పక్షులను గమనించే వారిలో.. ఊహించని ఆరోగ్య ప్రయోజనాలు!
ప్రకృతిలో గడపడంవల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. కెనడియన్ న్యూరోసైన్స్ నిపుణుల తాజా అధ్యయనం మరో ఆసక్తికర విషయాన్ని తెలిపింది. పచ్చని చెట్లపై, ఇంటి పరిసరాల్లో ఇలా ఎక్కడైనా సరే.. పక్షులను గమనించడం, వాటి కిలకిల రావాలు వినడం మెదడు ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుందని జ్ఞాపక శక్తిని పెంచుతుందని తెలిపింది.
బర్డ్ వాచింగ్ అనేది కొద్దిపాటు సంతోషానికే పరిమితం కాదు, అది మీ మెదడుకు ఊహించని ప్రయోజనాలను కలిగిస్తుందని పరిశోధకులు అంటున్నారు. క్రమం తప్పకుండా పక్షులను గమనిస్తూ గడిపేవారిలో శ్రద్ధ , జ్ఞాపక శక్తి, ప్యాటర్న్ గుర్తింపు వంటి మానసిక ప్రక్రియలు ఉత్తేజితం అవుతాయని చెబుతున్నారు. స్టడీలో భాగంగా పరిశోధకులు తరచుగా పక్షులను చూస్తూ, వాటి కిలకిల రావాలను ఆస్వాదించేవారి మెదడు పనితీరును విశ్లేషించగా, శ్రద్ధ, దృశ్య గ్రహణం, వర్కింగ్ మెమరీ మరింత మెరుగుపడినట్లు గుర్తించారు.పక్షులను గమనించే అలవాటు మానవుల్లో మెదడు న్యూరోప్లాస్టిసిటీని పెంచి, కాగ్నెటివ్ సామర్థ్యాలను కూడా మెరుగు పరుస్తుందని ఈ సందర్భంగా పరిశోధకులు కనుగొన్నారు. ఇది ప్రకృతితో ముడిపడి ఉండటంవల్ల ఫోకస్, ఆసక్తి, నేర్చుకునే సామర్థ్యం వంటివి పెరుగుతాయని చెబుతున్నారు. అంతేకాకుండా మూడ్ మెరుగుపడటం, ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతాయట. మానసిక ఆనందం, ఏకాగ్రత పెరుగుతాయి. ఇవన్నీ మెదడు సామర్థ్యాన్ని, జ్ఞాపక శక్తిని పెంచడమే కాకుండా పరోక్షంగా మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తాయని అధ్యయనం తెలిపింది.
మరిన్ని వీడియోల కోసం :
నో మోర్ డౌట్స్..కన్ఫార్మ్ చేసిన చెర్రీ
రామాయణ టీజర్ అంచనాలను అందుకుందా?
హద్దులు చెరిపేస్తున్న యంగ్ హీరోలు
గాజాలో కంటతడి పెట్టిస్తున్న చిన్నారుల ఆట దృశ్యం
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

