AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అతిగా నగలు వేసుకుంటే పెళ్లిలోకి నో ఎంట్రీ! వధువు వింత కండిషన్.. అసలు కథేంటంటే?

పెళ్లి అంటేనే అతిథులు పట్టుచీరలు, భారీ ఆభరణాలతో మెరిసిపోవడం మన దగ్గర సాధారణం. అయితే, సోషల్ మీడియాలో ఒక వధువు తన పెళ్లికి వచ్చే అతిథుల కోసం పెట్టిన వింత నిబంధన ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. అతిథులు ఎవరూ వధువు కంటే ఎక్కువగా ముస్తాబు కాకూడదు, భారీ ఆభరణాలు ధరించకూడదు అనేదే ఆ నిబంధన. ఒకవేళ ఎవరైనా అతిగా అలంకరించుకుని వస్తే, వారిని పెళ్లి వేడుకలోకి అనుమతించబోమని ఆమె స్పష్టం చేసింది. ఈ వింతైన వివాహ నిబంధన ఇప్పుడు ఇంటర్‌నెట్‌ వేదికగా తీవ్ర చర్చకు దారి తీసింది.

అతిగా నగలు వేసుకుంటే పెళ్లిలోకి నో ఎంట్రీ! వధువు వింత కండిషన్.. అసలు కథేంటంటే?
Bride Bans Jewelry Wedding
Jyothi Gadda
|

Updated on: Mar 15, 2026 | 11:03 AM

Share

పెళ్లి వేడుక అంటే వధూవరుల కంటే అతిథుల హడావుడే ఎక్కువగా కనిపిస్తుంటుంది. ముఖ్యంగా మహిళలు పోటీపడి మరీ పట్టుచీరలు, భారీ బంగారు ఆభరణాలు ధరించి వస్తుంటారు. అయితే, ఒక వధువు మాత్రం తన పెళ్లిలో తానే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా ఉండాలని భావించి, అతిథుల ముస్తాబుపై ఆంక్షలు విధించింది. ఈ వింత ఘటన చైనాలో వెలుగు చూసింది. సాధారణంగా పెళ్లి కార్డులో భోజనం సమయం, వేదిక వివరాలు ఉంటాయి. కానీ ఈ వధువు మాత్రం ఒక ప్రత్యేకమైన డ్రెస్ కోడ్, జ్యువెలరీ కోడ్‌ను పంపింది.

ఆమె ప్రకారం.. అతిథులు ఎవరూ మెడ నిండా నగలు వేసుకోకూడదు. కేవలం సింపుల్ ఇయర్ రింగ్స్ లేదా సన్నని గొలుసు మాత్రమే ధరించాలి. వధువు దుస్తుల రంగును పోలిన రంగులు లేదా వధువు కంటే ప్రకాశవంతంగా ఉండే రంగులను అతిథులు ధరించకూడదు. ఈ నియమాలను అతిక్రమించిన వారిని రిసెప్షన్ హాలులోకి అనుమతించబోమని ఆమె తెగేసి చెప్పింది. దీంతో ఈ వెడ్డింగ్‌ ఇన్వెటేషన్‌ కాస్త నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తోంది.

వధువు వాదన ప్రకారం.. పెళ్లి అనేది తన జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజు. ఆ రోజు అందరి కళ్లు తనపైనే ఉండాలి కానీ, వజ్రవైఢూర్యాలతో మెరిసిపోయే అతిథులపై కాదు. విదేశాల్లో వధువు ధరించే తెలుపు రంగు గౌనును అతిథులు ధరించడం అవమానంగా భావిస్తారు. ఇప్పుడు అదే ట్రెండ్ ఆభరణాల వరకు పాకింది.

ఇవి కూడా చదవండి

ఈ వార్తపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. వధువు కోరికలో తప్పులేదు, అది ఆమె రోజు అని కొందరు అంటుంటే.. అతిథులను పిలిచి వారి అలంకరణపై ఆంక్షలు పెట్టడం మర్యాద కాదు అని మరికొందరు విమర్శిస్తున్నారు. మన దేశంలో కూడా సెలబ్రిటీల పెళ్లిళ్లలో ఇటువంటి నియమాలు (ఉదాహరణకు ఫోన్లు వాడకూడదు, ఫలానా రంగులే వేసుకోవాలి) కనిపిస్తున్నాయి. అయితే మధ్యతరగతి పెళ్లిళ్లలో ఇలాంటి నిబంధనలు వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవడమే కష్టంగా ఉంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…

Follow Us
వర్షంతో గాలే టెస్ట్ రద్దయితే.. భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరేనా?
వర్షంతో గాలే టెస్ట్ రద్దయితే.. భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరేనా?
నాగ పంచమి.. మీ రాశి ప్రకారం ఈ పరిహారాలు పాటిస్తే శుభఫలితాలు..
నాగ పంచమి.. మీ రాశి ప్రకారం ఈ పరిహారాలు పాటిస్తే శుభఫలితాలు..
థియేటర్‌ స్టైల్ క్యారమెల్ పాప్‌కార్న్‌.. ఇంట్లోనే ఇలా చేసుకోండి
థియేటర్‌ స్టైల్ క్యారమెల్ పాప్‌కార్న్‌.. ఇంట్లోనే ఇలా చేసుకోండి
మీరు వాడే కొబ్బరినూనె అసలైనదా.. కల్తీదా..?
మీరు వాడే కొబ్బరినూనె అసలైనదా.. కల్తీదా..?
పిల్లబచ్చాలు.. పెద్దపులిని వాళ్ల గడ్డపైనే ఎలా ఓడించారు?
పిల్లబచ్చాలు.. పెద్దపులిని వాళ్ల గడ్డపైనే ఎలా ఓడించారు?
ఆ ఇద్దరి వల్లే ఓడాం.. వెన్నంటూ ఉంటూ వెన్నుపోటు పోడిచారు
ఆ ఇద్దరి వల్లే ఓడాం.. వెన్నంటూ ఉంటూ వెన్నుపోటు పోడిచారు
నేను డల్ గా ఉన్నప్పుడు ప్రతిసారి ఆ హీరో నుంచి మెసేజ్ వస్తుంది
నేను డల్ గా ఉన్నప్పుడు ప్రతిసారి ఆ హీరో నుంచి మెసేజ్ వస్తుంది
రైతులకు కేంద్రం సూపర్ న్యూస్. ఒకేసారి 5 పథకాలు
రైతులకు కేంద్రం సూపర్ న్యూస్. ఒకేసారి 5 పథకాలు
పెళ్లయ్యాకే తిరిగిన జాతకం.. 9 వికెట్లతో చెలరేగిన బంగ్లా పేసర్
పెళ్లయ్యాకే తిరిగిన జాతకం.. 9 వికెట్లతో చెలరేగిన బంగ్లా పేసర్
బామ్మ వర్సెస్ కోతి ఫైట్.. నవ్వి నవ్వి పోతే మాకు సంబంధం లేదు!
బామ్మ వర్సెస్ కోతి ఫైట్.. నవ్వి నవ్వి పోతే మాకు సంబంధం లేదు!