ఎండదెబ్బకు సొమ్మసిల్లిన నాగమ్మ.. నీరు పోయగానే పడగవిప్పి ఏం చేసిందంటే.. రేర్ వీడియో
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, మారుతున్న పర్యావరణం.. కేవలం మనుషులకే కాదు మూగజీవాలపైనా తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. దానికి తోడు కొన్ని మూగజీవాలను తరిమికొట్టేందుకు మనుషులు చేస్తున్న సాంప్రదాయ పద్ధతులు వాటి ప్రాణాలపైకి తెస్తున్నాయి. అసలే ఎండాకాలం.. ఆపై వేడి, పొగ. వాటి బారిన పడితే కచ్చితంగా మూగజీవాలు ఉక్కిరిబిక్కిరవడం ఖాయం.

పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, మారుతున్న పర్యావరణం.. కేవలం మనుషులకే కాదు మూగజీవాలపైనా తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. దానికి తోడు కొన్ని మూగజీవాలను తరిమికొట్టేందుకు మనుషులు చేస్తున్న సాంప్రదాయ పద్ధతులు వాటి ప్రాణాలపైకి తెస్తున్నాయి. అసలే ఎండాకాలం.. ఆపై వేడి, పొగ. వాటి బారిన పడితే కచ్చితంగా మూగజీవాలు ఉక్కిరిబిక్కిరవడం ఖాయం. అటువంటి పరిస్థితి ఓ మూగ జీవానికి ఎదురయింది విశాఖలో. భుసలు కొట్టే నాగుపామును తరిమికొట్టేందుకు వినియోగించిన సాంప్రదాయ పద్ధతి దాని ప్రాణాల పైకి తెచ్చింది. వేడి ఉక్కు తోడు ఒక్కరి బిక్కిరి చేసే పొగతో.. సోమ్మసిల్లిపోయింది ఆ నాగుపాము.. దీంతో స్నేక్ క్యాచర్ ఏం చేసాడో తెలుసా..? ఆయన చేసిన పనికి అందరూ ఇప్పుడు హాట్సాఫ్ చెబుతున్నారు.
వివరాల్లోకి వెళితే.. శ్రీహరిపురంలో బాలరాజు అనే వ్యక్తి ఇంటి పరిసరాల్లో నాగుపాము సంచరిస్తూ కనిపించింది. దీంతో ఆ కుటుంబం భయంతో గుండెలు పట్టుకుంది. అక్కడ హడావుడి పెరగడంతో.. స్క్రాప్ ఇలాంటి వస్తువులు ఉన్న చోటకు చొరబడి లోపల దాక్కుంది. ఎంతకీ బయటకు రాకపోవడంతో.. దాన్ని తరిమికొట్టే మార్గం లేక, ఆ సామాన్లు తీసి పామును బయటకు పంపేందుకు అవసరమైన ధైర్యం చాలక.. ఆ కుటుంబం సాంప్రదాయ పద్ధతిని ప్రయోగించింది. కొన్ని వస్తువులను కాల్చి.. వాటి పొగను ఆ పాముకు చేరేలా ప్రయత్నం చేశారు. అయినా ఆ పాము బయటకు రాకపోవడంతో.. స్నేక్ క్యాచర్ నాగరాజుకు సమాచారం అందించారు.
పాములు రెస్క్యూ చేయడంలో నేర్పరి కలిగిన నాగరాజు.. రంగంలోకి దిగిపోయాడు. నెమ్మదిగా ఆ నాగుపామును రెస్క్యూ చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో అప్పటికే.. మండుతున్న ఎండ వేడికి తోడు.. పెట్టిన పొగాకు ఆ నాగుపాము సొమ్మసిల్లిపోయే స్థితికి చేరుకుంది. దాదాపు ఆరడుగుల ఆ నాగుపామును నెమ్మదిగా రెస్క్యూ చేసిన నాగరాజు.. దాన్ని అడవుల్లో విడిచి పెట్టే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ ఆ పాము తేరుకపోవడంతో.. సపర్యలు చేశాడు. సొమ్మసిల్లేలా ఉన్న నాగుపాము పై చల్లటి నీటిని పోసాడు. దీంతో నెమ్మదిగా తేరుకున్న ఆ నాగుపాము.. పడగ విప్పి పైకి లేచింది.
వీడియో చూడండి..
నాగరాజు ఇస్తున్న నీటి చల్లదనాన్ని ఆస్వాదిస్తూ, సేద తీరుతూ కనిపించింది. తలపై నాగరాజు నీరు కోసం సమయంలో ఎంత హాయిగా ఉందేమో కానీ.. పడగవిప్పి కొంత సమయం వరకు.. ఆ నీటిని తనపై వేయమనేలా పైకి అలాగే లేచి ఉంది. ఆ పాము సాధారణ స్థితికి వచ్చిందని అనుకున్న తర్వాత.. సేఫ్గా సమీపంలోని పొదల్లో విడిచిపెట్టాడు నాగరాజు..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
