Video: 1, 2 కాదు.. ఏకంగా 7 యార్కర్లు.. పంత్‌ను భయపెట్టిన సచిన్ తనయుడు..
Arjun Tendulkar Yorker Video: ఐపీఎల్ 2026 సీజన్‌లో ఇప్పటివరకు మైదానంలోకి దిగకపోయినా, అర్జున్ టెండూల్కర్ తన సంచలన బౌలింగ్‌తో వార్తల్లో నిలిచాడు. నెట్స్‌లో వరుస యార్కర్లతో ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. లక్నో సూపర్ జయంట్స్ తరపున ఈ యువ పేసర్ త్వరలోనే బరిలోకి దిగబోతున్నారనే సంకేతాలు ఈ వీడియో ద్వారా స్పష్టమవుతున్నాయి.

లక్నో సూపర్ జెయింట్స్ టీం ఇప్పటి వరకు ఆడిన 2 మ్యాచ్ ల్లో ఒకటి ఓడిపోయి, మరొకటి గెలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుపై 6 వికెట్లతో ఓడిన లక్నో, ఆ తర్వాత హైదరాబాద్ జట్టుపై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో మూడో మ్యాచ్ కోల్ కతాతో ఆడేందుకు సిద్ధమవుతోంది. అయితే, లక్నో టీం కెప్టెన్ రిషబ్ పంత్ కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోసల మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ సీజన్ కోసం లక్నో జట్టులో చేరిన సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. తన అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. కాగా, లక్నో సూపర్ జయంట్స్ ప్రాక్టీస్ సెషన్‌లో అర్జున్ టెండూల్కర్ అసాధారణ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. సాధారణంగా ఒక యార్కర్ కచ్చితత్వంతో వేయడమే కష్టమైన పని, కానీ అర్జున్ మాత్రం ఏకంగా ఏడు వరుస యార్కర్లతో విరుచుకుపడ్డాడు. భారత స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ సైతం అర్జున్ వేసిన వేగవంతమైన యార్కర్లను ఎదుర్కోలేక తన పాదాలను కాపాడుకునే ప్రయత్నం చేయడం గమనార్హం. కేవలం పంత్ మాత్రమే కాదు, అబ్దుల్ సమద్ వంటి హిట్టర్లు కూడా అర్జున్ సంధించిన అస్త్రాలకు చేతులెత్తేశారు. బ్యాటర్లు మారుతున్నా అర్జున్ తన లైన్ అండ్ లెంగ్త్ మార్చకుండా యార్కర్ల వర్షం కురిపించడం గమనార్హం.
లక్నో జట్టులో అరంగేట్రానికి సమయం ఆసన్నమైందా?
Remember The Name – Arjun Tendulkar https://t.co/UGS1abBMKD pic.twitter.com/gHvUyNb39N
— Harsh shekhawat (@wordofshekhawat) April 6, 2026
ఈ సీజన్ మొదటి రెండు మ్యాచ్‌లలో అర్జున్‌కు అవకాశం దక్కలేదు. అయితే నెట్స్‌లో అతను ప్రదర్శిస్తున్న ఫామ్ చూస్తుంటే, తుది జట్టులో చోటు దక్కించుకోవడం ఇక ఎంతో దూరంలో లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో ముంబై ఇండియన్స్ తరపున ఆడిన అర్జున్, ఇప్పుడు లక్నో సూపర్ జయంట్స్ జెర్సీలో మెరవడానికి సిద్ధమవుతున్నాడు. ఒకవేళ వచ్చే మ్యాచ్‌లో అవకాశం దక్కితే, ఐపీఎల్ కెరీర్‌లో అర్జున్ ప్రాతినిధ్యం వహించిన రెండో జట్టుగా లక్నో నిలుస్తుంది. జట్టు యాజమాన్యం కూడా ఈ యువ బౌలర్ వేగాన్ని ఉపయోగించుకోవాలని యోచిస్తోంది.
ముంబై ఇండియన్స్‌తో ఐపీఎల్ ప్రయాణం..
అర్జున్ టెండూల్కర్ తన ఐపీఎల్ ప్రస్థానాన్ని 2023లో ముంబై ఇండియన్స్ తరపున ప్రారంభించాడు. ఆ సీజన్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడి మూడు వికెట్లు పడగొట్టాడు. 2024 సీజన్‌లోనూ ఒక మ్యాచ్ ఆడే అవకాశం దక్కింది. మొత్తం ఐదు మ్యాచ్‌ల అనుభవం ఉన్న అర్జున్, ఇప్పుడు మరింత పరిణతి చెందిన బౌలర్‌గా కనిపిస్తున్నాడు. తన తండ్రి సచిన్ టెండూల్కర్ వారసత్వాన్ని మోస్తూనే, తనదైన శైలిలో పేస్ బౌలింగ్‌తో గుర్తింపు తెచ్చుకోవడానికి అర్జున్ తీవ్రంగా శ్రమిస్తున్నాడు. తాజాగా వైరల్ అవుతున్న వీడియో ఆయన ఆత్మవిశ్వాసానికి నిదర్శనంగా నిలుస్తోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
