AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అర్ష్‌దీప్ సింగ్‌కు ఏమైంది.. ఏకంగా 200లకుపైగా పోస్ట్‌లు డిలీట్.. అసలు రీజన్ అదేనా..?

Arshdeep Singh Instagram Posts Deleted: మైదానంలో ఆటపై కంటే సోషల్ మీడియాపైనే ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారనే విమర్శలు రావడం ఏ ఆటగాడికైనా మంచిది కాదు. బహుశా అర్ష్‌దీప్ సింగ్ కూడా తన తప్పులను తెలుసుకొని, ఇకపై వివాదాలకు దూరంగా ఉంటూ కేవలం తన క్రికెట్ కెరీర్‌పైనే పూర్తి దృష్టి పెట్టాలని భావించే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది.

అర్ష్‌దీప్ సింగ్‌కు ఏమైంది.. ఏకంగా 200లకుపైగా పోస్ట్‌లు డిలీట్.. అసలు రీజన్ అదేనా..?
Arshdeep Singh
Venkata Chari
|

Updated on: May 26, 2026 | 3:11 PM

Share

Arshdeep Singh Instagram Posts Deleted: భారత క్రికెట్ జట్టు యువ పేసర్, పంజాబ్ కింగ్స్ ఆటగాడు అర్ష్‌దీప్ సింగ్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో జరిగిన ఒక ఊహించని పరిణామం ఇప్పుడు క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మైదానంలోనే కాకుండా సామాజిక మాధ్యమాల్లోనూ ఎంతో చురుగ్గా ఉంటూ అభిమానులను అలరించే ఈ స్పీడ్‌స్టర్, తాజాగా తన ఖాతా నుంచి ఏకంగా 200కు పైగా పోస్టులను తొలగించి అందరికీ పెద్ద షాక్ ఇచ్చాడు.

నెట్టింట అర్ష్‌దీప్ సంచలన నిర్ణయం..

క్రికెట్ ప్రపంచంలో అర్ష్‌దీప్ సింగ్ ఆటతీరుతో పాటు ఆయన చేసే వినోదాత్మక వీడియోలకు, రీల్స్‌కు విపరీతమైన ఆదరణ ఉంది. తీరిక సమయం దొరికినప్పుడల్లా తోటి ఆటగాళ్లతో కలిసి సరదాగా వీడియోలు చేస్తూ అభిమానులతో పంచుకోవడం ఆయనకు అలవాటు. అయితే, తాజాగా ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ పేజీని పూర్తిగా ప్రక్షాళన చేశాడు. ప్రస్తుతం ఆయన ఖాతాలో కేవలం 44 పోస్టులు మాత్రమే మిగిలాయి. అందులోనూ ఎక్కువ భాగం వివిధ వ్యాపార ప్రకటనలకు సంబంధించినవే కావడం గమనార్హం.

ఇది కూడా చదవండి: IPL 2026 Winner: ఫైనల్ ఆడేది ఆ రెండు జట్లే.. ట్రోఫీ పట్టుకపోయేది మాత్రం వాళ్లే: రికీ పాంటింగ్

ఇవి కూడా చదవండి

కోహ్లీతో చేసిన రికార్డు వీడియో కూడా మాయం..!

గత ఏడాది డిసెంబర్ నెలలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో కలిసి అర్ష్‌దీప్ చేసిన ఒక ప్రత్యేక వీడియో సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టించింది. దాదాపు 15 మిలియన్లకు పైగా వీక్షణలు (వ్యూస్) సాధించిన ఆ అరుదైన వీడియోను సైతం అర్ష్‌దీప్ ఇప్పుడు తొలగించాడు. దీంతో ఆరాధ్య ఆటగాడికి అసలు ఏమైంది? ఎందుకిలా పాత జ్ఞాపకాలన్నింటినీ చెరిపేస్తున్నాడంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని వెనుక బలమైన కారణాలే ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

వివాదాల సుడిగుండంలో యువ పేసర్..

గత కొన్ని రోజులుగా అర్ష్‌దీప్ సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టినా అది కాస్తా వివాదాలకు దారితీస్తోంది. కొద్దిరోజుల క్రితం ఆయన విమాన ప్రయాణంలో ఉన్నప్పుడు తీసిన ఒక వీడియో తీవ్ర దుమారం రేపింది. ఆ వీడియోలో తోటి ఆటగాడు యుజ్వేంద్ర చాహల్ ఈ-సిగరెట్ (వేపింగ్) కాలుస్తూ కెమెరాకు దొరికిపోయాడు. ఈ సంఘటన క్రీడా వర్గాల్లో తీవ్ర విమర్శలకు దారితీయడంతో, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తీవ్రంగా స్పందించింది. లీగ్ మ్యాచ్‌లు ముగిసేవరకు సోషల్ మీడియాలో ఎలాంటి వీడియోలు చేయకూడదంటూ అర్ష్‌దీప్‌ను గట్టిగా హెచ్చరించినట్లు సమాచారం.

