AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: “రెండు బస్తాలైనా ఇప్పించండి సారూ..” యూరియా కోసం సిబ్బంది కాళ్లపై పడ్డ అన్నదాత!

దేశానికి అన్నం పెట్టే అన్నదాతకు ఎరువుల కష్టాలు తప్పడం లేదు. పంట చేతికి వచ్చే కీలక సమయంలో యూరియా కోసం రైతులు పడుతున్న అవస్థలు ఆందోళన కలిగిస్తున్నాయి. మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేట పీఏసీఎస్ కేంద్రం వద్ద చోటుచేసుకున్న ఓ ఘటన రైతుల దుస్థితికి అద్దం పడుతోంది. యూరియా బస్తాలు దొరకక తీవ్ర ఆవేదనకు గురైన ఓ రైతు.. కనీసం రెండు బస్తాలైనా ఇప్పించాలంటూ సొసైటీ సిబ్బంది కాళ్లపై పడి వేడుకున్నాడు.

Telangana: “రెండు బస్తాలైనా ఇప్పించండి సారూ..” యూరియా కోసం సిబ్బంది కాళ్లపై పడ్డ అన్నదాత!
Farmer Tears Over Urea
P Shivteja
| Edited By: |

Updated on: Aug 12, 2026 | 4:42 PM

Share

దేశానికి అన్నం పెట్టే అన్నదాతకు ఎరువుల కష్టాలు తప్పడం లేదు. పంట చేతికి వచ్చే కీలక సమయంలో యూరియా కోసం రైతులు పడుతున్న అవస్థలు ఆందోళన కలిగిస్తున్నాయి. మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేట పీఏసీఎస్ కేంద్రం వద్ద చోటుచేసుకున్న ఓ ఘటన రైతుల దుస్థితికి అద్దం పడుతోంది. యూరియా బస్తాలు దొరకక తీవ్ర ఆవేదనకు గురైన ఓ రైతు.. కనీసం రెండు బస్తాలైనా ఇప్పించాలంటూ సొసైటీ సిబ్బంది కాళ్లపై పడి వేడుకున్నాడు.

వానాకాలం పంటల సాగు చివరి దశకు చేరుకున్నప్పటికీ రైతులకు ఎరువుల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. పంటకు కీలక సమయంలో యూరియా అందకపోతే దిగుబడిపై ప్రభావం పడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. రంగంపేట పీఏసీఎస్ కేంద్రం వద్ద యూరియా కోసం రోజుల తరబడి రైతులు తిరుగుతున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త యాప్ ద్వారా ఎరువులు బుక్ చేసుకోవాల్సి రావడం చిన్నకారు, నిరక్షరాస్య రైతులకు ఇబ్బందిగా మారిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాప్‌లో బుకింగ్ ఎలా చేసుకోవాలో తెలియక నేరుగా సొసైటీ కేంద్రాలకు వస్తున్న రైతులకు.. అక్కడ స్టాక్ లేదనే సమాధానం ఎదురవుతోంది.

ఈ క్రమంలోనే తన పొలానికి అవసరమైన యూరియా కోసం వచ్చిన ఓ రైతు.. తనకు ఎక్కువ బస్తాలు అవసరం లేదని, కేవలం రెండు బస్తాలైనా ఇప్పించాలని సిబ్బందిని వేడుకున్నాడు. ఎంత ప్రాధేయపడినా ఫలితం లేకపోవడంతో తీవ్ర భావోద్వేగానికి గురై సిబ్బంది కాళ్లపై పడి సాష్టాంగ నమస్కారం చేశాడు. అయినప్పటికీ యూరియా లభించకపోవడంతో నిరాశగా వెనుదిరిగాడు.

రైతు కన్నీరు పెట్టుకున్న ఈ దృశ్యం అక్కడున్న వారిని కలచివేసింది. సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు.. క్షేత్రస్థాయిలో రైతులకు సులభంగా ఎరువులు అందేలా చర్యలు తీసుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు. యూరియా కొరతను వెంటనే పరిష్కరించి పంట కీలక దశలో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు.

రైతు ఆవేదన వీడియోను ఇక్కడ చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
తీరం తాకిన తీవ్ర వాయుగుండం.. ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు
తీరం తాకిన తీవ్ర వాయుగుండం.. ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు
దిష్టి తగిలిందా? ఉప్పు, మిరపకాయలు, ఆవాలతో ఇలా చేస్తే తొలగిపోతుందట
దిష్టి తగిలిందా? ఉప్పు, మిరపకాయలు, ఆవాలతో ఇలా చేస్తే తొలగిపోతుందట
సూర్యుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులకు డబ్బు, ఉద్యోగంలో అదృష్టం!
సూర్యుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులకు డబ్బు, ఉద్యోగంలో అదృష్టం!
సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం
సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం
16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..!
16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..!
అన్నవరం, ద్రాక్షారామం సహా 5 ప్రముఖ ఆలయాల దర్శనం.. హైదరాబాద్ నుంచి
అన్నవరం, ద్రాక్షారామం సహా 5 ప్రముఖ ఆలయాల దర్శనం.. హైదరాబాద్ నుంచి
వాహనం చోరీకి గురైందా? ఇక పై నోటెన్షన్.. ఇట్టే దొరుకుతుంది!
వాహనం చోరీకి గురైందా? ఇక పై నోటెన్షన్.. ఇట్టే దొరుకుతుంది!
50 ఏళ్లకే పింఛన్!బ్యాంక్‌ అకౌంట్‌ లేదా? అప్లికేషన్‌లో కొత్త రూల్‌
50 ఏళ్లకే పింఛన్!బ్యాంక్‌ అకౌంట్‌ లేదా? అప్లికేషన్‌లో కొత్త రూల్‌
ఆటోలో దొరికిన నిధి.. డ్రైవర్ డెసిషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ఆటోలో దొరికిన నిధి.. డ్రైవర్ డెసిషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
దీపావళి పండు తర్వాత వీరి జీవితంలో కొత్త వెలుగులు.. అద్భుతమైన లాభా
దీపావళి పండు తర్వాత వీరి జీవితంలో కొత్త వెలుగులు.. అద్భుతమైన లాభా