AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajinikanth: కండక్టర్‏గా రజినీకాంత్ ఐడీ కార్డ్.. నెట్టింట వైరలవుతున్న అరుదైన ఫోటో.. మీరు చూశారా.. ?

సూపర్ స్టార్ రజినీకాంత్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి భారతీయ చలనచిత్ర రంగాన్ని దశాబ్దాలుగా శాసిస్తూ, కోట్లాది మంది అభిమానుల గుండెల్లో 'సూపర్‌స్టార్'గా నిలిచిపోయిన ఏకైక నటుడు ఆయనే. స్టైల్‌కు మారుపేరైన ఆయన అసలు పేరు శివాజీ రావు గైక్వాడ్. ఒక సాధారణ బస్సు కండక్టర్ స్థాయి నుంచి ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యధిక పారితోషికం తీసుకునే అత్యున్నత నటులలో ఒకరిగా ఎదిగిన ఆయన ప్రస్థానం ఎందరికో స్ఫూర్తిదాయకం.

Rajinikanth: కండక్టర్‏గా రజినీకాంత్ ఐడీ కార్డ్.. నెట్టింట వైరలవుతున్న అరుదైన ఫోటో.. మీరు చూశారా.. ?
Rajinikanth
Rajitha Chanti
|

Updated on: May 26, 2026 | 6:23 PM

Share

చిత్ర పరిశ్రమలో ఎంత ఎదిగినా తన గతాన్ని, సాధారణ జీవితాన్ని మర్చిపోని వ్యక్తిత్వానికి నిదర్శనం సూపర్‌స్టార్ రజనీకాంత్. సినిమా రంగంలోకి ప్రవేశించకముందు ఆయన బెంగళూరు ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్ (BTS) లో బస్సు కండక్టర్‌గా పనిచేశారనే విషయం అందరికీ తెలిసిందే. తాజాగా, రజనీకాంత్ కండక్టర్‌గా పనిచేసిన కాలం నాటి ఆయన ఒరిజినల్ ఐడెంటిటీ కార్డ్ (ID Card) సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. సినీ అభిమానులు, నెటిజన్లు ఈ అరుదైన ఫోటోను చూసి తెగ మురిసిపోతున్నారు. ఈ గుర్తింపు కార్డుపై రజనీకాంత్ అసలు పేరు ‘శివాజీ రావు గైక్వాడ్’ అని స్పష్టంగా రాసి ఉంది. అలాగే ఆయన కండక్టర్ బ్యాడ్జ్ నంబర్ కూడా ఇందులో కనిపిస్తోంది. బెంగళూరులో ‘రూట్ నంబర్ 10A’ బస్సులో ఆయన విధులను నిర్వహించేవారని ఈ వివరాల ద్వారా తెలుస్తోంది. అప్పట్లో రజనీకాంత్ స్టైల్‌గా టిక్కెట్లు చించడం, ప్రయాణికులతో మాట్లాడే విధానం అప్పట్లోనే ఎంతోమందిని ఆకట్టుకునేదని ఆయన పాత స్నేహితులు చెబుతుంటారు.

గతాన్ని మరవని తలైవా:

రజనీకాంత్ స్టార్ డమ్ తెచ్చుకున్నాక కూడా తన పాత వృత్తిని, ఆ రోజుల్లో తనకు అండగా నిలిచిన డ్రైవర్ రాజ్ బహదూర్‌ను ఎప్పుడూ మర్చిపోలేదు. కొన్ని నెలల క్రితం రజనీకాంత్ అకస్మాత్తుగా బెంగళూరులోని జయనగర్ బీఎంటీసీ (BMTC) బస్ డిపోను సందర్శించి అక్కడి డ్రైవర్లు, కండక్టర్లతో సరదాగా గడిపారు. తన పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.