ఇది కూడా చదవండి: IPL 2026 Playoffs: ఎవరు గెలిచినా సరికొత్త చరిత్రే.. అక్కడే ఉంది అసలైన ట్విస్ట్..!

ఫ్రాంఛైజీ కఠిన నిబంధనలు.. దెబ్బకు దిగొచ్చిన ఆటగాడు?

ఇదిలా ఉండగానే, ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌కు ముందు అర్ష్‌దీప్ పంచుకున్న మరో వీడియో వివాదాన్ని మరింత పెద్దది చేసింది. తోటి ఆటగాడు తిలక్ వర్మ చర్మ రంగును ఉద్దేశిస్తూ ‘ఓయ్.. అంధేరా’ (చీకటి) అంటూ అర్ష్‌దీప్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. జాతివివక్ష పూరిత వ్యాఖ్యల కిందకు ఇవి వస్తాయంటూ నెటిజన్లు అర్ష్‌దీప్‌పై మండిపడ్డారు.

ఇది కూడా చదవండి: ఐపీఎల్ హిస్టరీలో 13 ఏళ్ల ఐరెన్ లెగ్ ప్లేయర్.. ఏ జట్టులో చేరినా ట్రోఫీకి దూరమవ్వాల్సిందే..?

ఈ వరుస వివాదాల నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ యాజమాన్యం తమ ఆటగాళ్లపై కఠినమైన నిబంధనలు విధించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇకపై ఆటగాళ్లు తమ వ్యక్తిగత ఖాతాల నుంచి జట్టుకు సంబంధించిన ఎలాంటి వీడియోలను పోస్ట్ చేయకూడదని, ఏవైనా ఉంటే ఫ్రాంఛైజీ అధికారిక ఖాతాల ద్వారానే విడుదల చేయాలని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ మానసిక ఒత్తిడి వల్లే అర్ష్‌దీప్ తన పాత పోస్టులన్నింటినీ డిలీట్ చేసి ఉంటాడని నెటిజన్లు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ జట్టు ఆరంభంలో అద్భుతంగా రాణించినప్పటికీ, ఆ తర్వాత వరుస ఓటములతో ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
200లకుపైగా పోస్ట్‌లు డిలీట్ చేసిన అర్ష్‌దీప్ సింగ్‌.. కారణం అదేనా
200లకుపైగా పోస్ట్‌లు డిలీట్ చేసిన అర్ష్‌దీప్ సింగ్‌.. కారణం అదేనా
బరువు తగ్గాలనుకునేవారికి పోషకాలతో నిండిన పచ్చి బొప్పాయి పచ్చడి
బరువు తగ్గాలనుకునేవారికి పోషకాలతో నిండిన పచ్చి బొప్పాయి పచ్చడి
ఉపేంద్రకు ఇంత పెద్ద కొడుకున్నాడా? గ్రాండ్‌గా నిరంజన్ ఎంగేజ్మెంట్
ఉపేంద్రకు ఇంత పెద్ద కొడుకున్నాడా? గ్రాండ్‌గా నిరంజన్ ఎంగేజ్మెంట్
కేతువు అనుగ్రహం.. ఈ రాశి వారు భూమి కొనడం పక్కా!
కేతువు అనుగ్రహం.. ఈ రాశి వారు భూమి కొనడం పక్కా!
ఫాస్టాగ్ పని చేయడం లేదా..? కేంద్రం సూచనలు ఇవే..
ఫాస్టాగ్ పని చేయడం లేదా..? కేంద్రం సూచనలు ఇవే..
కాటేరమ్మ కొడుకులు ఎంతమంది వచ్చినా డోంట్ కేర్..: రియాన్ పరాగ్
కాటేరమ్మ కొడుకులు ఎంతమంది వచ్చినా డోంట్ కేర్..: రియాన్ పరాగ్
సిటీలో వచ్చిన జీతం సరిపోవట్లేదా?.. జస్ట్ ఈ అలవాట్లు పాటిస్తే చాలు
సిటీలో వచ్చిన జీతం సరిపోవట్లేదా?.. జస్ట్ ఈ అలవాట్లు పాటిస్తే చాలు
ఏముంది బ్రో ఐడియా.. రూ. 1500 లకు స్కూటర్ ఏసీగా మారింది! ఎండ దెబ్బ
ఏముంది బ్రో ఐడియా.. రూ. 1500 లకు స్కూటర్ ఏసీగా మారింది! ఎండ దెబ్బ
పాత కాలం నాటి రైతుల వేసవి డ్రింక్.. తాగారంటే బాడీ మొత్తం కూల్..
పాత కాలం నాటి రైతుల వేసవి డ్రింక్.. తాగారంటే బాడీ మొత్తం కూల్..
30 వేల అడుగుల ఎత్తులో పైలట్‌కు గుండెపోటు
30 వేల అడుగుల ఎత్తులో పైలట్‌కు గుండెపోటు