AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నెరవేరిన జీవిత లక్ష్యం.. పట్టుదలతో అటెండర్‌గా పనిచేసిన చోటే ఇప్పుడు ఇలా..!

ఒకప్పుడు అదే కార్యాలయంలో అధికారులు చెప్పిన పనులు చేయడం ఆయన డ్యూటీ. నేడు అదే కార్యాలయంలో ఉన్నతాధికారిగా బాధ్యతలు స్వీకరించారు. పట్టుదలతో విద్యా అర్హతలు పెంచుకుంటూ అంచెలంచెలుగా ఎదిగారు. పట్టుదల ఉంటే చిన్న ఉద్యోగం నుండి ఉన్నత స్థానానికి ఎదగవచ్చని నిరూపించారు ఈయన. నాడు అటెండర్ గా.. నేడు అదే కార్యాలయంలో తహసీల్దార్‌గా బాధ్యతలు చేపట్టారు.

నెరవేరిన జీవిత లక్ష్యం.. పట్టుదలతో అటెండర్‌గా పనిచేసిన చోటే ఇప్పుడు ఇలా..!
Nadigudem Tashildar
M Revan Reddy
| Edited By: |

Updated on: Apr 05, 2026 | 3:15 PM

Share

ఒకప్పుడు అదే కార్యాలయంలో అధికారులు చెప్పిన పనులు చేయడం ఆయన డ్యూటీ. నేడు అదే కార్యాలయంలో ఉన్నతాధికారిగా బాధ్యతలు స్వీకరించారు. పట్టుదలతో విద్యా అర్హతలు పెంచుకుంటూ అంచెలంచెలుగా ఎదిగారు. పట్టుదల ఉంటే చిన్న ఉద్యోగం నుండి ఉన్నత స్థానానికి ఎదగవచ్చని నిరూపించారు ఈయన. నాడు అటెండర్ గా.. నేడు అదే కార్యాలయంలో తహసీల్దార్‌గా బాధ్యతలు చేపట్టారు. అటెండర్ గా ఉద్యోగ జీవితం ప్రారంభించిన చోటే కార్యాలయానికి బాసుగా నియమితులై ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇంతకు ఆ అధికారి ఎవరో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!

సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం రాఘవపురం గ్రామానికి చెందిన సోమపొంగు భద్రయ్యకు ఏడుగురు సంతానం. అందులో సూరయ్య మూడో వ్యక్తి. 1995 సంవత్సరంలో నడిగూడెం తహసీల్దార్ కార్యాలయంలో అటెండర్‌గా పనిచేసిన సోమపొంగు భద్రయ్య అనారోగ్య కారణాలతో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. కారుణ్య నియామకంలో తండ్రి ఉద్యోగాన్ని సూరయ్య పొందారు.1995 జూన్ నుంచి 2000 సంవత్సరం వరకు సూరయ్య అటెండర్‌గా కొనసాగారు. ఆ సమయంలోనే ఈ కార్యాలయంలో తాసిల్దార్‌గా ఒక్క రోజైనా పని చేయాలని కలలు కన్నాడు.

నడిగూడెం తర్వాత మునగాల ఎమ్మార్వో కార్యాలయంలో అటెండర్‌గా సూరయ్య పనిచేశాడు. 2006లో నడిగూడెం తహసిల్దార్ కార్యాలయంలో అటెండర్ గా పని చేస్తున్న సమయంలో ప్రమోషన్ పొంది మఠంపల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధుల్లో చేరారు. రెండేళ్లు పనిచేసిన తర్వాత 2008లో నడిగూడెం కార్యాలయానికి సీనియర్ అసిస్టెంట్‌గా బదిలీపై వెళ్లారు. 2010లో ఉమ్మడి మేళ్లచెరువు మండలానికి ఆర్ఐగా పదోన్నతి పై వెళ్లారు. ఆ తర్వాత మఠంపల్లి, నడిగూడెం ఆర్ఐగా పని చేశారు.

విధుల్లో అనుభవంతోపాటు విద్యార్హతలను పెంచుకున్న సూరయ్య రెవిన్యూ శాఖలో సీనియర్ అసిస్టెంట్ గా ప్రమోషన్ పొందారు. ఆ తర్వాత 2017లో మఠంపల్లి డిప్యూటీ తహసీల్దార్‌గా పని చేశారు. మోతే, కోదాడలలో డిప్యూటీ తహసిల్దార్ గా విధులు నిర్వర్తించారు. 2021లో చింతల పాలెంలో 11 నెలల పాటు ఇన్ ఛార్జీ తహసీల్దార్ గా పనిచేశారు. పదోన్నతితో ఈ ఏడాది మార్చి 31న నడిగూడెం తహసీల్దార్ ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. 30 ఏళ్ల క్రితం అటెండర్ గా ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించిన కార్యాలయానికి తిరిగి తహసీల్దార్ రావడం చాలా ఆనందంగా ఉందని సూరయ్య చెబుతున్నారు. అటెండర్ గా పని చేసిన కార్యాలయంలో ఒక్కరోజైనా తహసీల్దారుగా పనిచేయాలనే నా జీవిత లక్ష్యాన్ని నెరవేరిందని అంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us