AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chinmayi: ‘మగాళ్లూ ఎప్పటికీ మన వైపు ఉండరు’.. ఆ స్టార్ హీరోను విమర్శిస్తూ సింగర్ చిన్మయి షాకింగ్ ట్వీట్

ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. సామాజిక అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తుంటుందామె. ముఖ్యంగా మహిళల సమస్యల పై తన గళాన్ని వినిపిస్తుంటుంది. తాజాగా ఓ స్టార్ హీరోను విమర్శిస్తూ చిన్మయి చేసిన ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది.

Chinmayi: 'మగాళ్లూ ఎప్పటికీ మన వైపు ఉండరు'.. ఆ స్టార్ హీరోను విమర్శిస్తూ సింగర్ చిన్మయి షాకింగ్ ట్వీట్
Singer Chinmayi Sripada
Basha Shek
|

Updated on: Mar 15, 2026 | 8:08 AM

Share

సింగర్ చిన్మయి శ్రీపాద గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సామాజిక సమస్యలపై తన దైన శైలిలో స్పందిస్తుంటుందామె. ముఖ్యంగా మహిళలు, చిన్నారుల సమస్యలపై సోషల్ మీడియా వేదికగా తన గళాన్ని వినిపిస్తుంటుంది. తాజాగా ఓ స్టార్ హీరోను విమర్శిస్తూ ఆమె చేసిన ట్వీట్ ఇప్పుడు కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. తమిళ సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ లిరిసిస్ట్‌ వైరముత్తుకు ఇటీవల ప్రతిష్ఠాత్మక జ్ఞానపీఠ్ పురస్కారం వరించింది. దేశంలోని సాహిత్య రంగంలో అందించే అత్యున్నత పురస్కారమే జ్ఞానపీఠ్ అవార్డు. ఇప్పుడు ఈ పురస్కారం అందుకున్న మూడో తమిళ వ్యక్తిగా వైరముత్తు నిలిచాడు. దీంతో తమిళనాడుకు చెందిన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా వైరముత్తుకు అభినందనలు తెలిపారు. అందులో ముఖ్యమంత్రి స్టాలిన్‌, స్టార్ హీరో కమల్ హాసన్ సైతం కూడా ఉన్నారు. ఇప్పుడిదే చిన్మయి ఆగ్రహానికి కారణమైంది. వైరముత్తుకు జ్ఞాన్ పీఠ్ అవార్డు రావడం, అందుకు కమల్ హాసన్ అభినందనలు తెలపడంపై చిన్మయి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆమె ఒక పోస్ట్ పెట్టింది.

తన పోస్టులో కమల్ హాసన్‌ కూడా వైరముత్తును అభినందించారని ఎద్దేవా చేసిన చిన్మయి.. ‘ సినిమాల్లో ఉన్న మగవాళ్లు రాజకీయాలకు మారడం, తన మామ, గురువు తమను లైంగికంగా వేధించాడని చెప్పిన మహిళలను పూర్తిగా పట్టించుకోకపోవడం ఆయనకే చెల్లుతుందు. పురుషులు ఎప్పటికీ మన వైపు ఉండరని ఓటు వేసే మహిళలు గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆయన సొంత పార్టీలోని మహిళ బహిరంగంగా కవి పేరును ప్రస్తావించినా పట్టించుకోకపోవడం మరి దారుణం. చివరగా పురుషులు కేవలం సోదరులు, మామలు, నాన్నలు, స్నేహితులు, సలహాదారులకు మాత్రమే అండగా నిలుస్తారు. మహిళలను ఎవరు పట్టించుకోరు.

ఇవి కూడా చదవండి

సింగర్ చిన్మయి ట్వీట్..

చిన్మయి చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. కాగా తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ వైరముత్తుపై సింగర్ చిన్మయి శ్రీపాద సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వైరముత్తుకు జ్ఞానపీఠ్ అవార్డు రావడంపై సింగర్ చిన్మయి విమర్శలు గుప్పించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us