AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇండియన్స్‌ కోసం మతిపోయే ఫీచర్స్‌తో టెస్లా ఎలక్ట్రిక్‌ కార్.. పూర్తి వివరాలు తెలిస్తే ఫిదా

Tesla Y.. టెస్లా మోడల్ వై కొనుగోలు చేసిన భారతీయ వినియోగదారులకు కంపెనీ మరో ఆసక్తికరమైన అప్‌డేట్‌ను తీసుకువచ్చింది. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో గ్రోక్ ఏఐ అసిస్టెంట్‌తో పాటు పలు కొత్త కృత్రిమ మేధ ఫీచర్లు ఉచితంగా అందుబాటులోకి వచ్చాయి. ఓవర్ ది ఎయిర్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ద్వారా లభిస్తున్న ఈ ట్రెండింగ్ గ్యాడ్జెట్ విశేషాలను తెలుసుకుందాం.

ఇండియన్స్‌ కోసం మతిపోయే ఫీచర్స్‌తో టెస్లా ఎలక్ట్రిక్‌ కార్.. పూర్తి వివరాలు తెలిస్తే ఫిదా
Tesla Model Y Receives Grok Ai Assistant
Nikhil
|

Updated on: Aug 06, 2026 | 7:30 AM

Share

డ్రైవింగ్ అనుభూతిని పూర్తిగా మార్చివేసేలా టెస్లా తమ వాహనాల్లో శక్తివంతమైన ఏఐ అసిస్టెంట్‌ను ప్రవేశపెట్టింది. వాయిస్ కమాండ్ల ద్వారా అన్ని పనులను సులభంగా పూర్తి చేసుకునేలా రూపొందించిన ఈ అద్భుతమైన టెక్నాలజీ పూర్తి వివరాలను తెలుసుకుందాం!

గ్రోక్ ఏఐ అసిస్టెంట్‌

టెస్లా మోడల్ వై కొనుగోలు చేసిన భారతీయ వినియోగదారులకు కంపెనీ మరో ఆసక్తికరమైన అప్‌డేట్ తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో గ్రోక్ ఏఐ అసిస్టెంట్ తో పాటు పలు కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఫీచర్లను పొందేందుకు అదనంగా ఎలాంటి చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. కంపెనీ ఓవర్ ది ఎయిర్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ద్వారా వీటిని వినియోగదారులకు అందిస్తోంది. టెస్లా మోడల్ వైలో గ్రోక్ ఏఐ అసిస్టెంట్‌ను ఉపయోగించడం చాలా ఈజీ.

స్టీరింగ్ వీల్ మీద ఉన్న వాయిస్ బటన్‌ను నొక్కడం ద్వారా లేదంటే హే గ్రోక్ అని చెప్పడం ద్వారా దీనిని యాక్టివేట్ చేయవచ్చు. ఈ ఏఐ అసిస్టెంట్‌తో డ్రైవర్ వాయిస్ కమాండ్ల ద్వారా అన్ని పనులను చేసే అవకాశం ఉంటుంది. ట్రావెల్ రూట్ సెట్ చేయడం, సమీపంలోని సూపర్‌చార్జింగ్ స్టేషన్లు, కాఫీ షాపులు, రెస్టారెంట్లు, ఆసుపత్రులు, ఏటీఎంలు, టాయిలెట్లు లాంటి ప్రదేశాలను గుర్తించడం మరింత సులభంగా మారుతుంది.

గ్రోక్ ఏఐ ప్రత్యేకతల్లో ఒకటి భారతీయ భాషలకు సపోర్టు ఇవ్వడం. ఇది తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మరాఠీ, గుజరాతీ లాంటి భాషల్లో వినియోగదారులతో మాట్లాడుతుంది. దీంతో డ్రైవింగ్ సమయంలో ఇంగ్లీష్ తెలియని వారికి కూడా ఈ ఫీచర్ ఉపయోగకరంగా ఉంటుంది. వినియోగదారుడు తనకు నచ్చిన లాంగ్వేజ్‌ను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది.

ఈ తాజా అప్‌డేట్‌తో టెస్లా నావిగేషన్ వ్యవస్థ కూడా మరింత సూపర్ గా మారింది. డ్రైవర్ రోజువారీ ప్రయాణ అలవాట్లు, తరచుగా వెళ్లే ప్రాంతాలను గుర్తించి వాటి ఆధారంగా గమ్యస్థానాలను సూచిస్తుంది. ఇంతకుముందు ఇల్లు, ఆఫీస్ లాంటి ప్రదేశాలకే పరిమితమైన కొన్ని ఫీచర్లు ఇప్పుడు మరిన్ని డెస్టినేషన్స్‌కు విస్తరించబడ్డాయి. అంతేకాదు మల్టీ స్టాప్‌లతో కూడిన ప్రయాణాలను కూడా వాయిస్ కమాండ్ ద్వారా ప్లాన్ చేసుకోవచ్చు.

