AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 : ఐపీఎల్ 2026 తర్వాత ధోనీ రిటైర్మెంట్? ఈ నలుగురు స్టార్లకు ఇదే ఆఖరి సీజన్

IPL 2026 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) 19వ సీజన్ సందడి మొదలైపోయింది. మరో రెండు వారాల్లోనే క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలూగించేందుకు ఈ మెగా టోర్నీ సిద్ధమవుతోంది. మార్చి 28న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య తొలి పోరు జరగనుంది.

IPL 2026 : ఐపీఎల్ 2026 తర్వాత ధోనీ రిటైర్మెంట్? ఈ నలుగురు స్టార్లకు ఇదే ఆఖరి సీజన్
Ipl 2026
Rakesh
|

Updated on: Mar 15, 2026 | 12:28 PM

Share

IPL 2026 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) 19వ సీజన్ సందడి మొదలైపోయింది. మరో రెండు వారాల్లోనే క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలూగించేందుకు ఈ మెగా టోర్నీ సిద్ధమవుతోంది. మార్చి 28న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య తొలి పోరు జరగనుంది. అయితే, ఈ సీజన్ కొందరు దిగ్గజ ఆటగాళ్లకు చివరిది అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వయసు రీత్యా, ఫామ్ రీత్యా ఈ నలుగురు ఆటగాళ్లకు ఐపీఎల్ 2026 ఫేర్‌వెల్ సీజన్ కావొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

1. మహేంద్ర సింగ్ ధోనీ (చెన్నై సూపర్ కింగ్స్)

ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్ ఎంఎస్ ధోనీ. చెన్నై సూపర్ కింగ్స్‌ను ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిపిన ధోనీ, ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి కేవలం ఐపీఎల్‌లోనే కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఆయన వయసు 44 ఏళ్లు. గత సీజన్‌లో రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నప్పటికీ, కొన్ని అనివార్య కారణాల వల్ల ధోనీ మళ్ళీ పగ్గాలు చేపట్టాల్సి వచ్చింది. అయితే, ఈసారి సీఎస్కే టీమ్ సంజూ శాంసన్‌ను భారీ ధరకు కొనుగోలు చేసింది. టీ20 ప్రపంచకప్ 2026లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‎గా నిలిచిన సంజూను ధోనీ వారసుడిగా సీఎస్కే చూస్తోంది. అందుకే ధోనీకి ఇదే చివరి సీజన్ అయ్యే అవకాశం మెండుగా ఉంది. 278 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 5439 పరుగులు చేసిన ధోనీ, తన హోమ్ గ్రౌండ్ చెన్నైలో ఘనంగా కెరీర్‌ను ముగించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

2. అజింక్య రహానే (కోల్‌కతా నైట్ రైడర్స్)

కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) కెప్టెన్‌గా అజింక్య రహానే ఈ సీజన్‌లో బరిలోకి దిగుతున్నారు. ప్రస్తుతం రహానే వయసు 37 ఏళ్లు. బ్యాటర్‌గా గత కొంతకాలంగా రహానే ఫామ్ అంతంత మాత్రంగానే ఉంది. కేకేఆర్ యాజమాన్యం ఆయనపై నమ్మకంతో కెప్టెన్సీ ఇచ్చినప్పటికీ, ఈ సీజన్‌లో గనుక బ్యాటింగ్‌లో రాణించకపోతే వచ్చే ఏడాది ఆయనను రిటైన్ చేసుకునే అవకాశాలు తక్కువ. ఒకవేళ కేకేఆర్ విడుదల చేస్తే, ఈ వయసులో వేరే జట్టు రహానేను కొనుగోలు చేయడం కష్టమే. 198 మ్యాచ్‌ల్లో 5032 పరుగులు, 2 సెంచరీలు సాధించిన రహానేకు కూడా ఇది ఆఖరి ఐపీఎల్ కావొచ్చు.

3. ఇషాంత్ శర్మ (గుజరాత్ టైటాన్స్)

టీమిండియా వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ గత సీజన్ నుంచి గుజరాత్ టైటాన్స్ తరపున ఆడుతున్నారు. 37 ఏళ్ల ఇషాంత్ గత ఏడాది ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. 7 మ్యాచ్‌ల్లో కేవలం 4 వికెట్లు మాత్రమే తీసి, 11 కంటే ఎక్కువ ఎకానమీతో పరుగులు సమర్పించుకున్నారు. ఈ సీజన్‌లోనూ గుజరాత్ ఆయనను కొనసాగిస్తోంది కానీ, ఈసారి కూడా పరుగులను కట్టడి చేయలేకపోతే ఇషాంత్ ఐపీఎల్ కెరీర్ ముగిసినట్లే. యువ పేసర్ల ధాటికి తట్టుకుని నిలబడటం ఇషాంత్‌కు ఈ వయసులో సవాలుతో కూడుకున్న పని.

4. మార్కస్ స్టోయినిస్ (పంజాబ్ కింగ్స్)

ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్‌ను పంజాబ్ కింగ్స్ రూ. 11 కోట్లకు రిటైన్ చేసుకుంది. అయితే, 36 ఏళ్ల స్టోయినిస్ గత కొన్ని నెలలుగా ఫామ్‌లో లేక సతమతమవుతున్నారు. భారీ ధర చెల్లిస్తున్నా జట్టుకు కావలసిన విజయాలను అందించడంలో ఆయన విఫలమవుతున్నారు. పంజాబ్ కింగ్స్ ఎప్పుడూ ఆటగాళ్లను త్వరగా మార్చేసే అలవాటు ఉన్న టీమ్. ఈ సీజన్‌లో గనుక స్టోయినిస్ బ్యాటుతో, బంతితో అద్భుతాలు చేయకపోతే పంజాబ్ ఆయనను వదిలేయడం ఖాయం. ఆల్ రౌండర్‌గా స్టోయినిస్ కెరీర్‌కు ఈ ఐపీఎల్ 2026 ఒక కీలక మలుపు కానుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us