AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shobha Shetty: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న బిగ్‌బాస్ ఫేమ్ శోభా శెట్టి.. వీడియో వైరల్.. నెటిజన్ల తీవ్ర ఆగ్రహం

కార్తీక దీపం సీరియల్ తో ఫేమస్ అయిన శోభా శెట్టి అలియాస్ మోనిత బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్ లో కంటెస్టెంట్ గా అడుగు పెట్టింది. టైటిల్ విజేతగా నిలవకపోయినా తన అందం, అట, మాట తీరుతో బుల్లితెర ఆడియెన్స్ కు బాగానే దగ్గరైంది.

Shobha Shetty: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న బిగ్‌బాస్ ఫేమ్ శోభా శెట్టి.. వీడియో వైరల్.. నెటిజన్ల తీవ్ర ఆగ్రహం
Shobha Shetty
Basha Shek
|

Updated on: Apr 03, 2026 | 4:02 PM

Share

సీరియల్ నటి శోభా శెట్టి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. పేరుకు కన్నడ నటి అయినా ఈ ముద్దుగుమ్మకు తెలుగులోనూ మంచి గుర్తింపు ఉంది. అగ్నిసాక్షి సీరియల్ తో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ కార్తీకదీపం సీరియల్ తో బుల్లితెర ఆడియన్స్ కు బాగా చేరువైంది. అందులో మోనిత పాత్రలో కరడుగట్టిన విలనిజాన్ని ప్రదర్శించింది. ఈ సీరియల్ ద్వారా వచ్చిన ఫేమ్ తో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది శోభ. విజేతా నిలకవపోయినా తన ఆట, మాట తీరుతో మరింత క్రేజ్ సంపాదించుకుంది. కన్నడ బిగ్ బాస్ 11లోనూ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది శోభ. అయితే అక్కడ ఎక్కువ కాలం ఉండలేక బయటకు వచ్చేసింది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత టీవీ షోలు, ప్రోగ్రాములు చేస్తూ బిజీ బిజీగా ఉంటోందీ అందాల తార. ఇదిలా ఉంటే య కార్తీకదీపం సీరియల్ లో తనతో పాటు కలిసి నటించిన యశ్వంత్ రెడ్డితో శోభా శెట్టి ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. తమ ప్రేమ విషయాన్ఇన బిగ్ బాస్ వేదికగా బయటపెట్టిందీ ముద్దుగుమ్మ. ఆ తర్వాత బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక ఇద్దరు నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. 2024 ఏప్రిల్ లో వీరి ఎంగేజ్మెంట్ గ్రాండ్ గా జరిగింది. ఆ తర్వాత 2025లో ఎంగేజ్మెంట్ యానివర్సరీ ని కూడా చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే వీరి నిశ్చితార్థం జరిగి మూడేళ్లయినా పెళ్లి చేసుకోలేదు. దీంతో ఈ ప్రేమ పక్షుల పెళ్లి కబురు కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇంతలోనే సడన్ గా పెళ్లి పీటలెక్కి అందరిని ఆశ్చర్యపరిచింది శోభా శెట్టి. తన ప్రియుడు యశ్వంత్ రెడ్డితో కలిసి ఏడడుగులు నడిచి అందరిని సర్ప్రైజ్ చేసింది.

ఇవి కూడా చదవండి

తన పెళ్లి వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది శోభా శెట్టి. దీంతో చాలా మంది ఈ ముద్గుగుమ్మకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. అదే సమయంలో ఈ పెళ్లి వెనుక ఉన్న అసలు కారణం తెలిసి అందరూ శోభపై తీవ్రంగా మండిపడుతున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. ఒక జ్యువెలరీ యాడ్ కోసం శోభా శెట్టి ఈ యాడ్ షూట్ చేసింది. తన ప్రియుడు యశ్వంత్ రెడ్డితో పెళ్లి పీటలెక్కినట్లు యాక్ట్ చేసింది. ఇది చూడడానికి బాగానే ఉన్నా డబ్బు కోసం పెళ్లిని ఇలా కమర్షియల్ గా మార్చడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఇలాంటివి చేయడం మానుకోవాలని బిగ్ బాస్ బ్యూటీకి సూచిస్తున్నారు. ఏది ఏమైనా శోభా శెట్టి పెళ్లి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో అటు వైరల్ గా మారింది. దీంతో పాటు భారీ ట్రోలింగ్ కూడా ఎదుర్కొంటుంది.

శోభా శెట్టి పెళ్లి వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us