ఇండస్ట్రీలో ఎవరి దశ ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం. మరీ ముఖ్యంగా హీరోయిన్లకు అయితే సింగిల్ సినిమాతో జాతకం మారిపోతుంది.
తాజాగా ఓ బ్యూటీ విషయంలో ఇదే జరుగుతుంది. మూడేళ్ళ గ్యాప్ తర్వాత టాలీవుడ్‌కు రీ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీకి.. పవన్ సినిమాతో పాటు నాని, రవితేజ కూడా ఆఫర్ ఇచ్చేసారు.
ప్రియాంక మోహన్.. నాలుగేళ్ల కింద నాని హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్‌తో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ. ఆ తర్వాత శర్వానంద్‌తో శ్రీకారంలో నటించారు ప్రియాంక.
ఈ రెండూ ఫ్లాప్ కావడంతో అమ్మడు గురించి పెద్దగా చర్చ జరగలేదు. దాంతో తమిళ ఇండస్ట్రీకి వెళ్లి.. డాన్, డాక్టర్, ఈటీ లాంటి సినిమాలతో స్టార్ అయిపోయారు.
ఇన్నాళ్లకు తెలుగులో మళ్లీ ప్రియాంకకు టైమ్ వచ్చింది. ప్రియాంక మోహన్‌కు ప్రస్తుతం టాలీవుడ్ నుంచి వరస ఛాన్సులు వస్తున్నాయి.
ఇప్పటికే నానితో సరిపోదా శనివారంలో హీరోయిన్‌గా, పవన్ కళ్యాణ్‌తో ఓజీలో నటించింది ఈ బ్యూటీ.
సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది ఈ చిన్నది.. అలాగే రీసెంట్ డేస్ లో గ్లామర్ డోస్ పెంచేసింది ఈ అమ్మడు.