AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం సూపర్ న్యూస్.. జూన్‌లోనే అకౌంట్లోకి రూ.15 వేలు.. అప్లై చేస్కోండి

ఏపీ ప్రభుత్వం జూన్‌లో తల్లికి వందనం నిధులను జమ చేయనుంది. తల్లిదండ్రుల అకౌంట్లలో రూ.15 వేలు నేరుగా విడుదల చేయనుంది. ఏపీ సీఎం చంద్రబాబు ఈ నిధులను విడుదల చేయనున్నారు. జూన్‌లో నిధులను అందించనున్నట్లు సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. వాటి వివరాలు చూస్తే..

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం సూపర్ న్యూస్.. జూన్‌లోనే అకౌంట్లోకి రూ.15 వేలు.. అప్లై చేస్కోండి
thalliki vandanam
Venkatrao Lella
|

Updated on: Apr 05, 2026 | 10:25 AM

Share

పిల్లల చదువులు తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం ఆర్ధిక సాయం అందిస్తోంది. తల్లికి వందనం పథకం కింద ప్రతీ ఏడాది రూ.15 వేల ఆర్ధిక సాయం ఇస్తోంది. గత వైసీపీ ప్రభుత్వం అమ్మఒడి పేరుతో ఈ స్కీమ్‌ను అమలు చేయగా.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తల్లికి వందనం పేరుతో మార్చింది. గత ఏడాది తొలి విడతగా రూ.15 వేలు తల్లిదండ్రుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయగా.. ఇప్పుడు రెండో విడత జమ చేసేందుకు సిద్దమైంది. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఈ ఏడాది జూన్‌లో వీటిని జమ చేయనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. నెల్లూరు జిల్లాలో జరిగిన ఓ సభలో మాట్లాడుతూ.. జూన్‌లోనే తల్లిదండ్రుల అకౌంట్లలో రూ.15 వేలు విడుదల చేస్తామని ప్రకటించారు. ఎలాంటి కొతలు లేకుండా లబ్దిదారులందరికీ అందిస్తామని ప్రకటించారు.

అర్హతలు ఇవే..

-ఏపీ వాసి అయి ఉండాలి

-విద్యార్థులు 1వ తరగతి నుంచి 12వ తరగతి మధ్య చదువుతూ ఉండాలి

-విద్యార్థికి 75 శాతం అటెండెన్స్ తప్పనిసరిగా ఉండాలి

-విద్యార్థి తల్లికి బ్యాంక్ అకౌంట్ ఉండాలి

దరఖాస్తు చేసుకోవడం ఎలా..

పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే స్కూల్స్, కాలేజీల నుంచి డేటా సేకరించి లబ్దిదారులకు నేరుగా డబ్బులు జమ చేస్తారు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.2 లక్షల కంటే తక్కువ ఉండాలి

స్టేటస్ చెక్ చేసుకోవడం ఎలా..?

దరఖాస్తు చేసుకున్న తర్వాత స్టేటస్ కూడా చెక్ చేసుకునే అవకాశం ఉంది. ఇందుకోసం https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP వెబ్ సైట్ క్లిక్ చేయాలి. ఆధార్ నెంబర్ ఆధారంగా స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు ఎలా..

ప్రస్తుతం ఆఫ్ లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ఎలాంటి ఆప్షన్ లేదు. రాబోయే రోజుల్లో ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే సదుపాయం కల్పించే అవకాశముంది. ఈ పథకం కింద ప్రతీ ఏటా రూ.15 వేలు అందిస్తున్నారు. అయితే రూ.2 వేలు పిల్లల మెయింటనెన్స్ ఖర్చుల కింద కట్ చేశారు. రూ.13 వేలు విద్యార్థి తల్లి అకౌంట్లలో జమ చేస్తారు. ఈ పథకం వల్ల స్కూల్స్, కాలేజీల్లో డ్రాఫౌట్స్ తగ్గిపోతున్నాయి. అలాగే ఆర్ధిక భారం సరిపోక విద్యార్థుల చదువులను మధ్యలోనే తల్లిదండ్రులు ఆపివేయించేస్తున్నారు. దీని వల్ల విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారు. దీంతో అలా చదువులు మధ్యలో ఆగిపోకుండా ఉండేందుకు, విద్యార్థులను చదివించే తల్లిదండ్రులకు ఆర్ధిక భారం తగ్గించేందుకు ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని ప్రవేశపెట్టింది.

Follow Us