AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: ‘వాళ్లంతా తోపులేమో’.. ఒక్క మాటతో ఇచ్చిపడేసిన సూర్యకుమార్ యాదవ్..!

సూర్యకుమార్ యాదవ్ తనపై వస్తున్న గాయం పుకార్లను పటాపంచలు చేసినప్పటికీ, అసలైన సవాలు మునుముందు ఉంది. ఫామ్ లేమి, వయసుపై పడటం, మరియు యువ ఆటగాళ్ల నుంచి వస్తున్న పోటీ అతనికి కఠిన పరీక్షగా మారాయి. మైదానంలో తన విలక్షణమైన ఆటతో అభిమానులను అలరించే ఈ 'మిస్టర్ 360' ఆటగాడు, రాబోయే అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో సెలెక్టర్ల నమ్మకాన్ని ఎలా నిలబెట్టుకుంటాడో చూడాలి.

Team India: ‘వాళ్లంతా తోపులేమో’.. ఒక్క మాటతో ఇచ్చిపడేసిన సూర్యకుమార్ యాదవ్..!
Suryakumar Yadav
Venkata Chari
|

Updated on: May 25, 2026 | 6:43 PM

Share

Suryakumar Yadav Injury Update: ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ ప్రయాణం నిరాశాజనకంగా ముగిసిన వేళ, తన ఫామ్, గాయంపై వస్తున్న పుకార్లకు టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గట్టి సమాధానమిచ్చాడు. తాను పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నానని స్పష్టం చేస్తూ, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను కొట్టిపారేసినా.. రాబోయే రోజుల్లో భారత జట్టులో అతని స్థానంపై మాత్రం నీలినీడలు కమ్ముకున్నాయి.

ముంబై ఓటమి.. సూర్య ఫామ్‌లోకి వచ్చినా తప్పని నిరాశ..

రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 30 పరుగుల తేడాతో ఓడిపోవడంతో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2026 సీజన్ ముగిసింది. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబైకి ఈ సీజన్ అస్సలు కలిసిరాలేదు. దానికి ప్రధాన కారణం స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ కోల్పోవడమే. ఈ సీజన్‌లో ఆడిన 13 ఇన్నింగ్స్‌ల్లో సూర్య కేవలం 20.77 సగటుతో 270 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అయితే, రాజస్థాన్ రాయల్స్‌పై జరిగిన ఆఖరి మ్యాచ్‌లో 42 బంతుల్లో 60 పరుగులు చేసి ఫామ్‌లోకి రావడం ఒక్కటే ముంబైకి కాస్త ఉపశమనం కలిగించే అంశం.

గాయం పుకార్లపై సూర్యకుమార్ ఘాటు స్పందన..

సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ వైఫల్యాల నేపథ్యంలో, అతడు మణికట్టు గాయంతో బాధపడుతున్నాడని, అందుకే మునుపటిలా షాట్లు ఆడలేకపోతున్నాడనే వార్తలు సామాజిక మాధ్యమాల్లో దావానంలా వ్యాపించాయి. ఈ ప్రచారంపై సూర్య తీవ్రంగా స్పందించాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం అధికారిక బ్రాడ్‌కాస్టర్లతో మాట్లాడుతూ తప్పుడు ప్రచారాలు చేసేవారిపై మండిపడ్డాడు.

ఇవి కూడా చదవండి

“నా మణికట్టు గాయం గురించి మాట్లాడుతున్న వారు పెద్ద ఫిజియోలైనా అయి ఉండాలి లేదా వారికి అసలు క్రికెట్ గురించైనా తెలిసి ఉండాలి. నిజంగానే నాకు మణికట్టు సమస్య ఉంటే, నేను మైదానంలోనూ, నెట్స్‌లోనూ ఆడే ఫ్లిక్ షాట్లు అస్సలు ఆడలేను. నా ఆట పూర్తిగా చేతులు, కళ్ల సమన్వయం (హ్యాండ్-ఐ కోఆర్డినేషన్) మీద ఆధారపడి ఉంటుంది. రాజస్థాన్ మ్యాచ్‌లో నేను ఆడిన షాట్లే నేను ఎంత ఫిట్‌గా ఉన్నానో చెప్పడానికి నిదర్శనం” అని సూర్యకుమార్ స్పష్టం చేశాడు.

టీమిండియా భవిష్యత్తుపై సందిగ్ధత.. శ్రేయస్ అయ్యర్ చేతికి పగ్గాలు?

