నేను ఇకపై సింగిల్.. ఎవరితోనూ రిలేషన్‌లో లేను.. టాలీవుడ్ హీరోయిన్..
Rajitha Chanti
Pic credit - Instagram
07 April 2026
శ్రుతి హాసన్ తన గురించి వస్తున్న వార్తలపై ఎట్టకేలకు స్పష్టత ఇచ్చారు. గత కొంతకాలంగా ఆమె తన ప్రియుడు శాంతను హజారికాతో విడిపోయారనే ప్రచారం సాగుతోంది.
దీనిపై ఇప్పటివరకు మౌనంగా ఉన్న శ్రుతి, తాజాగా సోషల్ మీడియా వేదికగా అసలు విషయం వెల్లడించారు. తాను ప్రస్తుతం పూర్తిగా సింగిల్ అని, తన పనిపైనే దృష్టి సారించానని అన్నారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ముచ్చటించిన సందర్భంగా ఒక నెటిజన్ మీరు సింగిలా లేక కమిటెడ్డా అని అడిగిన ప్రశ్నకు శ్రుతి సూటిగా సమాధానం ఇచ్చారు.
నాకు ఇలాంటి వ్యక్తిగత ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం పెద్దగా ఇష్టం ఉండదు. కానీ ఇప్పుడు చెబుతున్నాను.. నేను పూర్తిగా సింగిల్. ఎవరితోనూ రిలేషన్‌లో లేను.
కేవలం నా పనిని, నా జీవితాన్ని ఆస్వాదిస్తున్నాను" అని రాసుకొచ్చారు. దీంతో గత నాలుగేళ్లుగా శాంతనుతో కొనసాగిన బంధానికి ముగింపు పడినట్లు అధికారికంగా ఖరారైంది.
శ్రుతి హాసన్, ముంబైకి చెందిన విజువల్ ఆర్టిస్ట్ శాంతను హజారికా 2020 నుంచి ప్రేమలో ఉన్నారు. వీరిద్దరూ ముంబైలో లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉండేవారు.
కొద్దిరోజుల క్రితం వీరిద్దరూ ఒకరినొకరు ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేసుకోవడం, ఫోటోలను తొలగించారు. అప్పటి నుంచి వీరిద్దరూ విడిపోయారనే ప్రచారం జరిగింది.
శ్రుతి హాసన్ తన సినీ కెరీర్‌పై పూర్తి ఫోకస్ పెడుతున్నారు. ప్రభాస్ సరసన 'సలార్: పార్ట్ 1'తో భారీ విజయాన్ని అందుకున్న ఆమె, ఇప్పుడు 'సలార్ 2' కోసం సిద్ధమవుతున్నారు.