భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వరావుపేటలో గ్యాస్ సిలిండర్ ధరల ప్రభావంపై ఒక వినూత్న ఆఫర్ ప్రారంభమైంది. ఎమ్వీఎస్ ఫుడ్ కోర్ట్ తమ వద్ద అదనంగా ఉన్న గ్యాస్ సిలిండర్ను అందజేసిన వారికి ఆ సిలిండర్ పైసలు వెనక్కి ఇచ్చి, ఖాళీ సిలిండర్ను అందిస్తూ, నెల రోజుల పాటు ఒక పూట ఉచిత టిఫిన్ అందిస్తోంది. ఈ ఆఫర్ను ఇప్పటికే కొందరు వినియోగించుకుంటున్నారు.