AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LSG New Captain: లక్నో కొత్త కెప్టెన్ ఫైనల్.. పంత్ స్థానంలో 21 కోట్ల స్టార్‌కు పగ్గాలు..!

LSG New Captain: ఐపీఎల్ 2027 కోసం లక్నో సూపర్ జెయింట్స్ కొత్త కెప్టెన్ వేటలో పడింది. రిషభ్ పంత్ ఢిల్లీకి వెళ్లడంతో నికోలస్ పూరన్ పేరు తెరపైకి వచ్చింది. దిగ్వేశ్ రాఠీ లీక్‌తో పూరన్ కెప్టెన్సీ దాదాపు ఖాయమనే చర్చ జరుగుతోంది. పూర్తి వివరాలు చూద్దాం. 21 కోట్లతో రిటైన్ అయిన అతడే తొలి టైటిల్ ఆశగా కనిపిస్తున్నాడు.

LSG New Captain: లక్నో కొత్త కెప్టెన్ ఫైనల్.. పంత్ స్థానంలో 21 కోట్ల స్టార్‌కు పగ్గాలు..!
Lsg New Captain
Venkata Chari
|

Updated on: Nov 21, 2026 | 6:45 AM

Share

LSG New Captain: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027 (IPL 2027) కోసం లక్నో సూపర్ జెయింట్స్ (LSG) కొత్త కెప్టెన్‌ను వెతుకుతోంది. రిషభ్ పంత్ జట్టు నుంచి వెళ్లిపోవడంతో కెప్టెన్ పదవి ఖాళీ అయింది. జట్టుకు తొలి టైటిల్ అందించగల నాయకుడి కోసం మేనేజ్‌మెంట్ వేట మొదలుపెట్టింది. ఈ క్రమంలో LSG కెప్టెన్సీపై కీలక అప్‌డేట్ బయటకు వచ్చింది.

IPL 2027లో LSG కెప్టెన్‌గా ఆ స్టారే?

IPL 2027 మినీ వేలానికి ముందే ఫ్రాంచైజీల మధ్య భారీ ట్రేడ్‌లు జరిగాయి. ఇందులో లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య డీల్ చర్చనీయాంశమైంది. కుల్దీప్ యాదవ్‌ను తీసుకోవడం కోసం లక్నో రిషభ్ పంత్‌ను ఢిల్లీకి అప్పగించింది. దీంతో కొత్త కెప్టెన్ ఎవరనే ప్రశ్న మొదలైంది. తాజాగా స్పిన్నర్ దిగ్వేశ్ రాఠీ ఇచ్చిన హింట్‌తో ఈ చర్చకు తెరపడినట్లైంది.

దిగ్వేశ్ రాఠీ ఇచ్చిన హింట్..

సోషల్ మీడియాలో ఓ వీడియో వేగంగా వైరల్ అవుతోంది. ఇండోర్‌లో ఢిల్లీతో జరిగిన సయ్యద్ ముష్తాక్ అలీ T20 ట్రోఫీ మ్యాచ్ సందర్భంగా దిగ్వేశ్ రాఠీని LSG కెప్టెన్ గురించి అడగగా, అతడు నికోలస్ పూరన్ పేరు చెప్పాడు. దీంతో అభిమానుల్లో పూరన్ కెప్టెన్ అవుతాడనే చర్చ జోరందుకుంది. IPL 2027 కోసం LSG ఈ వెస్టిండీస్ మాజీ స్టార్‌ను రూ.21 కోట్లకు రిటైన్ చేసింది.

చాలా కాలంగా LSGలోనే పూరన్..

నికోలస్ పూరన్ 2023 నుంచి లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. IPL 2025 మెగా వేలానికి ముందు LSG అతడిని రూ.21 కోట్లకు రిటైన్ చేసుకుంది. ఐపీఎల్‌లో లక్నో తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా పూరన్ రికార్డు సృష్టించాడు. LSG కోసం 57 మ్యాచ్‌ల్లో 57 ఇన్నింగ్స్‌ల్లో 1615 పరుగులు చేశాడు. అనుభవం, విధ్వంసక బ్యాటింగ్, జట్టుతో అనుబంధం కారణంగా పూరన్‌ను కెప్టెన్‌గా ప్రకటిస్తే ఆశ్చర్యం లేదని విశ్లేషకులు అంటున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
లక్నో కొత్త కెప్టెన్‌గా 21 కోట్ల స్టార్‌ ప్లేయర్.. ఎవరంటే?
లక్నో కొత్త కెప్టెన్‌గా 21 కోట్ల స్టార్‌ ప్లేయర్.. ఎవరంటే?
లక్షలకు చేరనున్న తులం బంగారం ధర.. ఒక్క రోజులోనే భారీ పతనం!
లక్షలకు చేరనున్న తులం బంగారం ధర.. ఒక్క రోజులోనే భారీ పతనం!
అత్యాశ దుఃఖానికి దారి తీస్తుంది.. బంగారు గుడ్లు పెట్టే బాతు కథ!
అత్యాశ దుఃఖానికి దారి తీస్తుంది.. బంగారు గుడ్లు పెట్టే బాతు కథ!
తక్కువ ధరలో ఇన్ని ఫీచర్లు ఉన్న డిష్​వాషర్​
తక్కువ ధరలో ఇన్ని ఫీచర్లు ఉన్న డిష్​వాషర్​
Orient Avera హీటర్​తో చలికాలంలో ఇబ్బందులకు గుడ్‌బై
Orient Avera హీటర్​తో చలికాలంలో ఇబ్బందులకు గుడ్‌బై
మర్చిపోవాలనుకున్న జ్ఞాపకాలే మళ్లీ మళ్లీ గుర్తుకొస్తున్నాయా?
మర్చిపోవాలనుకున్న జ్ఞాపకాలే మళ్లీ మళ్లీ గుర్తుకొస్తున్నాయా?
నవంబర్ 21 రాశిఫలాలు: ఈ రోజు వీరికి ధనలాభం, ఉద్యోగంలో పురోగతి!
నవంబర్ 21 రాశిఫలాలు: ఈ రోజు వీరికి ధనలాభం, ఉద్యోగంలో పురోగతి!
జంట చూడముచ్చటగా ఉంది.. అనిరుధ్- కావ్యల పెళ్లి ఫొటోలు చూశారా?
జంట చూడముచ్చటగా ఉంది.. అనిరుధ్- కావ్యల పెళ్లి ఫొటోలు చూశారా?
కార్తీక మాసంలో గిరివలయం చేస్తే ఇన్ని ప్రయోజనాలా? శివుడి అనుగ్రహం
కార్తీక మాసంలో గిరివలయం చేస్తే ఇన్ని ప్రయోజనాలా? శివుడి అనుగ్రహం
తెలంగాణ భూముల రీసర్వేపై మార్గదర్శకాలను జారీ చేసిన ప్రభుత్వం
తెలంగాణ భూముల రీసర్వేపై మార్గదర్శకాలను జారీ చేసిన ప్రభుత్వం