లోకేష్ కనగరాజ్ ‘కూలీ’ కనెక్షన్:

దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో రజనీకాంత్ నటిస్తున్న ‘కూలీ’ (Coolie) సినిమా పోస్టర్లలో కూడా ఒక ప్రత్యేకమైన బస్సు కండక్టర్ బ్యాడ్జ్ నంబర్ (1421) ను చూపించారు. అయితే ఆ నంబర్ లోకేష్ కనగరాజ్ తండ్రి (ఆయన కూడా కండక్టరే) బ్యాడ్జ్ నంబర్ అని డైరెక్టర్ ఇటీవలే వెల్లడించారు. ఈ నేపథ్యంలో రజనీకాంత్ ఒరిజినల్ కండక్టర్ ఐడీ కార్డ్ బయటకు రావడంతో అభిమానులు దీనిని మరింతగా షేర్ చేస్తున్నారు. ఒక సాధారణ కండక్టర్ స్థాయి నుంచి భారతీయ సినీ ప్రపంచాన్ని శాసించే ‘సూపర్‌స్టార్’గా ఎదిగిన రజనీకాంత్ ప్రస్థానం నిజంగా ఎందరికో స్ఫూర్తిదాయకం.

ఎక్కువ మంది చదివినవి : Srikanth : ఆ హీరోయిన్ నాకు చాలా స్పెషల్.. నటనలో ఆమె నాకు పోటీగా ఉండేది.. హీరో శ్రీకాంత్..

రజినీకాంత్ ఐడీ కార్డ్ ఫోటో.. 

Rajinikanth Id Card

Rajinikanth Id Card

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆ హీరో చాలా అందగాడు.. టాలెంట్ ఉంది.. కానీ స్టార్ హీరో కాలేకపోయాడు.. ఎక్కడ తప్పు చేశాడంటే..

Follow Us
పరోటా మంచిగా దాబా స్టైల్ రావాలంటే ఇలా చేయండి...
పరోటా మంచిగా దాబా స్టైల్ రావాలంటే ఇలా చేయండి...
హారతిని 3, 5, 7 వంటి బేసి సంఖ్యలతోనే ఎందుకు ఇస్తారు? దీని వెనుక..
హారతిని 3, 5, 7 వంటి బేసి సంఖ్యలతోనే ఎందుకు ఇస్తారు? దీని వెనుక..
తండ్రి కొత్త మొబైల్ కొనివ్వలేదని... కొడుకు ఆత్మహత్య
తండ్రి కొత్త మొబైల్ కొనివ్వలేదని... కొడుకు ఆత్మహత్య
యూపీఐ ట్రాన్సాక్షన్లకు ఛార్జీలు.. లైన్ క్లియర్ అయింది..
యూపీఐ ట్రాన్సాక్షన్లకు ఛార్జీలు.. లైన్ క్లియర్ అయింది..
వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. ఇకపై అలా చేస్తే కేసులే
వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. ఇకపై అలా చేస్తే కేసులే
యూపీఐ లావాదేవీ ఫెయిల్ అయినా అకౌంట్లో డబ్బులు కట్ అయ్యాయా..?
యూపీఐ లావాదేవీ ఫెయిల్ అయినా అకౌంట్లో డబ్బులు కట్ అయ్యాయా..?
పొలం గట్లపై రైతుకు కనిపించిన వింత గుర్తులు.. ఏంటని ఆరా తీయగా
పొలం గట్లపై రైతుకు కనిపించిన వింత గుర్తులు.. ఏంటని ఆరా తీయగా
తక్కువ ఖర్చులో విరాట్ కోహ్లీ డైట్‌ ఫాలో అవ్వొచ్చు!
తక్కువ ఖర్చులో విరాట్ కోహ్లీ డైట్‌ ఫాలో అవ్వొచ్చు!
చెవిలో వెంట్రుకలు ఉండే వ్యక్తి నిజ స్వరూపం ఇదే.. షాకింగ్ సీక్రెట్
చెవిలో వెంట్రుకలు ఉండే వ్యక్తి నిజ స్వరూపం ఇదే.. షాకింగ్ సీక్రెట్
నాన్‌వెజ్ మాత్రమే కాదు.. శ్రావణమాసంలో ఈ ఆకు కూరలు కూడా తినొద్దట!
నాన్‌వెజ్ మాత్రమే కాదు.. శ్రావణమాసంలో ఈ ఆకు కూరలు కూడా తినొద్దట!
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర