AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్షిపణి పరీక్షలో కిమ్ జోంగ్ ఉన్ ఆయన కుమార్తె.. శత్రువుల వెన్నులో వణుకు పుట్టించే ఆయుధమిదే!

ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ మరోసారి క్షిపణి పరీక్షలతో ప్రపంచ దేశాలను అప్రమత్తం చేశారు. తాజాగా తన 13 ఏళ్ల కుమార్తె కిమ్ జు ఏ తో కలిసి భారీ రాకెట్ లాంచ్ సిస్టమ్స్ పరీక్షను ఆయన స్వయంగా పర్యవేక్షించారు. ఈ పరీక్షలో 600mm క్యాలిబర్ కలిగిన 12 అత్యాధునిక రాకెట్ లాంచర్లను ప్రయోగించినట్లు తెలుస్తోంది. కిమ్ కుమార్తె ఇటీవల కాలంలో వరుసగా సైనిక కార్యక్రమాల్లో కనిపిస్తుండటం వల్ల, ఆమెను తన వారసురాలిగా కిమ్ సిద్ధం చేస్తున్నారనే చర్చ అంతర్జాతీయ స్థాయిలో మళ్లీ మొదలైంది. శత్రువుల వెన్నులో వణుకు పుట్టించేలా ఈ ఆయుధ శక్తి ఉంటుందని కిమ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ ఆయుధాల దాడి పరిధిలో శత్రువుల సైనిక మౌలిక సదుపాయాలు ఏవీ బతికి బట్టకట్టలేవని హెచ్చరించారు.

క్షిపణి పరీక్షలో కిమ్ జోంగ్ ఉన్ ఆయన కుమార్తె.. శత్రువుల వెన్నులో వణుకు పుట్టించే ఆయుధమిదే!
North Korea Military Drill
Jyothi Gadda
|

Updated on: Mar 15, 2026 | 9:49 AM

Share

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తన దూకుడును మరింత పెంచారు. అమెరికా, దక్షిణ కొరియాలు సంయుక్తంగా చేపట్టిన సైనిక విన్యాసాలకు కౌంటర్ ఇచ్చే క్రమంలో కిమ్ వరుసగా క్షిపణి పరీక్షలను నిర్వహిస్తున్నారు. తాజాగా శనివారం (మార్చి 14, 2026) నాడు జరిగిన మల్టిపుల్ రాకెట్ లాంచ్ సిస్టమ్స్ (MRLS) లైవ్-ఫైర్ పరీక్షలో కిమ్ తన కుమార్తెతో కలిసి పాల్గొన్నారు. కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (KCNA) విడుదల చేసిన ఫోటోలలో కిమ్, అతని కుమార్తె జు ఏ భారీ ఆలివ్-గ్రీన్ రంగు లాంచ్ ట్రక్కుల దగ్గర నడుస్తూ కనిపించారు. క్షిపణులు నిప్పులు చిమ్ముతూ ఆకాశంలోకి దూసుకెళ్తున్న దృశ్యాలను వారు నిశితంగా గమనించారు. గత కొంతకాలంగా కిమ్ తన కుమార్తెను ప్రముఖ సైనిక వేడుకలకు తీసుకురావడం వెనుక, ఆమెను భవిష్యత్తు నాయకురాలిగా తీర్చిదిద్దే ఉద్దేశ్యం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ సందర్భంగా కిమ్ ఈ ఆయుధ వ్యవస్థను అత్యంత ఘోరమైన, ఆకర్షణీయమైన ఆయుధం గా అభివర్ణించారు. ఈ రాకెట్లు సుమారు 420 కిలోమీటర్ల (260 మైళ్లు) దూరంలోని లక్ష్యాలను ఛేదించగలవు. అంటే దక్షిణ కొరియాలోని ప్రధాన సైనిక స్థావరాలన్నీ ఈ పరిధిలోకి వస్తాయి. ఒకవేళ ఈ ఆయుధాన్ని ఉపయోగిస్తే, శత్రువుల సైనిక మౌలిక సదుపాయాలు పూర్తిగా నాశనమవుతాయి. అవి ఎప్పటికీ మనుగడ సాగించలేవు అని కిమ్ పేర్కొన్నారు. ఈ రాకెట్ లాంచర్లు వ్యూహాత్మక అణ్వాయుధాలను కూడా మోసుకెళ్లగల సామర్థ్యాన్ని కలిగి ఉండటం గమనార్హం.

ఇవి కూడా చదవండి
North Korea Military Drill

ఉత్తర కొరియా ఏకకాలంలో సుమారు 10కి పైగా క్షిపణులను ప్రయోగించడంపై దక్షిణ కొరియా, అమెరికా తీవ్రంగా స్పందించాయి. ఇది ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలను ఉల్లంఘించడమేనని, ఈ రెచ్చగొట్టే చర్యలను వెంటనే ఆపాలని డిమాండ్ చేశాయి. ప్రస్తుతం కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు మరోసారి గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. వరుస క్షిపణి ప్రయోగాలు, వారసురాలి ప్రదర్శన ద్వారా కిమ్ తన సైనిక పటిష్టతను ప్రపంచానికి చాటిచెప్పాలనుకుంటున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
‘జాబ్ హగ్గింగ్’ వల్ల మీ కెరీర్ ప్రమాదంలో పడవచ్చు!
‘జాబ్ హగ్గింగ్’ వల్ల మీ కెరీర్ ప్రమాదంలో పడవచ్చు!
అభిషేక్‌తో పార్టనర్‌షిప్ గుట్టు విప్పిన సంజూ!
అభిషేక్‌తో పార్టనర్‌షిప్ గుట్టు విప్పిన సంజూ!
ఎండల్లో వేడి చేసి ఇబ్బంది పడుతున్నారా.. వారికి ఈ పులుసు బెస్ట్..
ఎండల్లో వేడి చేసి ఇబ్బంది పడుతున్నారా.. వారికి ఈ పులుసు బెస్ట్..
ఇవాళ వెలువడనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్
ఇవాళ వెలువడనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్
టూర్ లేదా ఫంక్షన్లకు వెళ్లేందుకు ట్రైన్ కోచ్‌లు బుక్ చేసుకోవచ్చు
టూర్ లేదా ఫంక్షన్లకు వెళ్లేందుకు ట్రైన్ కోచ్‌లు బుక్ చేసుకోవచ్చు
ఫిట్‌నెస్ కోచ్ చెబుతున్న ‘కార్బ్’ సీక్రెట్స్‌
ఫిట్‌నెస్ కోచ్ చెబుతున్న ‘కార్బ్’ సీక్రెట్స్‌
డ్రగ్స్‌ కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. టీడీపీ ఎంపీకి పాజిటివ్!
డ్రగ్స్‌ కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. టీడీపీ ఎంపీకి పాజిటివ్!
మనీ ప్లాంట్‌ను దొంగిలించి తెచ్చుకుంటే అదృష్టమా? వాస్తు శాస్త్రంలో
మనీ ప్లాంట్‌ను దొంగిలించి తెచ్చుకుంటే అదృష్టమా? వాస్తు శాస్త్రంలో
రూ.10 కోట్లతో ఫెరారీ కారు కొన్న టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యా
రూ.10 కోట్లతో ఫెరారీ కారు కొన్న టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యా
HBD Alia Bhatt: తండ్రిని మించిన తనయ.. బాక్సాఫీస్ ‘రాణి’గా ఆలియా!
HBD Alia Bhatt: తండ్రిని మించిన తనయ.. బాక్సాఫీస్ ‘రాణి’గా ఆలియా!