AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sanju Samson : సిక్సర్ కొట్టమంటాను.. కొడతాడు.. అంతా సింపుల్..అభిషేక్‌తో పార్టనర్‌షిప్ గుట్టు విప్పిన సంజూ!

Sanju Samson : టీ20 ప్రపంచకప్ 2026 చాంపియన్‌గా భారత్ అవతరించడంలో ఓపెనర్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మల జోడీ పోషించిన పాత్ర అద్భుతం. ముఖ్యంగా న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో వీరిద్దరూ కలిసి నెలకొల్పిన 98 పరుగుల రికార్డ్ ఓపెనింగ్ భాగస్వామ్యం టీమిండియా విజయానికి పునాది వేసింది.

Sanju Samson : సిక్సర్ కొట్టమంటాను.. కొడతాడు.. అంతా సింపుల్..అభిషేక్‌తో పార్టనర్‌షిప్ గుట్టు విప్పిన సంజూ!
Sanju Samson
Rakesh
|

Updated on: Mar 15, 2026 | 10:31 AM

Share

Sanju Samson : టీ20 ప్రపంచకప్ 2026 చాంపియన్‌గా భారత్ అవతరించడంలో ఓపెనర్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మల జోడీ పోషించిన పాత్ర అద్భుతం. ముఖ్యంగా న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో వీరిద్దరూ కలిసి నెలకొల్పిన 98 పరుగుల రికార్డ్ ఓపెనింగ్ భాగస్వామ్యం టీమిండియా విజయానికి పునాది వేసింది. ఈ చారిత్రాత్మక విజయం తర్వాత ఇండియా టుడే కాన్క్లేవ్ వేదికగా సంజూ శాంసన్ తమ మధ్య ఉన్న కెమిస్ట్రీ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తమది నిప్పు-నీరు (Fire and Ice) కాంబినేషన్ కాదని, ఇద్దరం కలిస్తే నిప్పు-నిప్పు (Fire and Fire) అని సంజూ వ్యాఖ్యానించడం విశేషం.

టోర్నీ ఆరంభంలో అభిషేక్ శర్మ తడబడగా, సంజూ కూడా కొన్ని మ్యాచుల్లో బెంచ్‌కే పరిమితమయ్యాడు. కానీ ఫైనల్ సమయానికి ఈ ఇద్దరూ ఒకే తాటిపైకి వచ్చి కివీస్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నారు. వీరిద్దరి వీరబాదుడు ధాటికి భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 255 పరుగుల భారీ స్కోరు సాధించింది. తమ మధ్య ఉన్న బంధం గురించి సంజూ మాట్లాడుతూ.. “మా మధ్య కేరళ-పంజాబీ స్నేహం ఉంది. మా భాగస్వామ్యం చాలా సింపుల్‌గా ఉంటుంది. బంతి ఎలా వస్తోంది? అని అభిషేక్ నన్ను అడుగుతాడు. బానే వస్తోంది, సిక్సర్ కొట్టు అని నేను చెబుతాను. అంతకు మించి మేం దేన్నీ కాంప్లికేట్ చేయం” అని నవ్వుతూ చెప్పుకొచ్చారు. అభిషేక్ శర్మ ధైర్యాన్ని, అతని క్యారెక్టర్‌ను తాను ఎంతగానో ప్రేమిస్తానని సంజూ పేర్కొన్నారు.

అభిషేక్ శర్మ కూడా తన లక్ష్యాల గురించి స్పష్టతనిచ్చారు. టోర్నీలో తనకు అనుకున్న ఆరంభం లభించకపోయినా, అంతిమంగా ట్రోఫీ గెలవడం తన కల అని ఆయన తెలిపారు. “ఒక్క ప్రపంచకప్‌తోనే నేను సంతృప్తి చెందను. దేశం కోసం మరిన్ని ఐసీసీ ట్రోఫీలు గెలవడమే నా లక్ష్యం” అని తన ఆశయాలను చాటారు. ఈ టోర్నీలో సంజూ శాంసన్ అద్భుతమైన ఫామ్‌ను కనబరిచి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును కూడా గెలుచుకున్నారు.

మైదానంలోనే కాకుండా మైదానం వెలుపల కూడా వీరిద్దరి స్నేహం భారత క్రికెట్‌కు కొత్త బలాన్నిస్తోంది. 2024 నుంచి కొనసాగుతున్న వీరి ఓపెనింగ్ ప్రయోగం, ఇప్పుడు ప్రపంచకప్ ఫైనల్‌లో అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం (98 పరుగులు) నెలకొల్పిన జోడీగా చరిత్ర సృష్టించింది. ఒకరు అనుభవం, మరొకరు దూకుడితో భారత్‌ను విశ్వవిజేతగా నిలిపారు. భవిష్యత్తులో కూడా ఈ ఫైర్ అండ్ ఫైర్ జోడీ ప్రత్యర్థి బౌలర్లకు మరిన్ని చుక్కలు చూపించడం ఖాయంగా కనిపిస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
అభిషేక్‌తో పార్టనర్‌షిప్ గుట్టు విప్పిన సంజూ!
అభిషేక్‌తో పార్టనర్‌షిప్ గుట్టు విప్పిన సంజూ!
ఎండల్లో వేడి చేసి ఇబ్బంది పడుతున్నారా.. వారికి ఈ పులుసు బెస్ట్..
ఎండల్లో వేడి చేసి ఇబ్బంది పడుతున్నారా.. వారికి ఈ పులుసు బెస్ట్..
ఇవాళ వెలువడనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్
ఇవాళ వెలువడనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్
టూర్ లేదా ఫంక్షన్లకు వెళ్లేందుకు ట్రైన్ కోచ్‌లు బుక్ చేసుకోవచ్చు
టూర్ లేదా ఫంక్షన్లకు వెళ్లేందుకు ట్రైన్ కోచ్‌లు బుక్ చేసుకోవచ్చు
ఫిట్‌నెస్ కోచ్ చెబుతున్న ‘కార్బ్’ సీక్రెట్స్‌
ఫిట్‌నెస్ కోచ్ చెబుతున్న ‘కార్బ్’ సీక్రెట్స్‌
డ్రగ్స్‌ కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. టీడీపీ ఎంపీకి పాజిటివ్!
డ్రగ్స్‌ కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. టీడీపీ ఎంపీకి పాజిటివ్!
మనీ ప్లాంట్‌ను దొంగిలించి తెచ్చుకుంటే అదృష్టమా? వాస్తు శాస్త్రంలో
మనీ ప్లాంట్‌ను దొంగిలించి తెచ్చుకుంటే అదృష్టమా? వాస్తు శాస్త్రంలో
రూ.10 కోట్లతో ఫెరారీ కారు కొన్న టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యా
రూ.10 కోట్లతో ఫెరారీ కారు కొన్న టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యా
HBD Alia Bhatt: తండ్రిని మించిన తనయ.. బాక్సాఫీస్ ‘రాణి’గా ఆలియా!
HBD Alia Bhatt: తండ్రిని మించిన తనయ.. బాక్సాఫీస్ ‘రాణి’గా ఆలియా!
చీపురు కట్ట, చెత్త బుట్ట ఈ దిశలో పెడితే అదృష్ట ద్వారం ఓపెన్
చీపురు కట్ట, చెత్త బుట్ట ఈ దిశలో పెడితే అదృష్ట ద్వారం ఓపెన్