Driving Licence: డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్ మారాయ్.. ఇకపై అవన్నీ ఫ్రీ.. కేంద్రం పెద్ద ఊరట..
Driving Licence New Rules: కేంద్ర ప్రభుత్వం డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్‌లో భారీ మార్పులు చేసింది. కొన్ని రూల్స్‌ను కఠినతరం చేయగా.. మరికొన్ని రూల్స్‌లో పలు మినహాయింపులు కల్పించింది. డ్రైవింగ్ లైసెన్సులో పేరు, అడ్రస్ లాంటివి మార్చుకోవడం మరింత సులభతరం కానుంది. కొత్త నిబంధనలు ఇవే..

Driving Licence
- డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే ఇక కష్టమే. నిబంధనలను కేంద్ర ప్రభుత్వం మరింత కఠినతరం చేస్తూ నిర్ణయం తీసుకుంది. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న క్రమంలో వీటిని నివారించేందుకు రూల్స్‌ను కఠినం చేసేందుకు ముందుడుగు వేసింది. వాహనదారులకు ట్రాఫిక్ రూల్స్‌పై మరింత అవగాహన పెంచేందుకు, ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేసేందుకు నిర్వహించే పరీక్షకు సంబంధించిన పాస్ మార్కులను పెంచింది.
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకుంటే ఆన్లైన్ అసెస్మెంట్ టెస్ట్ తప్పనిసరిగా రాయాల్సి ఉంటుందనే విషయం తెలిసిందే. ట్రాఫిక్ రూల్స్, డ్రైవింగ్ నిబంధనల గురించి ఇందులో ప్రశ్నలు ఉంటాయి. ఇప్పటివరకు ఈ పరీక్షకు పాస్ మార్కులు 60 శాతంగా ఉండేది. కానీ ఇక నుంచి 75 శాతానికి పెంచుతున్నట్లు కేంద్ర రోడ్డు, రవాణాశాఖ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిపై అభ్యంతరాలను స్వీకరించనుంది.
- 30 రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు వెల్లడించింది. అనంతరం వివిధ వర్గాల నుంచి వచ్చిన అభ్యంతరాలు, ఫీడ్ బ్యాక్‌ను పరిశీలించిన అనంతరం తుది నోటిఫికేషన్ కేంద్రం జారీ చేయనుంది. అంతేకాకుండా డ్రైవింగ్ లైసెన్స్‌లోని పేరు, అడ్రస్ లాంటివి మార్చుకునేందుకు నిబంధనలు సులభతరం చేసింది. ఇకపై పేరు, అడ్రస్ లాంటి వ్యక్తిగత వివరాలు మార్చుకోవాలంటే ఛార్జీలను తొలగించనుంది.
- డ్రైవింగ్ లైసెన్సులో పేరు, అడ్రస్ మార్పులకు సంబంధించిన అభ్యర్థనలపై 15 రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలి. వాటిని ఆమోదించడం లేదా తిరస్కరించడం లాంటివి చేయాలి. అడ్రస్ మార్పుకు సంబంధించి 30 రోజుల్లోగా ప్రాసెస్ చేయకపోతే ఆటోమేటిక్‌గా ఆమోదం పొందినట్లు పరిగణిస్తారు. ఒకవేళ దరఖాస్తులు తిరస్కరిస్తే సరైన కారణం చూపించాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా ఆధార్ ఆథెంటికేషన్ ప్రక్రియ ద్వారా పొందే సేవలకు ఫీజు మినహాయింపులు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది.
- డ్రైవింగ్ లైసెన్స్ జారీలో వయస్సు, అడ్రస్, గుర్తింపు ధృవీకరణ కోసం ఆధార్, డేట్ ఆఫ్ బర్త్, ఓటర్ ఐడీ, పాస్ పోర్ట్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్లు, రేషన్ కార్డు వంటివి ఉపయోగపడతాయి. ఇక అడ్రస్ వెరిఫికేషన్ కోసం గడిచిన 3 నెలల్లోపు జారీ చేసిన గ్యాస్, కరెంట్ బిల్లులను సమర్పించవచ్చు. ఎల్ఐసీ పాలసీలను ఈ జాబితా నుంచి తొలగించారు.
Follow Us





