AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యుద్ధ సమయాల్లో పెరిగే బంగారం ధర.. ఇప్పుడు మాత్రం ఎందుకు తగ్గుతోంది?

సాధారణంగా సంక్షోభాల్లో బంగారం సురక్షిత పెట్టుబడి. అయితే అమెరికా-ఇరాన్ యుద్ధంలో విరుద్ధంగా, బంగారం ధరలు గణనీయంగా పడిపోయి, డాలర్ బలపడుతోంది. పెట్రోడాలర్ వ్యవస్థ, పెరుగుతున్న వడ్డీ రేట్లు దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు. చమురు కొనుగోళ్లకు డాలర్ డిమాండ్ పెరగడం, అధిక వడ్డీ రేట్లతో బాండ్లు ఆకర్షణీయంగా మారడం బంగారంపై ప్రభావం చూపుతున్నాయి.

SN Pasha
|

Updated on: Apr 05, 2026 | 4:02 PM

Share
ప్రపంచంలో పెద్ద భౌగోళిక రాజకీయ సంక్షోభాలు లేదా యుద్ధాలు సంభవించినప్పుడు, పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షిత పెట్టుబడి మార్గంగా ఎంచుకుంటారు. అయితే మార్చిలో ప్రారంభమైన అమెరికా, ఇరాన్‌ యుద్ధం నేపథ్యంలో ఈ సాంప్రదాయం విరుద్ధంగా మారిన దృశ్యం కనిపిస్తోంది. యుద్ధం తీవ్రతరం అవుతున్నప్పటికీ అమెరికా డాలర్‌ బలపడుతుండగా, బంగారం ధరలు గణనీయంగా పడిపోవడం మార్కెట్లలో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

1 / 5
మార్చి ప్రారంభంలో బంగారం ధరలు ఒక్క రోజులోనే రూ.8,500 వరకు పెరిగి, మళ్లీ సురక్షిత పెట్టుబడిగా నిలుస్తుందనే సంకేతాలు ఇచ్చాయి. అయితే యుద్ధం కొనసాగుతున్న కొద్దీ పరిస్థితి మారింది. మార్చి 23 నాటికి బంగారం ధర దాని గరిష్ట స్థాయి నుంచి సుమారు 14.3 శాతం పడిపోయి రూ.1,35,846కు చేరింది. మరోవైపు గతంలో బలహీనంగా ఉన్న డాలర్ ఇండెక్స్ ఈ సంక్షోభంలో పుంజుకుని, కేవలం ఒకే నెలలో 2 శాతానికి పైగా పెరిగింది.

2 / 5
ఈ మార్పుకు ప్రధాన కారణంగా నిపుణులు పెట్రోడాలర్ సిస్టమ్‌ను సూచిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ప్రధానంగా డాలర్లలోనే కొనుగోలు చేయబడుతుంది. హార్ముజ్‌ జలసంధి వద్ద సరఫరా అంతరాయం ఏర్పడడంతో చమురు ధరలు పెరిగాయి. ఫలితంగా చమురు దిగుమతి చేసుకునే దేశాలు ఎక్కువ డాలర్లు అవసరపడటం వల్ల గ్లోబల్ డిమాండ్ పెరిగి డాలర్ బలపడుతోంది.

3 / 5
ఇక పెరుగుతున్న చమురు ధరలు ద్రవ్యోల్బణ భయాలను కూడా పెంచుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అమెరికా వడ్డీ రేట్లు ఎక్కువకాలం ఉన్నత స్థాయిలో ఉండే అవకాశముందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. వడ్డీ రేట్లు పెరిగినప్పుడు, బాండ్లు, డాలర్ వంటి వడ్డీ ఇచ్చే ఆస్తులు పెట్టుబడిదారులకు మరింత ఆకర్షణీయంగా మారుతాయి. వడ్డీ లేని బంగారం ఈ సందర్భంలో వెనుకబడుతోంది.

4 / 5
Gold

Gold

5 / 5
Follow Us