AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prema : ఆ స్టార్ హీరోతో లవ్ అంటూ రూమర్స్.. ఎట్టకేలకు ఓపెన్ అయిన హీరోయిన్ ప్రేమ..

ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగింది. ఆ తర్వాత వరుస సినిమాలతో మెప్పించింది. కథానాయికగా అలరించిన ఆమె.. తర్వాత సహయ నటిగా రాణించింది. చాలా కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న ఆమె.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు తన గురించి వచ్చిన రూమర్స్ పై స్పందించారు.

Prema : ఆ స్టార్ హీరోతో లవ్ అంటూ రూమర్స్.. ఎట్టకేలకు ఓపెన్ అయిన హీరోయిన్ ప్రేమ..
Prema
Rajitha Chanti
|

Updated on: Jun 21, 2026 | 9:57 PM

Share

1990ల నాటి ప్రేక్షకులకు హీరోయిన్ ప్రేమ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. కన్నడ ఇండస్ట్రీ నుండి వచ్చినప్పటికీ, హోమ్లీ లుక్స్‌తో పాటు అద్భుతమైన నటనతో టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన సోషియో ఫాంటసీ మూవీ ‘దేవి’ ప్రేమ కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచింది. పాము క్యారెక్టర్‌లో, దేవిగా ఆమె చూపించిన నటన, పర్సనాలిటీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్, లైఫ్, రూమర్స్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. “ఇప్పుడు చాలామంది డైరెక్టర్స్‌కు నేను గుర్తుండకపోవచ్చు. కానీ, చిరునవ్వుతో స్మాల్ క్యారెక్టర్ అయినా చేయగలను అని ఒకప్పుడు పేరుంది. ఇప్పుడు రాజేంద్రప్రసాద్‌తో అనుకోని ఒక ప్రయాణం అనే సినిమాలో చిన్న పాత్ర చేశాను, కానీ దానికి ప్రాధాన్యత ఉండేది,” అని ప్రేమా అన్నారు. ప్రస్తుతం వస్తున్న లేడీ ఓరియెంటెడ్ కథలు లేదా ప్రాధాన్యత లేని పాత్రలపై ఆమె ఆసక్తి చూపట్లేదు.

ఉపేంద్రతో గాసిప్స్‌పై స్పందన:

నటుడు ఉపేంద్రతో తనపై ఒకప్పుడు వచ్చిన ప్రేమ గాసిప్స్‌ గురించి అడగ్గా, ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. “తెలీదు. వాళ్లనే అడగాలి అనుకుంటున్నాను. ఎవరు రాశారో వాళ్ళని అడగాలి నేను. ఎప్పుడూ నాతో కలిసి మాట్లాడలేదు, ఇలా రాస్తున్నాను అని కూడా నాకు చెప్పలేదు. బట్ రాశారు. గాసిప్. ఐ డోంట్ గివ్ ఇంపార్టెన్స్ టు గాసిప్,” అని ఆమె స్పష్టం చేశారు. ఆ విషయమై ఉపేంద్ర కానీ, తాను కానీ ఎప్పుడూ మాట్లాడుకోలేదని, తన దృష్టి మొత్తం తన పనిపైనే ఉంటుందని తెలిపారు. పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఇలాంటి గాసిప్స్ కామన్ అని, పాజిటివ్, నెగటివ్ రెండూ స్వీకరించాలని ఆమె పేర్కొన్నారు.

పాత పరిచయాలు, ప్రస్తుత స్నేహాలు:

సౌందర్యతో తన స్నేహాన్ని గుర్తు చేసుకుంటూ, “ఎప్పుడూ హైదరాబాద్‌కి వెళ్తే ఇద్దరం వెళ్ళి మాట్లాడేవాళ్ళం,” అని ప్రేమా అన్నారు. ప్రస్తుతం సినీ పరిశ్రమతో ఎక్కువ టచ్ లేదని, తన స్నేహితులు పరిశ్రమకు బయటివారేనని చెప్పారు. వారితో కలిసి బండిపూర్‌, కబిని, గోవా వంటి ప్రదేశాలకు వెళ్తూ జీవితాన్ని ఆస్వాదిస్తున్నానని తెలిపారు. వడ్డే నవీన్‌తో తన కాంబినేషన్ కోరుకున్న ప్రియుడు సినిమాను గుర్తుచేసుకున్నారు. ఆ సినిమాను తీసిన రాజు గారిని, వాణిశ్రీతో లాయర్ పాత్రలో నటించడం ఒక ఛాలెంజ్ అని పేర్కొన్నారు. వడ్డే నవీన్ కూడా తనలాగే ఇండస్ట్రీలో సైలెంట్‌గా ఉన్నారని, ఇద్దరూ ఫోన్‌లో మాట్లాడుకున్నా, సినిమా గురించి ఎప్పుడూ చర్చించుకోలేదని ఆమె అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : పవన్ కళ్యాణ్, మహేష్ బాబులతో సినిమాలు… కట్ చేస్తే.. 51 ఏళ్ల వయసులో ప్రియుడిని పరిచయం చేసిన హీరోయిన్..

Follow Us