AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రియుడి మోజులో భార్య ఘాతుకం! భర్త పేరుపై రూ. 50 లక్షల ఇన్సూరెన్స్ చేయించి మరీ.. మర్డర్‌ ప్లాన్‌

మంచిర్యాల జిల్లాలో దారుణమైన నేర ఉదంతం వెలుగుచూసింది. ప్రియుడితో కలిసి హాయిగా జీవించాలనే కోరికతో ఒక మహిళ, చెట్టంత ఎదిగిన ఇద్దరు కొడుకులను, కట్టుకున్న భర్తను కాదనుకుని ఘాతుకానికి ఒడిగట్టింది. భర్తను పక్కా స్కెచ్‌తో హతమార్చి, దానిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన భార్య గుట్టును పోలీసులు రట్టు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ప్రియుడి మోజులో భార్య ఘాతుకం! భర్త పేరుపై రూ. 50 లక్షల ఇన్సూరెన్స్ చేయించి మరీ.. మర్డర్‌ ప్లాన్‌
Mancherial Murder Case
Naresh Gollana
| Edited By: |

Updated on: May 26, 2026 | 7:36 PM

Share

ప్రియుడు మోజులో పడిన ఓ మహిళ.. కట్టుకున్నవాడినే కడతేర్చించింది. పక్కా ఫ్లాన్ వేసి భర్త పేరుపై 50 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్ కట్టి మరీ కాటికి పంపింది. కర్రలతో చితక బాది రోడ్డు యాక్సిడెంట్ గా చిత్రీకరించి దారుణానికి ఒడిగట్టింది. మృతుడి తల్లి ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి‌ దిగడంతో అసలు క్రైం కథ చిత్రం బయటపడింది. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడిపేటలో చోటు చేసుకున్న ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

మంచిర్యాల జిల్లా హాజీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముల్కల్ల సమీపంలో ఈనెల 22 న గుడిపేటకు చెందిన సాయిని కుమార్(45) అనే వ్యక్తి‌ అనుమాస్పద స్థితిలో మృతిచెందాడు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న సాయిని‌కుమార్.. పని ఉందని చెప్పి ఉదయం ద్విచక్రవాహనంపై మంచిర్యాలకు వెళ్తున్న క్రమంలో ముల్కల్ల సమీపంలో జాతీయ రహదారిపై అనుమానస్పద స్థితిలో తీవ్రగాయాలతో పడిపోయి కనిపించాడు. కుమార్ ను గుర్తించిన స్థానికులు 108 వాహనంలో మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో కరీంనగర్ కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతిపై అనుమానం ఉందంటూ తల్లి సాయిని లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని‌ దర్యాప్తు చేపట్టారు పోలీసులు.

పోలీసుల విచారణంలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. మృతుడి భార్య సాయిని భారతినే భర్తను హతమార్చి యాక్సిడెంట్ గా చిత్రీకరించిందని తేలింది. మంచిర్యాల జిల్లా గుడిపేట కు చెందిన సాయిని కుమార్ కు అదే గ్రామానికి చెందిన భారతి తో 2002 లో వివాహం అయింది. వీరిద్దరికి ఇద్దరు కుమారులున్నారు. పదేళ్ల పాటు సంసారం సజావుగానే సాగింది. 2012 లో గుడిపేట్ గ్రామానికి చెందిన లగిశెట్టి సురేందర్ తో పరిచయం అయింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో వారిద్దరి మద్య వివాహేతర సంబందం కుదిరింది. ఆ విషయం భర్త కుమార్ కు తెలియడంతో మనోవేదనకు గురయ్యాడు. తాగుడుకు బానిసయ్యాడు. ఇదే విషయంలో భార్య భర్తల మధ్య తరుచూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఇదే సమయంలో వ్యవసాయ పనుల కోసం గుడిపేట్ గ్రామానికే చెందిన రామ్ మల్లేష్ అనే వ్యక్తి వద్ద 60 వేల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. అప్పు తీర్చాలంటూ కుమార్ ను బెదిరించడంతో కలుగ చేసుకున్న భార్య భారతి నీ అప్పు నేను తీరుస్తానంటూ చెప్పుకొచ్చింది. కానీ నాకో పని చేసి పెట్టాలంటూ డిమాండ్ చేసింది.

