ఇదేం ట్విస్ట్.. సినిమాలకు స్టార్ హీరోయిన్ గుడ్ బై!
06 April 2026
Basha Shek
గత కొన్ని రోజులుగా ఈ స్టార్ హీరోయిన్ గురించి ఏదో ఒక వార్త నెట్టింట వైరలవుతోనే ఉంది. తాజాగా ఈ అమ్మడి గురించి ఒక షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.
ఈ మధ్యన సినిమాలు చేయకున్నా స్టార్ హీరోయిన్ త్రిష పేరు తెగ మార్మోగుతోంది. ముఖ్యంగా హీరో విజయ్ విషయంలో ఈ బ్యూటీ పేరు బాగా వినిపిస్తోంది.
విజయ్ భార్య విడాకుల పిటిషన్ దాఖలు చేయడంతో అనూహ్యంగా త్రిష పేరు తెరమీదకొచ్చింది. విజయ్‌తో ఆమెకు రిలేషన్ ఉందని ప్రచారం జరుగుతోంది.
ఆ తర్వాత వీరిద్దరు జంటగా ఓ పెళ్లికి హాజరు కావడంతో ఈ రూమర్లకు మరింత బలం చేకూరింది. ఇప్పుడు కోలీవుడ్‌లో ఈ టాపిక్ మరింత చర్చనీయాంశంగా మారింది.
ఇదిలా ఉంటే సుమారు గత 20 ఏళ్లుగా సినిమాలు చేస్తోన్న త్రిష త్వరలోనే సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పనుందని ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో తాజాగా కోలీవుడ్ సీనియర్ నటుడు, దర్శకుడు చిత్రా లక్ష్మణన్ త్రిష గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
త్రిష త్వరలోనే సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పనున్నారని ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతున్నాయి.
అయితే దర్శకుడు చిత్రా లక్ష్మణన్ చేసిన కామెంట్స్ పై ఇప్పటి వరకు త్రిష టీమ్ నుంచి ఎలాంటి అధికారిక స్పందనైతే రాలేదు.
సినిమా ఇండస్ట్రీలో అతి సుదీర్ఘ కాలం పాటు హీరోయిన్ గా చేస్తోన్న ముద్దుగుమ్మల్లో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఒకరు.
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్
ఇక్కడ క్లిక్ చేయండి..