ఓ అమ్మాయిని ప్రాణంగా ప్రేమించా.. కానీ.. నా పుట్టిన రోజు నాడే.. తన ఫెయిల్యూర్ లవ్ స్టోరీ చెప్పిన అడివి శేష్
హిట్ 2 తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న అడివి శేష్ ఇప్పుడు డెకాయిట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇప్పటివరకు చాలా డిఫరెంట్ సినిమాలు చేసిన ఈ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో మొదటి సారి ఓ ప్రేమ కథా చిత్రంలో నటించాడు.

సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్, గాడ్ ఫాదర్ లేకపోయినా హీరోగా రాణిస్తోన్న వారిలో అడివి శేష్ ఒకడు. మొదటల్లో సహాయక నటుడిగా, విలన్‌గా మెప్పించిన అతను ఇప్పుడు తెలుగులో క్రేజీ హీరోగా రాణిస్తున్నాడు. అంతేకాదు రచయితగా, దర్శకుడిగానూ సత్తా చాటుతున్నాడు. క్షణం, గూఢచారి, ఎవరు, మేజర్, హిట్ 2 సినిమాలతో హీరోగా సక్సెస్ లు అందుకుంటున్న అడివి శేష్ ఇప్పుడు డెకాయిట్ తో మన ముందుకు వస్తున్నాడు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ ప్రేమకథా చిత్రం ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో సినిమా ప్రమోషన్లలో బిజి బిజీగా ఉంటున్నాడు శేష. వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతున్నాడు. ఈ సందర్భంగా తన పర్సనల్ అండ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నాడు. తాజాగా ఓ సందర్భంలో తన బ్రేకప్ స్టోరీని కూడా షేర్ చేసుకున్నాడీ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో
‘కాలేజీ రోజుల్లోనే ఓ పంజాబీ అమ్మాయిని ప్రేమించాను. కొన్నాళ్లు బాగానే నడిచింది. అయితే ఆ తర్వాత ఇద్దరికీ కుదరక విడిపోయాం. విడిపోవడమే ఒక బాధనుకుంటే.. సరిగ్గా నా పుట్టినరోజు నాడే తను వేరొకరిని పెళ్లి చేసుకొని ఆ బాధను మరింత రెట్టింపు చేసింది. అందుకే ఆ తర్వాత రిలేషన్స్‌లో ఉన్నా, వాటిని పెళ్లి వరకూ తీసుకెళ్లే ధైర్యం చేయలేదు. ఇంట్లో వాళ్లు కూడా ‘పెళ్లెప్పుడు చేసుకుంటావ్?’ అని అడిగీ అడిగీ బాగా విసిగి పోయారు. ప్రస్తుతం నా దృష్టి మొత్తం సినిమాలపైనే ఉంది. ఎలాగైనా ఓ ప్రేమ కథా చిత్రంలో నటించాలనుకున్న నా కోరిక ‘డెకాయిట్’ సినిమాతో తీరనుంది’ అని అడివి శేష్ చెప్పుకొచ్చాడు.
డెకాయిట్ సినిమా ప్రమోషన్లలో అడివి శేష్..
View this post on Instagram
డెకాయిట్ సినిమా విషయానికి వస్తే.. మృణాళ్ ఠాకూర్ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే అనురాగ్ కశ్యప్, ప్రకాశ్ రాజ్ ,సునీల్, అతుల్ కులకర్ణి, కామాక్షి భాస్కర్ల తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. షానీల్ డియో ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్ & సోనీ పిక్చర్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు.
డెకాయిట్ సినిమా ట్రైలర్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