ఇవి కూడా చదవండి

పక్కా ఫ్లాన్ ప్రకారం భర్త సాయిని కుమార్ పేరు మీద 50 లక్షల వరకు లైఫ్ ఇన్సూరెన్స్ చేయించింది. తాగుడుకి బానిసైన భర్య కుమార్ ను ముందస్తుగా వేసుకున్న ఫ్లాన్ ప్రకారం బాగా తాగించి కొట్టి రోడ్డు పడేసి యాక్సిడెంట్ గా చిత్రీకరించాలని ఫ్లాన్ వేసింది. అనుకున్నదే తడువుగా.. ప్రియుడు సురేందర్ , తాజాగా దగ్గరైన రామ్ మల్లేష్ లతో కలిసి మర్డర్ స్కెచ్ వేసింది. భర్త కుమార్ ను చంపేందుకు రామ్ మల్లేష్ తో 10 లక్షల సుపారీ డీల్ కుదుర్చుకుంది. ఏప్రిల్ 2026 లో 2 లక్షల రూపాయల అడ్వాన్సు గా ఇచ్చి.. కుమార్ ను చంపేశాక మిగిలిన డబ్బులు ఇస్తానని డీల్ కుదుర్చుంది భార్య భారతి. మల్లేష్ అనే వ్యక్తి శ్రీరామ్ మేస్త్రీ అనే వ్యక్తి‌ సాయంతో పక్కాఫ్లాన్ ప్రకారం ఈనెల 22 న రాత్రి ముల్కల్ల గ్రామ శివారులో రాత్రి సమయం లో మృతునికి పీకల దాక మద్యం తాగించి, ఇనుప సుత్తె తో తల పై బలంగా కొట్టి గాయపరిచారు. చనిపోయాడని భావించి కుమార్ ముల్కల రోడ్డు పై పడేసి పరారయ్యారు. రక్తపు మడుగులో ఉన్న కుమార్ ను స్థానికులు గుర్తించి అంబులెన్స్ లో మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కరీంనగర్ కు తరలిస్తుండగా కుమార్ మార్గ మద్యలోనే మృతి చెందాడు. మృతుడి తలపై బలమైన గాయాలు ఉండటం.. వాహనం ఢీకొన్న ఆనవాళ్లు లేకపోవడంతో మృతుడి తల్లి లక్ష్మి తన కొడుకు మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టి భార్య భారతిని తమదైన స్ఠైల్ లో విచారించడంతో అన్నీవిషయాలు బయటపడ్డాయి‌.

ప్రియుడు సురేందర్ తో కలిసి జీవించాలనే కోరికతోనే భర్తను మట్టుపెట్టినట్టు సాయిని భారతి పోలీసుల ముందు ఒప్పుకుంది. చెట్టంత ఎదిగిన ఇద్దరు కొడుకులను కాదనుకుని.. ప్రియుడు కోసం కట్టుకున్న వాడిని సైతం వదులుకోవాలన్న ఆశతోనే ఇంతటి దారుణానికి ఒడిగట్టింది భారతి. కుమార్ ను హత్య చేసిన నిందితులు ఏ1 మల్లేష్ , ఏ2 మేస్త్రీ శ్రీను, ఏ3 భారతి , ఏ4 సురేందర్ లను‌ అరెస్ట్ చేసి రిమాండ్ కు‌ తరలించారు పోలీసులు. నిందితుల వద్ద నుండి ఒక‌ బైక్, 25 వేల నగదు, హత్య కు ఉపయోగించిన సుత్తి, కర్ర, మూడు ఫోన్లు.. కుమార్ పై లైఫ్ ఇన్సూరెన్స్ చేయించిన బాండ్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us