AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ట్రాన్స్‌జెండర్‌లకు గుడ్‌న్యూస్.. తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం.. జీవితాలు మారబోతున్నాయి..!

ట్రాన్స్‌జెండర్‌ల సామాజిక, ఆర్థిక సాధికారత దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక కార్యక్రమాన్ని ప్రారంభించింది. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గచ్చిబౌలిలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ (NITHM)లో ప్రత్యేక నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ట్రాన్స్‌జెండర్‌లకు గుడ్‌న్యూస్.. తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం.. జీవితాలు మారబోతున్నాయి..!
Skill Training For Transgenders
Prabhakar M
| Edited By: |

Updated on: Apr 05, 2026 | 3:13 PM

Share

ట్రాన్స్‌జెండర్‌ల సామాజిక, ఆర్థిక సాధికారత దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక కార్యక్రమాన్ని ప్రారంభించింది. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గచ్చిబౌలిలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ (NITHM)లో ప్రత్యేక నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా ట్రాన్స్‌జెండర్‌లకు స్థిరమైన జీవనోపాధి అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలతో రూపొందించిన ఈ కార్యక్రమం ట్రాన్స్‌జెండర్‌లకు గౌరవప్రదమైన జీవితం అందించే దిశగా కీలకంగా మారనుంది. ఇప్పటికే ట్రాఫిక్ నియంత్రణ, మెట్రో భద్రతా సిబ్బందిగా ట్రాన్స్‌జెండర్‌లను నియమిస్తూ ప్రభుత్వం కొత్త మార్గాన్ని చూపింది. ఇప్పుడు నైపుణ్యాభివృద్ధి ద్వారా స్వయం ఉపాధి అవకాశాలపై ఫోకస్ పెంచింది. ఈ క్రమంలో కార్ డ్రైవింగ్, హోటల్ మేనేజ్‌మెంట్, డ్రోన్ పైలటింగ్ వంటి మూడు ప్రధాన రంగాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిక్షణల ద్వారా ట్రాన్స్‌జెండర్‌లు ఉద్యోగాలు మాత్రమే కాకుండా స్వయం ఉపాధి అవకాశాలను కూడా సృష్టించుకునే అవకాశం ఉంటుంది.

డ్రైవింగ్ శిక్షణ కోసం Maruti Driving School సహకారం తీసుకుంటుండటం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఇక డ్రోన్ టెక్నాలజీ వినియోగం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఫోటోగ్రఫీ, వీడియో గ్రఫీ, వ్యవసాయం, ఈవెంట్ మేనేజ్‌మెంట్ వంటి రంగాల్లో భారీ అవకాశాలు ఉన్నాయని మంత్రి వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా మొత్తం 91 మంది ట్రాన్స్‌జెండర్‌లు లబ్ధి పొందనుండగా, ఇందుకు రూ.17.72 లక్షలు ఖర్చు చేస్తున్నారు. శిక్షణతో పాటు ఉపాధి కల్పనపై కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.

ప్రభుత్వం కేవలం సంక్షేమ పథకాలకే పరిమితం కాకుండా, అవకాశాలను సృష్టించే దిశగా అడుగులు వేస్తోందని మంత్రి స్పష్టం చేశారు. ట్రాన్స్‌జెండర్‌లను ఓటర్లుగా కాకుండా సమాజంలో భాగస్వాములుగా గుర్తించడం ఈ ప్రభుత్వ ప్రత్యేకతగా పేర్కొన్నారు. ట్రాన్స్‌జెండర్‌లకు మంత్రి ఇచ్చిన సందేశం స్పష్టంగా ఉంది — శిక్షణను ఉపయోగించుకుని స్వయం ఉపాధి సాధించాలి, ఆత్మగౌరవంతో జీవించాలి. ప్రభుత్వం పూర్తి స్థాయిలో వెన్నంటి ఉంటుందని భరోసా ఇచ్చారు. సామాజిక న్యాయం, ఆర్థిక బలం, సమాన అవకాశాలు వంటి ఈ మూడు ఆధారాలపై తెలంగాణ మోడల్ ముందుకు సాగుతోందని ప్రభుత్వం చెబుతోంది. ట్రాన్స్‌జెండర్ అభివృద్ధిలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని అధికారులు పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Follow Us