AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Renu Desai: ‘అందుకే రేణు దేశాయ్‌ను తిట్టాం’.. పోలీసుల విచారణలో నిందితులు ఏం చెప్పారో తెలుసా? వీడియో

ప్రముఖ టాలీవుడ్ నటి రేణు దేశాయ్‌ను సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పదజాలంతో దూషించిన ఆరుగురు వ్యక్తులను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పోలీసుల విచారణలో ఈ ఆరుగురు చెప్పిన విషయాలు అందరినీ షాకింగ్ కు గురి చేస్తున్నాయి.

Renu Desai: 'అందుకే రేణు దేశాయ్‌ను తిట్టాం'.. పోలీసుల విచారణలో నిందితులు ఏం చెప్పారో తెలుసా? వీడియో
Renu Desai
Basha Shek
|

Updated on: Apr 05, 2026 | 12:34 PM

Share

సినిమాలకు దూరంగా ఉంటోన్న రేణూ దేశాయ్ సామాజిక అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా మూగజీవాల సంరక్షణ, సామాజిక అంశాలపై ఆసక్తికరమైన పోస్టులు, వీడియోలు షేర్ చేస్తుంటారు. ఈ క్రమంలో కొన్ని నెలల క్రితం హైదరాబాద్ నగరంలో వీధి కుక్కలపై దాడి ఘటనలు పెరిగిన సమయంలో రేణు దేశాయ్ స్పందించారు. ‘అన్ని కుక్కలు ప్రమాదకరం కాదు.. ఒకవేళ ఏదైనా కుక్క ఇబ్బంది కలిగిస్తుంటే సంబంధిత అధికారులకు లేదా మా స్వచ్ఛంద సంస్థకు సమాచారం ఇవ్వండి, మేమే వాటిని తీసుకెళ్తాం’ అని సూచించారు. అయితే రేణూ దేశాయ్ వ్యాఖ్యలపై కొందరు నెటిజన్లు చాలా తీవ్రంగా స్పందించారు. ఆమెతో పాటు ఆమె పిల్లలపై దారుణమైన కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేశారు. దీంతో ఈ వేధింపులను భరించలేకపోయిన రేణు దేశాయ్ హైదరాబాద్‌లోని గచ్చిబౌలి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఆమె ఫిర్యాదును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టి ఇప్పటివరకు ఆరుగురిని అరెస్ట్ చేశారు. మరికొంతమందిని గుర్తించే పనిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.ఈ క్రమంలో తనను అసభ్యకరంగా దూషించిన వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఒక వీడియోను విడుదల చేశారు రేణూ దేశాయ్..

ఇవి కూడా చదవండి

‘అరెస్టయిన వారిని పోలీసులు విచారించగా.. ఆమె ఒక సెలబ్రిటీ కాబట్టి, ఆమెను తిడితే తాము ఫేమస్ అవుతామనే ఉద్దేశంతోనే ఇలా చేశామని చెప్పారు. కేవలం సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ఇలాంటి నీచమైన పనులకు పాల్పడటం విచారకరం. బూతులు తిట్టి అనవసరంగా మీ జీవితాలను నాశనం చేసుకోవద్దు. మీరు అరెస్ట్ అయితే సమాజంలో మీ ఫ్యామిలీ పరువు పోతుంది. మీపై క్రిమినల్ రికార్డు ఉంటే భవిష్యత్తులో ఉద్యోగాలకు కూడా ఇబ్బంది అవుతుంది. ఒకవేళ మీరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు లేదా ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారైతే.. మీ కంపెనీ హెచ్ఆర్‌లకు కూడా ఫిర్యాదు చేస్తాను. అప్పుడు మీ కెరీర్ ముగిసిపోతుంది. అరెస్ట్ అయిన వారి వివరాలను బయటపెట్టి వారికి ఉచిత ప్రచారం కల్పించదలచుకోలేదు. ఒక వేళ వారి కుటుంబ సభ్యులకు ఆ విషయం తెలిస్తే జీవితాంతం ఒక బ్లాక్ మార్క్‌లా మిగిలిపోతుంది. సోషల్ మీడియా అంటే కేవలం విమర్శలు చేయడమే కాదు. ఇతరుల వ్యక్తిగత గౌరవాన్ని కాపాడటం కూడా ముఖ్యం. సెలబ్రిటీలను టార్గెట్ చేసి ఫేమస్ అవ్వాలనుకునే వారికి ఈ ఆరుగురి అరెస్ట్ ఒక గుణపాఠం కావాలి’ అని రేణూ దేశాయ్ ఆకాంక్షించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది.

రేణూ దేశాయ్ రిలీజ్ చేసిన వీడియో..

View this post on Instagram

A post shared by renu desai (@renuudesai)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us