Viral moon image: సోషల్ మీడియాను ఊపేస్తున్న మూన్ పిక్.. అసలు మ్యాటర్ ఏంటంటే?
సాధారణంగా సోషల్ మీడియాలో మనం రోజు వందలాది చిత్రాలను చూస్తుంటాం. వాటిలో ప్రముఖ బ్రాండ్లో, లేదా హీరోల ఫోటోలు మాత్రమే హైలెట్ అవుతూ ఉంటాయి. కానీ ఇప్పుడో చిత్రం మాత్రం సోషల్ మీడియా మొత్తాన్ని షేక్ చేస్తుంది. అది చూడ్డానికి చాలా సింపుల్‌గా ఉన్నా.. నెటిజన్లను మాత్రం తెగ ఆటకట్టుకుంటోంది. ఇంతకూ ఆ చిత్రంలో ఏముంది. ఆదేమైనా ప్రముఖ బ్రాండ్‌కు సంబంధించన లోగోనా లేదా ఏదైనా సినిమా ఫస్ట్ లుకా అనే చర్చ మొదలైంది.

ఈ ఫోటో చూడండి. ఇది సోషల్ మీడియాలో వచ్చినప్పటి నుంచి హాట్ టాపిక్ గా మారింది. ఇది ఏదైనా పెద్ద బ్రాండ్ కు సంబంధించి టీజరా అని కొందరు నెట్టింట చర్చిస్తున్నారు. మరికొందరేమో.. ఏదైనా మెగా క్యాంపెయిన్ కు సంబంధించిన ఫస్ట్ లుక్కా అని డిస్కస్ చేస్తున్నారు. మామూలుగా అయితే సెలబ్రెటీలపైనే అందరి దృష్టీ ఉంటుంది. దానిని కాస్తా పక్కనపెట్టి.. ఇప్పుడు ఇంటర్నెట్ లో ఈ చంద్రుడి ఫోటో గురించే చర్చ నడుస్తోంది. అందరిదీ ఒకటే ప్రశ్న. అసలీ వైరల్ ఇమేజ్ ఏ బ్రాండ్ ది?
ఈ ఫోటో సినిమాటిక్ గా ఉంది. పైగా ఇందులో ఎలాంటి క్లూ లేదు. సందర్భం కూడా లేదు. అలా ఒక్కసారిగా రిలీజ్ అయిపోయి వైరల్ అయ్యింది. అందుకే ఇది ఏమిటా అన్న క్యూరియాసిటీని ఇంటర్నెట్ యూజర్స్ లో విపరీతంగా పెంచింది. ఏదైనా పెద్ద బ్రాండ్.. కొత్తగా ఏమైనా స్టార్ట్ చేయబోతోందా? లేదా ఏదైనా మార్కెటింగ్ వ్యూహమా? అన్న ఊహాగానాలు ఇంటర్నెట్ లోకంలో పెరిగాయి. ఇప్పటికైతే ఎవరికీ దీని గురించి తెలియదు. కానీ ఒక్కటి మాత్రం క్లారిటీగా చెప్పచ్చు. ఇంటర్నెట్ ప్రపంచాన్ని ఇది ఊహాలోకంలోకి తీసుకెళ్లింది.
వీడియో చూడండి..
మన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
