మఖానా ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఎవరు తినకూడదో తెలుసా?

samatha

2 october 2026

Pic credit - Pinterest

ప్రతి ఒక్కరూ ఇష్టంగా తినే సూపర్ ఫుడ్‌లలో మఖానా ముందు ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

మఖానా

అందుకే ఒక్కరూ దీనిని తమ డైట్‌లో చేర్చుకుంటారు.  అయితే ఇది ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ కొంత మంది మాత్రం దీనిని అస్సలే తినకూడదంట.

కొన్ని రకాల సమస్యలు ఉన్నవారు

ముఖ్యంగా కొన్ని రకాల సమస్యలతో బాధపడే వారు మఖానా తినడం వలన అనేక ఇబ్బందులు ఎదురు అవుతాయంట. ఇంతకీ వారు ఎవరో ఇప్పుడు మనం చూసేద్దాం.

ఇంతకీ వారు ఎవరు అంటే?

కొంత మంది జీర్ణ సమస్యలు, ముఖ్యంగా మలబద్ధకం సమస్యలతో ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కుంటారు. అయితే అలాంటి వారు మఖానా తినకూడదు.

జీర్ణ సమస్యలు ఉన్నవారు

అంతే కాకుండా ఎవరు అయితే కిడ్నీలో రాళ్ల సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వారు కూడా వీటికి దూరంగా ఉండాలంట.

కిడ్నీ రాళ్ల సమస్యలు

 వీరే కాకుండా యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారు కూడా వీలైనంత వరకు మఖానా తినకపోవడమే మంచిది అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

యూరిక్ యాసిడ్ ఉన్నవారు

అంతే కాకుండా అలర్జీ వంటి సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కునే వారు కూడా మఖానాకు దూరం ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు.

అలెర్జీ సమస్యలు ఉన్నవారు

అదే విధంగా కొన్ని రకాల మందులు వాడే వారు ముఖ్యంగా, రక్తం పలచబడే మందులు వాడే వారు కూడా మఖానా తినకూడదంట.

మందులు వాడే వారు