు కోసం అప్పు ఎదురుచూస్తుందనే రీతిలో పరిస్థితి మారుతోంది. అక్టోబర్‌ 1 నుంచి 21 వరకు తెలంగాణలో సాధారణంగా 75.6 మి.మీ వర్షం కురవాలి. కానీ 3.5 మి.మీ. మాత్రమే నమోదైంది. అంటే సాధారణ వర్షంతో పోలిస్తే దాదాపు 95 శాతం లోటు ఉంది. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 12 జిల్లాల్లో ఒక్క చుక్క వర్షం కూడా నమోదు కాలేదని నివేదికలు పేర్కొన్నాయి. మిగిలిన జిల్లాల్లోనూ వర్షాలు ఆశించినంతగా కురవలేదు. ఈ లెక్కలు నిజమైతే రాష్ట్రంలో వర్షాభావం ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. రైతుకు వాన అంటే కేవలం నీరు కాదు. అదే పంటకు ప్రాణం. అదే ఇంటికి ఆదాయం. అదే పిల్లల చదువుకు ఆధారం. వాన రాకపోతే ఈ ఆశలన్నీ ఆవిరవుతాయి. వానాకాలంలోనూ వానల లోటే! ఈ కష్టం అక్టోబర్‌తోనే మొదలుకాలేదు. జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు కూడా వానలు సరిగా పడలేదు. ఆ నాలుగు నెలల్లో సాధారణంగా 740.6 మి.మీ....

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి