AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పులిహోరకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..? వందల ఏళ్ల నాటి కథ ఇది!

దక్షిణ భారతదేశంలోని ప్రముఖ దేవాలయాలకు వెళ్లినప్పుడు మనకు మొదటగా గుర్తుకువచ్చేది అక్కడ లభించే కమ్మని పులిహోర ప్రసాదం. ఇంట్లో ఎంత శ్రద్ధగా తయారుచేసినా, గుడిలో ఇచ్చే ప్రసాదం పులిహోర రుచే వేరుగా ఉంటుంది. కేవలం నోరూరించే రుచికే కాకుండా, పులిహోరకు వెనుక గొప్ప ఆధ్యాత్మిక ప్రాశస్త్యం, ఆయుర్వేద ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

పులిహోరకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..? వందల ఏళ్ల నాటి కథ ఇది!
Temple Prasadam
Jyothi Gadda
|

Updated on: Aug 13, 2026 | 4:09 PM

Share

దక్షిణ భారతదేశ దేవాలయాలలో లభించే పులిహోర కేవలం రుచికరమైన ప్రసాదం మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరంగా ఎంతో ప్రాముఖ్యత కలిగింది. పులిహోర తయారీలో ఉపయోగించే చింతపండు, పసుపు, ఇంగువ, మిరియాలు, ఆవాలు, కరివేపాకు వంటి సుగంధ ద్రవ్యాలు జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు శరీరానికి రోగనిరోధక శక్తిని అందిస్తాయి. ఆయుర్వేదం ప్రకారం ఇది త్రిదోషాలను సమతుల్యం చేస్తుంది. ఈ పులిహోర ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు చూద్దాం..

అసలు పులిహోర ఎలా పుట్టింది అనే విషయానికి వస్తే.. దక్షిణ భారతీయ భాషల నుంచి వచ్చింది పులిహోర. ఇందులో పులి అంటే చింతపండు రుచి, హోర అంటే అన్నం లేదా వండిన బియ్యానికి సంబంధించిన పదం. ఈ పులిహోరను తమిళంలో పులియోదరై, కన్నడంలో పులియోగరే అని పిలుస్తారు. అందువల్ల పులిహోర అంటే పులుపు అన్నం అని అర్థం. ఇది కేవలం వంటకం కాదు. భాష, సంస్కృతి, ఆధ్యాత్మికత కలసిన జీవన చిహ్నం. ఆలయాలలో పూజలు ముగిసిన తర్వాత భగవంతునికి నివేదించే నైవేద్యంలో పులిహోరకు అగ్రతాంబూలం ఉంటుంది.

ఆయుర్వేద, వైష్ణవ సంప్రదాయాల ప్రకారం, చింతపండుతో తయారుచేసే ఈ అమ్ల ఆహారం సాత్విక గుణాలను పెంపొందిస్తుంది. మంత్రోచ్ఛారణల మధ్య, పవిత్రమైన వాతావరణంలో తయారుచేసి స్వామివారికి అర్పించడం వల్ల ఈ ప్రసాదంలో సానుకూల శక్తి నిండి ఉండి, భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగిస్తుంది. ఇకపోతే, పులిహోర తయారీలో వాడే ప్రతి పదార్థమూ ఒక ఔషధ గని అని చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి

ఇకపోతే, పులిహోర తయారీలో వాడే ప్రతి పదార్థమూ ఒక ఔషధ గని అని చెప్పవచ్చు.

చింతపండు : ఇందులో విటమిన్ C, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణక్రియను వేగవంతం చేయడమే కాకుండా శరీరంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.

పసుపు: ఇది సహజసిద్ధమైన యాంటీసెప్టిక్, యాంటీ బయోటిక్. రోగనిరోధక శక్తిని పెంచి, ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతుంది.

ఇంగువ, ఆవాలు: కడుపులో గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలను నివారించి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి.

మిరియాలు, అల్లం: శ్లేష్మాన్ని తగ్గించి, జలుబు, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి.

కరివేపాకు, వేరుశెనగలు: కంటి చూపును మెరుగుపరచడమే కాకుండా శరీరానికి కావలసిన ప్రొటీన్లను అందిస్తాయి.

దేవాలయ స్టైల్ పులిహోర తయారీ చిట్కా:

గుడి ప్రసాదం లాంటి రుచి రావలంటే, చింతపండు గుజ్జును పసుపు, ఉప్పు, నూనెతో బాగా దగ్గరకు ఉడికించి పులిహోర గుజ్జు తయారుచేసుకోవాలి. ఉడికించిన అన్నం చల్లారిన తర్వాత ఈ గుజ్జుతో పాటు వేయించిన ఆవాలు, మినపప్పు, శనగపప్పు, వేరుశెనగ గుళ్లు, ఎండుమిర్చి, ఇంగువ, మెంతి పొడి పోపుగా వేసి కలుపుకుంటే అద్భుతమైన గుడి ప్రసాదం పులిహోర సిద్ధమవుతుంది. ఈ విధంగా రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే పులిహోర మన సాంప్రదాయ ఆహార సంస్కృతిలో ఒక అమృత తుల్యమైన ప్రసాదం!

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us