సూర్యకుమార్ తన ఫిట్‌నెస్‌పై క్లారిటీ ఇచ్చినప్పటికీ, భారత జట్టులో అతని భవిష్యత్తు మాత్రం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం 35 ఏళ్ల వయసున్న సూర్య, ఫామ్ కోల్పోవడం సెలెక్టర్లను ఆలోచనలో పడేసింది. రాబోయే టీ20 ప్రపంచకప్ సైకిల్ కోసం జట్టును సిద్ధం చేయాలని భావిస్తున్న సెలెక్టర్లు, సూర్య స్థానంలో శ్రేయస్ అయ్యర్‌కు టీ20 జట్టు నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నట్లు సమాచారం. ఐపీఎల్‌లో రాణించి తన కెప్టెన్సీ స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలనుకున్న సూర్యకు ఈ సీజన్ పెద్ద ఎదురుదెబ్బ అనే చెప్పాలి.

రాబోయే పర్యటనల్లో సూర్యకు చోటు దక్కేనా?

ఐపీఎల్ ముగిసిన వెంటనే భారత జట్టు ఐర్లాండ్, ఇంగ్లాండ్ దేశాల్లో పర్యటించనుంది. అక్కడ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లు ఆడనుంది. యువ ఆటగాళ్లను పరీక్షించడానికి సెలెక్టర్లకు ఇది మంచి అవకాశం. ఈ నేపథ్యంలో, సూర్యకుమార్ యాదవ్‌కు ‘విశ్రాంతి’ అనే నెపంతో జట్టుకు దూరం పెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే, సూర్య కెరీర్‌కు ఇబ్బందులు తప్పకపోవచ్చు. ప్రస్తుత కోచ్ గౌతమ్ గంభీర్ గనుక సెలెక్టర్లతో పట్టుబడితే తప్ప, సూర్యకుమార్ యాదవ్ మళ్లీ నీలి రంగు జెర్సీలో కనిపించడం అంత సులువు కాదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
సౌందర్యతో నటించిన ఈ తెలుగు హీరో కూడా యాక్సిడెంట్ లోనే చనిపోయారు..
సౌందర్యతో నటించిన ఈ తెలుగు హీరో కూడా యాక్సిడెంట్ లోనే చనిపోయారు..
ఓవరాల్‌గా బీజేపీ జైత్రయాత్రను అడ్డుకోలేకపోతున్న ప్రాంతీయ పార్టీలు
ఓవరాల్‌గా బీజేపీ జైత్రయాత్రను అడ్డుకోలేకపోతున్న ప్రాంతీయ పార్టీలు
నల్లమల్ల నుంచి గ్రామంలోకి వచ్చిన చుక్కల దుప్పి.. చెరువు వద్ద..
నల్లమల్ల నుంచి గ్రామంలోకి వచ్చిన చుక్కల దుప్పి.. చెరువు వద్ద..
ఏం లిరిక్స్ భయ్యా.. 31 సంవత్సరాలుగా అందరూ ఈజీగా పాడేస్తున్న పాట..
ఏం లిరిక్స్ భయ్యా.. 31 సంవత్సరాలుగా అందరూ ఈజీగా పాడేస్తున్న పాట..
శాస్త్రవేత్తలనే ఆశ్చర్యపరిచిన ఉపగ్రహ ఫోటోలు.. ఆకాశంలో మారిన సీన్.
శాస్త్రవేత్తలనే ఆశ్చర్యపరిచిన ఉపగ్రహ ఫోటోలు.. ఆకాశంలో మారిన సీన్.
తాబేళ్లతో గూఢచర్యం! చైనా సముద్రంలో రహస్య యుద్ధం
తాబేళ్లతో గూఢచర్యం! చైనా సముద్రంలో రహస్య యుద్ధం
ఒక్క ‘బిర్యానీ’ కామెంట్‌తో ఉద్యోగం పోయింది..
ఒక్క ‘బిర్యానీ’ కామెంట్‌తో ఉద్యోగం పోయింది..
శ్రీవారి ప్రసాదాల్లో భారీ మార్పులు.. నాణ్యత, భద్రత కోసం...
శ్రీవారి ప్రసాదాల్లో భారీ మార్పులు.. నాణ్యత, భద్రత కోసం...
మిస్టరీగా మారిన మూడేళ్ల జాహ్నవి అదృశ్యం..అధికారుల విభిన్న వాదనలు!
మిస్టరీగా మారిన మూడేళ్ల జాహ్నవి అదృశ్యం..అధికారుల విభిన్న వాదనలు!
రోజుకు 200 లీటర్లే.. పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లపై కేంద్రం ఆంక్షలు
రోజుకు 200 లీటర్లే.. పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లపై కేంద్రం ఆంక్షలు