హైదరాబాదీలకు అలెర్ట్.. మరికొన్ని గంటల్లో ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు
ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ నటించిన లేటెస్ట్ సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమ ఉగాది కానుకగా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్లలో భాగంగా ఇవాళ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. హరీశ్ శంకర్ తెరకెక్కించిన ఈ మూవీలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లు గా నటించారు. ఇప్పిటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ మూవీ ఉగాది కానుకగా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఆదివారం (మార్చి 15వ తేది) హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించను్నారు. యూసఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్ (1st బెటాలియన్) వేదికగా మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ మెగా ఈవెంట్ జరగనుంది. పవన్ కల్యాణ్ తో పాటు చిత్ర బృందమంతా ఈ ఈవెంట్ కు హాజరుకానున్నారు. అలాగే పవన్ కల్యాణ్ అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో యూసఫ్‌గూడ లోని పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు హైదరాబాద్ పోలీసులు. వాహనదారులు ఇబ్బంది పడకుండా ఈ నిబంధనలు పాటించాలని పోలీసులు కోరారు.
వాహనదారులకు హైదరాబాద్ పోలీసుల ముఖ్యమైన సూచనలు ఇవే..
- జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వైపు నుంచి కేవీబీఆర్ (కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి) స్టేడియం వైపు వెళ్లే వాహనాలను కృష్ణానగర్ జంక్షన్ వద్ద శ్రీనగర్ కాలనీ – పంజాగుట్ట వైపు మళ్లించనున్నారు.
- మైత్రీవనం జంక్షన్ నుంచి జూబ్లీహిల్స్, మాదాపూర్ వైపు వెళ్లే వాహనాలను యూసఫ్‌గూడ బస్తీ వద్ద ఆర్బీఐ క్వార్టర్స్ – కృష్ణానగర్ జంక్షన్ మీదుగా జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వైపు మళ్లించనున్నారు.
- మైత్రీవనం నుంచి బోరబండ బస్టాప్ వైపు వెళ్తే వాహనాలు సవేరా ఫంక్షన్ హాల్ – కృష్ణకాంత్ పార్క్ – జీటీఎస్ టెంపుల్ – కళ్యాణ్ నగర్ – మోతీ నగర్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.
- బోరబండ నుంచి మైత్రీవనం వెళ్లే ప్రయాణికులు ప్రైమ్ గార్డెన్ – మిడ్ ల్యాండ్ బేకరీ – జీటీఎస్ కాలనీ – కళ్యాణ్ నగర్ జంక్షన్ – ఉమేష్ చంద్ర స్టాచ్యూ మీదుగా మైత్రీవనం వెళ్లాలి.
పార్కింగ్ స్థలాలు ఇవే..
ఇక ఈ మెగా ఈవెంట్‌కు వచ్చే సాధారణ ప్రజల కోసం ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక పార్కింగ్ స్థలాలను కేటాయించారు.
- జానకమ్మ తోట పార్కింగ్, యూసఫ్‌గూడ (ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలు)
- మెట్రో పార్కింగ్, యూసఫ్‌గూడ (ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాల కోసం)
- సవేరా ఫంక్షన్ హాల్ (కేవలం నాలుగు చక్రాల వాహనాల కోసం)
- మహమూద్ ఫంక్షన్ హాల్ (కేవలం ఫోర్ వీలర్స్ వాహనాల కోసం)
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
