‘అన్‌స్టాపబుల్’.. ఇరాన్ పై సీఐఏ షాకింగ్ రిపోర్ట్
ఇరాన్ వెన్నువిరిచామనీ, త్రివిధ దళాల తిక్క కుదర్చామని, క్షిపణుల పనిపట్టామని ఆయన ఒకపక్క చెబుతూంటే, మరోపక్క ఇరాన్ తలెగరేసింది. సత్వరమే ఒప్పందానికి రాకుంటే, రాతియుగానికి పంపేస్తానన్న ట్రంప్ హెచ్చరికలను ఇరాన్ లక్ష్యపెట్టలేదంటూ బుధవారం నాటి ట్రంప్ ప్రసంగం ఆరంభం కావడంతోనే ఇజ్రాయెల్ మీద ఇరాన్ క్షిపణుల మోత ప్రారంభించింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల తీవ్రతను లెక్కచేయకుండా, పోరాడుతూనే ఉంది. శత్రువు పనిబట్టే వరకు దాడులు కొనసాగిస్తామని, తమ వద్ద క్షిపణి, డ్రోన్ల నిల్వలు ఇంకా గణనీయంగా ఉన్నాయని ఇరాన్ స్పష్టం చేస్తోంది.
అమెరికా, ఇజ్రాయెల్ భారీ దాడులు జరిపి నెల రోజులు దాటినా, ఇరాన్ సైనిక సామర్థ్యం ఇంకా గణనీయంగానే ఉందని అమెరికా నిఘా వర్గాల తాజా అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. ఇరాన్‌కు చెందిన దాదాపు సగం క్షిపణి లాంచర్లు చెక్కుచెదరలేదని, వేలాది వన్-వే ఎటాక్ డ్రోన్లు ఇంకా వారి అమ్ములపొదిలో భద్రంగా ఉన్నాయని సీఎన్ఎన్ వెల్లడించింది. భూగర్భంలో విస్తృతమైన సొరంగాలు, గుహల నెట్‌వర్క్‌లో తన క్షిపణి లాంచర్లను దాచడం వల్లే ఇరాన్ ఈ నష్టం నుంచి తప్పించుకోగలిగిందని, వాటిని అమెరికా ధ్వంసం చేయడం కష్టంగా మారిందని నిఘా వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మరోవైపు తమ దేశంలోని వంతెనపై దాడి ఘటనపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చీ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. “పౌరుల సదుపాయాలపై దాడి చేయడం శత్రువు నైతిక పరాజయానికి ప్రతీక’ అని ఆయన ఎద్దేవా చేశారు. ఇరాన్‌ను పూర్తిగా నాశనం చేస్తామని, ఆ దేశాన్ని తిరిగి ‘రాతి యుగం’లోకి నెట్టేస్తామంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు టెహ్రాన్ ఘాటుగా స్పందించింది. ట్రంప్ తన సైనికులను సమాధుల్లోకి తీసుకెళ్తున్నారని, 250 ఏళ్ల చరిత్ర కలిగిన అమెరికా.. 6 వేల సంవత్సరాల చరిత్ర ఉన్న తమ నాగరికతను బెదరించడం వారి భ్రమ అని ఇరాన్ స్పందించింది.
మరిన్ని వీడియోల కోసం :
నో మోర్ డౌట్స్..కన్ఫార్మ్ చేసిన చెర్రీ
రామాయణ టీజర్ అంచనాలను అందుకుందా?
హద్దులు చెరిపేస్తున్న యంగ్ హీరోలు
గాజాలో కంటతడి పెట్టిస్తున్న చిన్నారుల ఆట దృశ్యం
‘అన్‌స్టాపబుల్’.. ఇరాన్ పై సీఐఏ షాకింగ్ రిపోర్ట్
ట్రెక్కర్ల ఆహారంలో బేకింగ్ సోడా కలిపి.. ఎవరెస్ట్‌పై రూ.186 కోట్ల
ఒకే ఒక్కడు.. అణుబాంబు మీద పడ్డా ప్రాణాలతో ..
డబ్బాలో ఇరుక్కున్న శునకం తల.. ఏం చేసిందో తెలుసా!
పక్షులను గమనించే వారిలో.. ఊహించని ఆరోగ్య ప్రయోజనాలు!
దుకాణం నడిపే ఆడవాళ్లు జాగ్రత్త..!
పెళ్లి విందులో మందు లేదా.. అయితే పైసలివ్వాల్సిందే

