మత్తెక్కించే చూపులతో మెంటలెక్కిస్తోన్న లేడీ సూపర్ స్టార్..

Rajitha Chanti

Pic credit - Instagram

07 April 2026

దక్షిణాది చిత్ర పరిశ్రమలో 'లేడీ సూపర్ స్టార్'గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి నయనతార. గ్లామర్ పాత్రలు, ట్రెడిషనల్ పాత్రలతో ఆకట్టుకుంటుంది.

దశాబ్దాలుగా ఇండస్ట్రీలో రాణిస్తున్న ఆమె ఇప్పటికీ బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో మెప్పి్స్తున్నారు. ఇటీవలే మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

 ప్రస్తుతం యష్ నటిస్తున్న టాక్సి్క్ మూవీలో నటిస్తుంది. తాజాగా నయనతారకు సంబంధించిన కొన్ని మోనోక్రోమ్ (బ్లాక్ అండ్ వైట్) ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి

ఈ ఫోటోషూట్‌లో ఆమె చూపిన రాజసం, గాంభీర్యం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. నయనతార అసలు పేరు డయానా మరియం కురియన్.

2003లో మలయాళ చిత్రం 'మనస్సినక్కరే'తో వెండితెరకు పరిచయమైన ఆమె, అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. 2006లో 'లక్ష్మి' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు.

 రజనీకాంత్‌తో 'చంద్రముఖి', సూర్యతో 'గజిని' వంటి భారీ విజయాలు ఆమె కెరీర్‌ను మలుపు తిప్పాయి. లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో  మెప్పించారు. 

2023లో షారుఖ్ ఖాన్‌తో కలిసి 'జవాన్' సినిమాతో బాలీవుడ్‌లోకి ఘనంగా అడుగుపెట్టిన నయనతార, ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.

వయసు పెరిగినా తరగని అందం, అద్భుతమైన నటనతో నయనతార నేటికీ కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తున్నారు. ప్రొఫెషనల్ లైఫ్‌తో పాటు పర్సనల్ లైఫ్ సాగిస్తుంది.