New Labour Code: ఉద్యోగులకు శుభవార్త.. ఇకపై మిగిలిపోయిన సెలవులకు ప్రతి ఏటా నగదు.. కొత్త లేబర్ కోడ్‌తో మరిన్ని ప్రయోజనాలు!
New Labour Code: కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న 'కొత్త లేబర్ కోడ్ 2025' (ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్- 2020) ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపబోతోంది. ఉద్యోగుల పాలిట వరంగా మారనున్న ఈ కొత్త చట్టం వల్ల కలిగే ప్రయోజనాలు..

New Labour Code: ఆఫీసుల్లో రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసే ఉద్యోగులకు ఎదురయ్యే ప్రధాన సమస్య తమ సెలవులు (Earned Leaves). పని ఒత్తిడి వల్ల వాడుకోలేకపోయిన సెలవులు ఏడాది చివరలో వృధా అయిపోతుంటాయి. అయితే, కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న ‘కొత్త లేబర్ కోడ్ 2025’ (ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్- 2020) ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపబోతోంది. ఉద్యోగుల పాలిట వరంగా మారనున్న ఈ కొత్త చట్టం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే:
ఇది కూడా చదవండి: Post Office: పోస్ట్ ఆఫీస్‌లో అదిరిపోయే స్కీమ్.. 10 ఏళ్లలో రూ.25 లక్షలకు పైగా సంపాదించే మార్గం!
1. ఏటా లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ సౌకర్యం
గతంలో మిగిలిపోయిన సెలవులకు నగదు పొందాలంటే ఉద్యోగం వదిలేసే వరకు లేదా రిటైర్ అయ్యే వరకు వేచి చూడాల్సి వచ్చేది. కానీ కొత్త నిబంధనల ప్రకారం, ఉద్యోగులు ప్రతి సంవత్సరం తమ వద్ద ఉన్న అదనపు సెలవులను నగదుగా మార్చుకునే వీలుంటుంది. ఇది ఉద్యోగులకు ఆర్థికంగా అదనపు ఆదాయాన్ని చేకూరుస్తుంది.
2. కేవలం 6 నెలల పనితోనే సెలవులకు అర్హత
పాత ఫ్యాక్టరీల చట్టం (1948) ప్రకారం, ఒక ఉద్యోగి ‘Earned Leave’ పొందాలంటే ఏడాదిలో కనీసం 240 రోజులు పని చేయాల్సి ఉండేది. కొత్త లేబర్ కోడ్‌లో ఈ పరిమితిని 180 రోజులకు (సుమారు 6 నెలలు) తగ్గించారు. అంటే, ఒక క్యాలెండర్ ఇయర్‌లో 180 రోజులు పని పూర్తి చేసిన ఉద్యోగి వేతనంతో కూడిన సెలవులకు అర్హత సాధిస్తారు.
3. సెలవు నిరాకరిస్తే.. అవి రద్దు కావు
చాలా సందర్భాల్లో ఉద్యోగులు సెలవు కోరినప్పుడు, పని ఒత్తిడి పేరుతో బాస్‌లు వాటిని తిరస్కరిస్తుంటారు. పాత పద్ధతిలో ఆ సెలవులు వృధా అయ్యేవి. కానీ కొత్త నిబంధనల ప్రకారం:
- ఒకవేళ కంపెనీ సెలవును నిరాకరిస్తే, ఆ సెలవులు లాప్స్ (రద్దు) కావు.
- వాటిని ఎటువంటి పరిమితి లేకుండా వచ్చే ఏడాదికి ‘క్యారీ ఫార్వర్డ్’ చేయవచ్చు.
- కంపెనీ అవసరాల వల్ల ఉద్యోగి తన సెలవు హక్కును కోల్పోకుండా ఈ నియమం రక్షణ కల్పిస్తుంది.
4. అదనపు సెలవులతో అదనపు సంపాదన
నిపుణుల విశ్లేషణ ప్రకారం, ఒక ఉద్యోగి గరిష్టంగా 30 రోజుల సెలవులను మాత్రమే తదుపరి ఏడాదికి క్యారీ ఫార్వర్డ్ చేయగలరు. ఒకవేళ మీ ఖాతాలో 30 రోజుల కంటే ఎక్కువ సెలవులు ఉంటే, ఆ అదనపు సెలవులకు బదులుగా మీరు నగదును డిమాండ్ చేయవచ్చు. ఏడాది చివరలో ఉద్యోగి తన వద్ద ఉన్న మొత్తం సెలవులను నగదుగా మార్చుకునే వెసులుబాటు కూడా ఈ కోడ్ కల్పిస్తోంది.
5. ఈ ప్రయోజనాలు ఎవరికి వర్తిస్తాయి?
- కొత్త లేబర్ కోడ్ ప్రయోజనాలు ప్రధానంగా ఈ కింది వారికి వర్తిస్తాయి:
- మన్యువల్, అన్‌స్కిల్డ్, స్కిల్డ్, టెక్నికల్, ఆపరేషనల్ లేదా క్లరికల్ పనులు చేసే వారు.
- నెలకు రూ. 18,000 కంటే తక్కువ వేతనం తీసుకునే వారు.
ముఖ్య గమనిక: నెలకు రూ. 18,000 కంటే ఎక్కువ జీతం తీసుకునే సూపర్ వైజర్లు, మేనేజర్లు, అడ్మినిస్ట్రేటివ్ పదవుల్లో ఉన్నవారికి ఈ ప్రత్యేక ప్రయోజనాలు వర్తించకపోవచ్చు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కొత్త లేబర్ కోడ్స్ గురించి నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాతే ఆయా రాష్ట్రాల్లో ఇవి అమలులోకి వస్తాయి. అప్పటి వరకు పాత నిబంధనలే కొనసాగుతాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
