నా లవర్‌తో మాట్లాడిస్తారా ?? లేదా ఇక్కడ నుండి దూకేయమంటారా?
ప్రేమ పేరుతో యువకులు చేసే వింత చేష్టలు ప్రాణాల మీదకు తెస్తాయి. జయశంకర్ భూపాలపల్లిలో రాజు అనే యువకుడు తన ప్రేయసి ఫోన్ బ్లాక్ చేయడంతో 11kv విద్యుత్ టవర్ ఎక్కి మూడు గంటలు హల్‌చల్ చేశాడు. ఆమెతో మాట్లాడించాలని డిమాండ్ చేశాడు. పోలీసులు నమ్మబలికి, చాకచక్యంగా అతడిని క్షేమంగా కిందకు దించారు. ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టినందుకు రాజుపై కేసు నమోదైంది.
ప్రేమ పేరుతో యువకులు చేసే వింత చేష్టలు ఒక్కోసారి ప్రాణాల మీదకు తెస్తుంటాయి. తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. తన ప్రేయసితో మాట్లాడించాలంటూ ఓ యువకుడు ఏకంగా 11kv హైటెన్షన్ విద్యుత్ టవర్ ఎక్కి మూడు గంటల పాటు హల్‌చల్ చేశాడు. ధర్మరావుపేట గ్రామానికి చెందిన సూర రాజు అనే యువకుడు ఒక యువతిని ప్రేమించాడు. అయితే, సదరు యువతి ఇటీవల రాజు ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేసింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రాజు, మోరంచ సమీపంలోని విద్యుత్ ట్రాన్స్‌మిషన్ టవర్ ఎక్కి హంగామా సృష్టించాడు. తన ప్రేయసితో వెంటనే మాట్లాడించాలని, లేనిపక్షంలో కిందకు దిగే ప్రసక్తే లేదని మొండికేశాడు. టవర్ పై యువకుడిని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సుమారు మూడు గంటల పాటు రాజుతో చర్చలు జరిపారు. “నువ్వు కిందకు వస్తే మీ ప్రియురాలి ఇంటికి తీసుకెళ్లి మాట్లాడిస్తాం” అని పోలీసులు నమ్మబలికి, ఎట్టకేలకు అతడిని క్షేమంగా కిందకు దించారు. దీంతో స్థానికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రాణాలతో చెలగాటం ఆడినందుకు గాను రాజుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇలాంటి వ్యక్తులు మీ జీవితం లో ఉంటే.. త్వరగా ముసలివారు అవుతారు !
పెళ్లికి ముందు సూది మందు.. ఒక్కటి పడితే చాలు బరువు తగ్గాల్సిందే
ప్రాణం పోసిన స్నేక్ క్యాచర్‌కు నాగుపాము కృతజ్ఞత.. ఏం చేసిందో చూడండి
మళ్లీ కట్టెల పొయ్యిలపై ప్రజల వంటలు.. బయో గ్యాస్‌కూ పెరిగిన డిమాండ్ !!
నా లవర్‌తో మాట్లాడిస్తారా ?? లేదా ఇక్కడ నుండి దూకేయమంటారా?
పెళ్లికి ముందు సూది మందు.. ఒక్కటి పడితే చాలు బరువు తగ్గాల్సిందే
ప్రాణం పోసిన స్నేక్ క్యాచర్‌కు నాగుపాము కృతజ్ఞత..
మళ్లీ కట్టెల పొయ్యిలపై వంటలు.. బయో గ్యాస్‌కూ పెరిగిన డిమాండ్ !!
ఇంతందంగా ఉన్నావే.. నెలవంకలా భూమి
క్రికెట్ మ్యాచ్‌లో వివాదం.. కత్తిపోట్లతో యువకుడి మృతి
మీర్రా దొంగలంటే.. స్టేషన్ ముందు షాపునే కొల్లగొట్టేశారు

