AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OG సినిమా టికెట్ల పెంపునకు మరోసారి షాక్.. ఇచ్చిన ఉత్తర్వులే పొడిగించిన హైకోర్టు..!

తెలంగాణలో టికెట్‌ ధరల పెంపు సహా ముందురోజు ప్రీమియర్‌ షోలకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. దానికి టికెట్‌ ధర జీఎస్టీతో కలిపి 800 రూపాయలు పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. అలాగే సినిమా విడుదల రోజు నుంచి అక్టోబరు 4 వరకు సింగిల్‌ స్క్రీన్స్‌లో వంద రూపాయలు, మల్టీప్లెక్స్‌ల్లో 150 రూపాయలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది.

OG సినిమా టికెట్ల పెంపునకు మరోసారి షాక్.. ఇచ్చిన ఉత్తర్వులే పొడిగించిన హైకోర్టు..!
OG movie
Balaraju Goud
|

Updated on: Sep 26, 2025 | 4:04 PM

Share

తెలంగాణలో పవన్ కల్యాణ్ నటించిన OG సినిమా టికెట్ల పెంపునకు మరోసారి షాక్ తగిలింది. రివ్యూ తర్వాత కూడా పెంపునకు హైకోర్టు ఓకే చెప్పలేదు. సెప్టెంబర్ 24వ తేదీ ఇచ్చిన ఉత్తర్వులే పొడిగిస్తూ మళ్లీ జడ్జిమెంట్‌ ఇచ్చారు న్యాయమూర్తి. అక్టోబర్ 9 వరకు ఇవే ఉత్తర్వులు కొనసాగుతాయని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. తదుపరి విచారణ అక్టోబర్ 9 కు వాయిదా వేసినట్లు హైకోర్టు బెంచ్ ప్రకటించింది.

ఓజీ.. ఓజీ.. ఓజీ.. తెలుగురాష్ట్రాల్లో ఓజీ ఫీవర్ మామూలుగా లేదు. సినిమా రిలీజైంది. ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు అంతవరకు ఓకే. బట్ టికెట్ రేట్ల వివాదం మాత్రం ఇంకా సద్దుమణగలేదు. టికెట్ పెంపు అన్నది ఓజీ సమస్య కాదు. ఇండస్ట్రీ సమస్య. అసలు సినిమా రేట్లు ఇంతని ఫిక్సయినప్పుడు.. మళ్లీ పెరుగుదల ఎందుకు.. అన్నది సగటు ప్రేక్షకుడి ప్రశ్న.

సినిమా విడుదలైన తర్వాత 10రోజుల వరకూ థియేటర్ స్థాయిని బట్టి 100, 150 రూపాయలు పెంచుకునే వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం మెమో ఇచ్చింది. అయితే దాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైంది. టికెట్ల రేట్ల పెంపు వద్దంటూ గవర్నమెంట్‌ మెమోని సింగిల్ బెంచ్ సస్పెండ్ చేసింది. అసలు తమ వెర్షన్ వినకుండా తీర్పు ఎలా ఇస్తారని చిత్రయూనిట్‌ డివిజన్ బెంచ్‌కి ముందు అప్పీలుకు వెళ్లింది. చిత్ర నిర్మాతల వెర్షన్ కూడా వినాలని డివిజన్ బెంచ్ మరోసారి సింగిల్ బెంచ్‌కి రిఫర్ చేసింది. అయినా ఇవాళ కూడా అదే తీర్పుని కొనసాగించారు జడ్జి.

పవన్ కళ్యాణ్ ఓజీ రిలీజ్‌కు ముందు నుంచే టికెట్ పెంపుపై పెద్ద రచ్చే జరిగింది. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు టికెట్ పెంపుకు అనుకూలంగా మెమో కూడా జారీ చేసింది. కానీ సామాన్యులపై భారం మోపుతున్నారంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది. ప్రభుత్వం మెమోను సస్పెండ్ చేస్తూ టికెట్ ధరలను పెంచవద్దంటూ సింగిల్ బెంచ్ తీర్పు కూడా ఇచ్చింది. కానీ మరో ట్విస్ట్ చోటు చేసుకుంది.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
బర్నింగ్‌ ఇష్యూపై కమర్షియల్‌ కోర్ట్‌రూమ్‌ డ్రామా 'డ్యూ డేట్‌'
బర్నింగ్‌ ఇష్యూపై కమర్షియల్‌ కోర్ట్‌రూమ్‌ డ్రామా 'డ్యూ డేట్‌'
బెంగళూరు నుంచి దుబాయ్ వరకు..ఓ అమ్మాయి జీవితాన్ని మార్చిన 3 నగరాలు
బెంగళూరు నుంచి దుబాయ్ వరకు..ఓ అమ్మాయి జీవితాన్ని మార్చిన 3 నగరాలు
దిన ఫలాలు: వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో గుడ్‌న్యూస్
దిన ఫలాలు: వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో గుడ్‌న్యూస్
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!