తెలుగులో ఈ ముద్దుగుమ్మకు తిరిగి ఛాన్స్ లు వస్తాయా.!

Rajeev 

5 April 2026

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది.. బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ.

తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనస్సులో స్థానం సంపాదించుకుంది ఈ అందాల భామ. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. 

ఆతర్వాత రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ సినిమాలో హీరోయిన్ గా నటించింది. తర్వాత తిరిగి బాలీవుడ్ కు చెక్కేసింది ఈ చిన్నది.  

చాలా కాలం తర్వాత తిరిగి రామ్ చరణ్ సినిమాతోనే టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇచ్చింది. శంకర్ దర్శకత్వంలో వచ్చిన గేమ్ ఛేంజర్ సినిమాలో నటించింది.

ఈ సినిమా కూడా భారీ అంచనాల మధ్య విడుదలై డబుల్ డిజాస్టర్ అయ్యింది. ఇక ఇప్పుడు మరో పాన్ ఇండియా సినిమాతో రాబోతుంది. 

బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా ను ప్రేమించి పెళ్లి చేసుకుంది ఈ అమ్మడు. ఇటీవలే తల్లిగానూ ప్రమోషన్ అందుకుంది కియారా.

బిడ్డ పుట్టిన తర్వాత ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది కియారా అద్వానీ. యష్ హీరోగా నటిస్తున్న సినిమాలో కియారా హీరోయిన్ గా నటిస్తుంది.