జగిత్యాల కొత్త బస్ స్టాండ్ వద్ద సైడ్ ఇవ్వలేదనే కారణంతో ఆటో డ్రైవర్ ప్రదీప్, బస్సు డ్రైవర్ మహమ్మద్ జలీల్‌పై దాడి చేశాడు. తోటి డ్రైవర్లు ప్రదీప్‌ను అదుపులోకి తీసుకోగా, గాయపడిన జలీల్‌ను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.