AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TGSRTC: ఎంజీబీఎస్, జేబీఎస్ తరహాలో హైదరాబాద్‌లో మరో భారీ బస్ టెర్మినల్.. ఎక్కడంటే..?

ప్రస్తుతం హైదరాబాద్‌లో ఎంజీబీఎస్, జేబీఎస్ బస్ టెర్మినల్ ఉన్నాయి. ఇక్కడ నుంచి తరచూ వేలాది బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. లక్షలాది మంది ప్రయాణికులు ఈ బస్ టెర్మినల్ నుంచి తరచూ రాకపోకలు సాగిస్తుంటారు. అయితే నగరంలో మరో పెద్ద బస్ టెర్మినల్ నిర్మాణానికి అడుగులు పడ్డాయి.

TGSRTC: ఎంజీబీఎస్, జేబీఎస్ తరహాలో హైదరాబాద్‌లో మరో భారీ బస్ టెర్మినల్.. ఎక్కడంటే..?
Tsrtc
Venkatrao Lella
|

Updated on: Apr 05, 2026 | 12:56 PM

Share

హైదరాబాద్ వాసులకు భారీ శుభవార్త. నగరంలో మరో భారీ బస్ టెర్మినల్ నిర్మాణానికి టీజీఎస్ఆర్టీసీ అడుగులు వేసింది. ఎంజీబీఎస్, జేబీఎస్ తరహాలోనే పెద్ద బస్ టెర్మినల్ నిర్మించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ కొత్త బస్ టెర్మినల్ 100 ఎకరాల్లో ఉంటుంది. జీడిమెట్లలోని గాజులరామారంలో దీనిని నిర్మించాలని భావిస్తున్నారు. ఇక్కడ అంతరాష్ట్ర బస్సుల కోసం ప్రత్యేక బస్ టెర్మినల్, సిటీ బస్సులకు మరో టెర్మినల్, ఎలక్ట్రిక్ బస్సుల కోసం ప్రత్యేక ఛార్జింగ్ స్టేషన్ వంటివి ఏర్పాటు చేయనున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బస్సుల కోసం ఈ ప్రత్యేక టెర్మినల్ ఉపయోగపడనుంది. ఇది నిర్మిస్తే ఎంజీబీఎస్, జేబీఎస్‌పై ఒత్తిడి తగ్గుతుంది.

100 ఎకరాలు కేటాయింపు

ఇక ఈ బస్ టెర్మినల్ కోసం ఇప్పటికే గాజులరామారంలో 100 ఎకరాల కేటాయింపు పూర్తయింది. ఈ మేరకు మేడ్చల్-మల్కాజ్ గిరి కలెక్టర్ ఈ భూమిని టీజీఎస్‌ఆర్టీసీకి కేటాయించారు. వీటిల్లో 30 ఎకరాలను అంతరాష్ట్ర బస్సుల కోసం, 20 ఎకరాలు సిటీ బస్ టెర్మినల్ కోసం కేటాయించారు. ఇక ఎలక్ట్రిక్ బస్సుల కోసం 10 ఎకరాలు కేటాయించారు. 15 ఎకరాల్లో ప్రత్యేక ఛార్జింగ్ స్టేషన్ ఉంటుంది. ఈ భారీ బస్ టెర్మినల్‌లో అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. ఇక దుకాణాలు కూడా పెద్ద సంఖ్యలో ఉంటాయి. నగరంలోకి వచ్చే బస్సులను ఈ కొత్త టెర్మినల్‌కు మళ్లిస్తారు. దీని వల్ల ట్రాఫిక్ రద్దీ కూడా తగ్గుతుంది.

