AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మ్యారేజ్ మార్కెట్‌లో న్యూ ట్రెండ్.. కొత్త విధానంలో పాట్నర్స్‌ను వెతుక్కుంటున్న యువత!

భారతదేశంలో పెళ్లిళ్ల సీజన్ మొదలైందంటే చాలు.. మ్యాట్రిమోనీ సైట్లు, బ్రోకర్ల హడావుడి మామూలుగా ఉండదు. ఇప్పుడు ట్రెండ్ మారుతోంది. కేవలం ఫోటోలు చూసి జాతకాలు కలిపి పెళ్లిళ్లు చేసుకునే రోజులు పోతున్నాయి. ఆధునిక యువత తమ భాగస్వామిని ఎంచుకునే విషయంలో సరికొత్త దారిని వెతుక్కుంటున్నారు. అదేంటో చూద్దాం పదండి.

మ్యారేజ్ మార్కెట్‌లో న్యూ ట్రెండ్.. కొత్త విధానంలో పాట్నర్స్‌ను వెతుక్కుంటున్న యువత!
Indian Marriage Trends
Vidyasagar Gunti
| Edited By: |

Updated on: Apr 07, 2026 | 2:01 PM

Share

2026 నాటికి మ్యాచింగ్ ప్లాట్‌ఫారమ్‌లు పూర్తిగా హైపర్-పర్సనలైజ్డ్ గా మారిపోతున్నాయి. కేవలం కులం, గోత్రం, జీతం మాత్రమే కాకుండా.. అవతలి వ్యక్తి ఆలోచనా విధానం, వ్యక్తిత్వం, జీవనశైలి తమతో సరిపోతాయో లేదో తెలుసుకోవడానికి సైకోమెట్రిక్ అనే పరీక్షలు, డీప్ ఇంటర్వ్యూలను కూడా నిర్వహిస్తున్నారు. స్వైపింగ్ అలసట నుంచి బయటపడటానికి యువత ఇప్పుడు క్వాలిటీ మ్యాచింగ్ వైపు మొగ్గు చూపుతున్నారు.

ఈ కొత్త తరం మ్యాచింగ్ ప్రక్రియలో థెరపీ ఒక కీలక భాగమైపోయింది. అవును మీరు విన్నది నిజమే! కేవలం జతలను కలపడమే కాకుండా.. సదరు యువతీ యువకుల మానసిక స్థితిని అర్థం చేసుకోవడానికి రిలేషన్‌షిప్ కోచ్‌లు, సైకాలజిస్టులు రంగంలోకి దిగుతున్నారు. వెరోనా, Couplet వంటి ప్లాట్‌ఫారమ్‌లు అభ్యర్థుల ఎమోషనల్ ఇంటెలిజెన్స్, సమస్యలను పరిష్కరించే తీరును బట్టి మ్యాచ్‌లను సూచిస్తున్నాయి.

కొన్ని ప్రీమియం ప్లాట్‌ఫారమ్‌లైతే ఏడాదికి రూ. 2 లక్షల వరకు ఛార్జ్ చేస్తూ.. వ్యక్తిగత కోచ్‌లను కూడా కేటాయిస్తున్నాయి. వీరు వారానికి ఒకసారి అభ్యర్థులతో మాట్లాడి.. తిరస్కరణల వల్ల కలిగే మానసిక ఒత్తిడిని ఎలా అధిగమించాలో కూడా నేర్పిస్తున్నారు. దీంతో పెళ్లి అనేది కేవలం ఒక ఒప్పందంలా కాకుండా, మానసిక బంధంగా మారుతోంది.

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ సరికొత్త ప్లాట్‌ఫారమ్‌లలో తల్లిదండ్రుల ప్రమేయం క్రమంగా తగ్గుతోంది. గతంలో మ్యాట్రిమోనీ అకౌంట్లను తల్లిదండ్రులు నిర్వహిస్తే, ఇప్పుడు 77 శాతం ప్రొఫైల్స్ యువతే స్వయంగా మేనేజ్ చేస్తున్నారు. పైగా కేవలం ఆన్‌లైన్ చాటింగ్‌లకే పరిమితం కాకుండా ఆఫ్‌లైన్ మిక్సర్స్ కు డిమాండ్ పెరుగుతోంది.

ఒకే అభిరుచులు ఉన్న వ్యక్తులు డిన్నర్లు లేదా ప్రత్యేక ఈవెంట్లలో కలుసుకుని, నేరుగా మాట్లాడుకుని తమ వైబ్స్ కలుస్తున్నాయో లేదో చూసుకుంటున్నారు. సోషల్ డ్రింకింగ్, స్మోకింగ్ వంటి అలవాట్లను దాచకుండా నిజాయితీగా వెల్లడించే వాతావరణం ఇక్కడ ఉండటం గమనార్హం. మొత్తంమీద భారతీయ వివాహ వ్యవస్థలో ఇప్పుడు డిజిటల్ డేటింగ్ కంటే ఇంటెన్షనల్ మ్యాచింగ్ కే పెద్దపీట వేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి