వరుస సినిమాలతో దూసుకుపోతున్న మృణాల్ 

Rajeev 

5 April 2026

నెమ్మదిగా సినీరంగంవైపు అడుగులు వేసింది. ఆ తర్వాత తెలుగు, హిందీ భాషలలో వరుస సినిమాలతో అలరించింది.

1992 ఆగస్ట్ 1న మహారాష్ట్రలోని ధూలే జిల్లాలో జన్మించిన ఈ అమ్మడు.. సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ స్కూల్‌లో.. ముంబైలోని కెసి కాలేజీలో గ్రాడ్యుయేషన్ చేసింది.

స్టార్ ప్లస్‌లో ముజ్సే కుచ్ కెహ్తి... యే ఖామోషియాన్ అనే టీవీ షోతో టెలివిజన్‌లోకి అడుగుపెట్టింది. లవ్ సోనియా సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.

ఆ తర్వాత జెర్సీ మూవీతో మరో హిట్ అందుకుంది. సీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.

ఫస్ట్ మూవీతోనే హిట్టు అందుకున్న మృణాల్.. ఆ తర్వాత హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ చిత్రాల్లో నటించింది.

ప్రస్తుతం అడివి శేష్ జోడిగా డెకాయిట్ చిత్రంలో నటిస్తుంది. నివేదికల ప్రకారం మృణాల్ ఆస్తులు రూ.33 కోట్లు ఉంటుందని అంచనా.