తగ్గనున్న ట్రాఫిక్ సమస్య

ప్రస్తుతం కూకట్ పల్లి, గాజులరామారం, పటాన్ చెర్వు, బీహెచ్ఈఎల్ వంటి ప్రాంతాల్లో బస్సులను ఆపివేస్తున్నారు. ఇక మహారాష్ట్ర, కర్ణాటక నుంచి వచ్చే బస్సులు కూడా రోడ్లపైనే నిలిపివేయడం వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. జగద్దిరిగుట్లలో 60 బస్సులు నైట్ హాల్ట్‌లో ఉంటున్నాయి. దీంతొ కొత్త బస్సు టెర్మినల్ రాకతో సమస్య తొలగిపోనుంది. ఇక హైదరాబాద్‌లో కొత్త బస్ డిపోలను కూడా నిర్మించేందుకు ఆర్టీసీ సిద్దమవుతోంది. మరో 10 బస్ డిపోలను ఏర్పాటు చేయాలని కసరత్తులు చేస్తోంది. దీంతో 10 ఎకరాల్లో ఎలక్ట్రిక్ బస్ డిపోను ఏర్పాటు చేయనున్నారు. ఇక అండ్ గ్రౌండ్‌లో వాహనదారలు కోసం మల్టీలెవల్ పార్కింగ్ యార్డ్ కూడా అందుబాటులో ఉంచనున్నారు.

Follow Us
కొరడా చేతపట్టి వీధుల్లోకి ప్రభుత్వ బడి టీచర్‌.. అసలు సంగతి ఏమంటే?
కొరడా చేతపట్టి వీధుల్లోకి ప్రభుత్వ బడి టీచర్‌.. అసలు సంగతి ఏమంటే?
ఒకే ఓవర్‌లో 7 సిక్సర్లు.. క్రికెట్ చరిత్రలోనే తొలిసారి ఇలా..
ఒకే ఓవర్‌లో 7 సిక్సర్లు.. క్రికెట్ చరిత్రలోనే తొలిసారి ఇలా..
ఆఫ్ఘాన్ డైరెక్ట్‌గా క్వాలిఫై అయింది.. వెస్టిండీస్ కాలేదు! ఎందుకు?
ఆఫ్ఘాన్ డైరెక్ట్‌గా క్వాలిఫై అయింది.. వెస్టిండీస్ కాలేదు! ఎందుకు?
ఆ సినిమాకు ఫస్ట్ ఛాన్స్ నేనే.. కానీ రిజెక్ట్ చేయడానికి కారణం ఇదే.
ఆ సినిమాకు ఫస్ట్ ఛాన్స్ నేనే.. కానీ రిజెక్ట్ చేయడానికి కారణం ఇదే.
వరుణ యాగం.. నీటిలో కూర్చొని 11 మంది వేద పండితుల పూజలు!
వరుణ యాగం.. నీటిలో కూర్చొని 11 మంది వేద పండితుల పూజలు!
ఈ చిట్కా తో బెండకాయ వేపుడు జిగురు లేకుండా పొడిపొడిగా చేసేయండి
ఈ చిట్కా తో బెండకాయ వేపుడు జిగురు లేకుండా పొడిపొడిగా చేసేయండి
పాక్షిక సూర్య గ్రహణం తర్వాత వారి జీవితాల్లో శుభాలు..!
పాక్షిక సూర్య గ్రహణం తర్వాత వారి జీవితాల్లో శుభాలు..!
పచ్చిమిర్చి పచ్చడి ఇలా చేసి.. వేడి అన్నంలో నెయ్యితో అదిరిపోద్ది!
పచ్చిమిర్చి పచ్చడి ఇలా చేసి.. వేడి అన్నంలో నెయ్యితో అదిరిపోద్ది!
విగతజీవులుగా దంపతులు.. సెల్ఫీ వీడియోతో షాకింగ్ ట్విస్ట్!
విగతజీవులుగా దంపతులు.. సెల్ఫీ వీడియోతో షాకింగ్ ట్విస్ట్!
తొలి టెస్ట్‌ నుంచి ఆ ఇద్దరు స్టార్ బ్యాటర్లు ఔట్..?
తొలి టెస్ట్‌ నుంచి ఆ ఇద్దరు స్టార్ బ్యాటర్లు ఔట్..?