కెమికల్స్‌తో పండించిన బొప్పాయిని ఎలా గుర్తించాలి?

02 October 2026

TV9 Telugu

TV9 Telugu

బొప్పాయి అంటే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది దాని తియ్యటి రుచి, ఆరోగ్య ప్రయోజనాలే. అయితే మార్కెట్లో రసాయనాలతో పండినవే అమ్ముతారు

TV9 Telugu

వీటిని ఎలా గుర్తించాలంటే.. సహజంగా పండిన బొప్పాయి కూడా పూర్తిగా పసుపు, బంగారు పసుపు రంగులోకి మారే అవకాశం ఉంది

TV9 Telugu

కాబట్టి పండు రంగు ఒకేలా ఉందని వెంటనే కెమికల్స్‌తో పండించారని అనుకోవాల్సిన అవసరం లేదు

TV9 Telugu

బొప్పాయి రకం, పండిన పరిస్థితులు, కోత సమయంలో ఉన్న దశ వంటి కారణాలు కూడా దాని రంగుపై ప్రభావం చూపుతాయి

TV9 Telugu

అందుకే పండు కొనేటప్పుడు కేవలం రంగుపైనే ఆధారపడకుండా ఇతర లక్షణాలను కూడా గమనించాలి

TV9 Telugu

సహజంగా పండిన బొప్పాయికి సాధారణంగా మంచి తియ్యటి, పండ్ల వాసన ఉంటుంది

TV9 Telugu

మార్కెట్లో బొప్పాయి పండును కొనేముందు దానిని దగ్గరగా తీసుకుని వాసన చూస్తే ఈ విషయం కొంతవరకు అర్థమవుతుంది

TV9 Telugu

ఎలాంటి పండ్ల వాసన లేకపోవడం లేదా చాలా అసహజంగా అనిపించడం ఉంటే ఆ పండును జాగ్రత్తగా పరిశీలించాలి