టెస్ట్ డ్రైవ్ విశేషాలు

కారు డిస్‌ప్లేలో కనిపించే హెచ్చరికలు, సూచనలు, ఇతర మెసేజ్‌ల అర్థాన్ని కూడా గ్రోక్ ఏఐ వివరిస్తుంది. దీంతో కొత్తగా టెస్లా ఉపయోగిస్తున్న వారికి వెహికల్‌లోని ఫీచర్లను అర్థం చేసుకోవడం మరింత సులభమవుతుంది. ఈ ఏఐ అప్‌డేట్‌ను ప్రకటించిన సందర్భంగా టెస్లా మరో కీలక విషయాన్ని వెల్లడించింది. దేశంలోని తన డీలర్‌షిప్‌లలో మోడల్ వై ప్రీమియం ఆర్డబ్ల్యూడీ వేరియంట్ టెస్ట్ డ్రైవ్‌లను కూడా ప్రారంభించింది. దీంతో కొనుగోలు చేయాలనుకునే వారు కొత్త ఫీచర్లను స్వయంగా ఎక్స్‌పీరియెన్స్ చేసే అవకాశం పొందుతున్నారు.

భారత మార్కెట్లో టెస్లా మోడల్ వై రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ప్రీమియం ఆర్డబ్ల్యూడీ ఐదు సీటర్ ధర యాభై లక్షల ఎనభై తొమ్మిది వేల రూపాయలు కాగా, ప్రీమియం ఏడబ్ల్యూడీ ఏడు సీటర్ ధర అరవై ఒక్క లక్షా తొంబై తొమ్మిది వేల రూపాయలుగా ఉంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీకి హ్యుందాయ్ ఐయోనిక్ 5, కియా ఈవీ6, బైడీ సీలియన్ 7 లాంటి మోడళ్లతో గట్టి పోటీ ఉంది. అత్యాధునిక ఏఐ ఫీచర్ల చేరికతో ఈ కారు మరింత ఆకర్షణీయంగా మారుతోంది.

Follow Us
చేప ముల్లు గొంతులో ఇరుక్కుంటే వెంటనే ఇలా చేయండి.. దెబ్బకు రిలీఫ్
చేప ముల్లు గొంతులో ఇరుక్కుంటే వెంటనే ఇలా చేయండి.. దెబ్బకు రిలీఫ్
24 ఏళ్ల గిన్నిస్‌ రికార్డ్‌ను బ్రేక్‌ చేసిన విచిత్ర పిల్లి! ఆకారం
24 ఏళ్ల గిన్నిస్‌ రికార్డ్‌ను బ్రేక్‌ చేసిన విచిత్ర పిల్లి! ఆకారం
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం
కడుపుతో ఉన్నప్పుడు వర్కవుట్స్ చేయొచ్చా.. సమంత ఏం చెప్పిందంటే..
కడుపుతో ఉన్నప్పుడు వర్కవుట్స్ చేయొచ్చా.. సమంత ఏం చెప్పిందంటే..
చిన్నప్పుడు రామ్ చరణ్‌ను స్కూల్ నుంచి నేనే తీసుకొచ్చేవాడిని..
చిన్నప్పుడు రామ్ చరణ్‌ను స్కూల్ నుంచి నేనే తీసుకొచ్చేవాడిని..
భారతదేశంలో వెల్‌నెస్ టూరిజానికి రిషికేశ్‌ కొత్త చిరునామా..
భారతదేశంలో వెల్‌నెస్ టూరిజానికి రిషికేశ్‌ కొత్త చిరునామా..
వార్నీ ఇన్నాళ్లు ఇంత లైట్ తీసుకున్నామా.. సోంపు నీళ్లు తాగితే..
వార్నీ ఇన్నాళ్లు ఇంత లైట్ తీసుకున్నామా.. సోంపు నీళ్లు తాగితే..
టాక్సిక్ సినిమాతో హిట్టు.. అట్టర్ ప్లాప్ మిస్..
టాక్సిక్ సినిమాతో హిట్టు.. అట్టర్ ప్లాప్ మిస్..
ఐఫోన్ మోజు.. కుమారుడితో పాటు తల్లిదండ్రి మృతి!
ఐఫోన్ మోజు.. కుమారుడితో పాటు తల్లిదండ్రి మృతి!
రెస్టారెంట్‌లో శాండ్‌విచ్‌ తింటున్న కస్టమర్‌..సగం తిన్నాక అందులో
రెస్టారెంట్‌లో శాండ్‌విచ్‌ తింటున్న కస్టమర్‌..సగం తిన్నాక అందులో