AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nani-Nithiin : నితిన్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‏గా పనిచేసిన నాని.. ఏ సినిమానో చెప్పగలరా.. ?

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది స్టార్ హీరో న్యాచురల్ స్టార్ నాని. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే సాధారణ కుర్రాడు మొదట అసిస్టెంట్ డైరెక్టర్ గా సినీ ప్రయాణం స్టార్ట్ చేసి.. ఆ తర్వాత హీరోగా మారిన తీరు ఎంతో మందికి స్పూర్తిదాయకం. ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో తనదైన ముద్ర వేశారు.

Nani-Nithiin : నితిన్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‏గా పనిచేసిన నాని.. ఏ సినిమానో చెప్పగలరా.. ?
Nani, Nithiin
Rajitha Chanti
|

Updated on: Aug 06, 2026 | 8:09 AM

Share

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని గురించి.. ఆయన ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సాధారణ కుర్రాడు ఇండస్ట్రీలో హీరోగా ఎదిగిన తీరు.. ఆయన సినీ ప్రయాణం ఎంతమందికో స్ఫూర్తిదాయకం అనే చెప్పాలి. ఎటువంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేకుండా పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆయన, మొదట సహాయ దర్శకుడిగా (అసిస్టెంట్ డైరెక్టర్) తన కెరీర్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ బాపు రమణల వద్ద పలు చిత్రాలకు సహయ దర్శకుడిగా పనిచేశారు. తన మొదటి జీతం నాలుగు వేలు అని గతంలో చాలా ఇంటర్వ్యూల్లో బయటపెట్టాడు నాని. ఆ తర్వాత ‘అష్టా చమ్మా’ చిత్రంతో కథానాయకుడిగా వెండితెరకు పరిచయం అయ్యాడు. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న నాని.. తన నటనకు ప్రశంసలు సైతం అందుకున్నారు. డైలాగ్స్ ప్రాంప్టింగ్ నేర్పించడానికి వెళ్లిన తనకు అనుకోకుండానే హీరో ఛాన్స్ ఇచ్చారని వెల్లడించారు నాని. ఇదిలా ఉంటే..ప్రస్తుతం టాలీవుడ్‌లో తిరుగులేని క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరిగా నిలిచారు.

ఎక్కువమంది చదివినవి : Aamani : సినిమాలు మానేసి సీరియల్స్ చేయడానికి కారణం అదే.. ఎట్టకేలకు ఆమని ఓపెన్ కామెంట్స్..

అయితే ఇప్పుడు హీరోగా, నిర్మాతగా దూసుకుపోతున్నారు నాని. ఇప్పుడు నితిన్ హీరోగా నాని నిర్మాణంలో రుక్మిణీ అనే సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నాని తొలినాళ్లకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. నాని కెరీర్ ఆరంభంలో దర్శకుడు కె. రాఘవేంద్రరావు వద్ద సహాయ దర్శకుడిగా పనిచేశారు. ఆ సమయంలో యంగ్ హీరో నితిన్ నటించిన ‘అల్లరి బుల్లోడు’ సినిమాకు నాని క్లాప్ అసిస్టెంట్‌గా వ్యవహరించారు. నితిన్ సన్నివేశాలకు క్లాప్‌బోర్డ్ పట్టుకుని నిలబడిన నాని పాత ఫోటోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.

ఎక్కువమంది చదివినవి :  K. Raghavendra Rao: ఆ హీరోయిన్‏తో 24 సినిమాలు చేశా.. అలాంటి చావు ఎవరికీ రాకూడదు.. డైరెక్టర్ రాఘవేంద్ర రావు..

ఇక ఇప్పుడు కాలం చాలా వేగంగా మారుతుంది అనడానికి నాని జీవితమే ఒక గొప్ప ఉదాహరణ. 21 సంవత్సరాల క్రితం ఏ హీరో సినిమాకైతే క్లాప్ కొట్టారో, ఈ రోజు అదే హీరో నితిన్ నటిస్తున్న చిత్రాన్ని నాని తన స్వంత బ్యానర్ అయిన ‘వాల్ పోస్టర్ సినిమా’ పై నిర్మిస్తున్నారు. ఇటీవల జరిగిన ఈ సినిమా ముహూర్తపు వేడుకలో నాని స్వయంగా వచ్చి నితిన్ సినిమాకు క్లాప్ కొట్టడం విశేషం. దీంతో 21 ఏళ్ల క్రితం అసిస్టెంట్ డైరెక్టర్‌గా క్లాప్ కొట్టిన వ్యక్తి, ఈ రోజు అదే స్టార్ హీరో సినిమాకు నిర్మాతగా మారి క్లాప్ కొట్టడం చూసి అభిమానులు మురిసిపోతున్నారు. “ఇదే అసలైన సక్సెస్” అంటూ నాని పట్టుదలను, కష్టపడే తత్వాన్ని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు విశేషంగా ప్రశంసిస్తున్నారు. మొత్తానికి సహాయ దర్శకుడి నుండి అగ్ర హీరోగా, విజయవంతమైన నిర్మాతగా ఎదిగిన నాని ప్రయాణం టాలీవుడ్‌లో ఒక అరుదైన మైలురాయిగా నిలిచిపోతుంది.

ఎక్కువమంది చదివినవి : Tollywood : రూ.16 కోట్లతో తీస్తే 400 కోట్ల కలెక్షన్.. యావత్ దేశమే ఆశ్చర్యపోయేలా చేసిన సినిమా..

ఎక్కువమంది చదివినవి : Ramayana Trailer : ఏముందిరా బాబూ.. కుర్రాళ్లు తెగ వెతుకున్న చిన్నది.. రామాయణ ట్రైలర్‏లో తనే స్పెషల్..

Follow Us