AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 Qualifier 1 : ఫైనల్ బెర్త్ కోసం ఆర్సీబీ vs జీటీ వార్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్

IPL 2026 Qualifier 1 : ఐపీఎల్ 2026 క్వాలిఫైయర్ 1లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఆర్సీబీ, జీటీ మధ్య ధర్మశాల వేదిక గా జరుగుతున్న ఈ మ్యాచ్‌ లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది.

IPL 2026 Qualifier 1 : ఫైనల్ బెర్త్ కోసం ఆర్సీబీ vs జీటీ వార్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్
Rcb Vs Gt (1)
Rakesh
|

Updated on: May 26, 2026 | 7:13 PM

Share

IPL 2026 Qualifier 1 : ఐపీఎల్ 2026 సీజన్ క్లైమాక్స్‌కు వచ్చేసింది. ధర్మశాల వేదికగా జరుగుతున్న తొలి క్వాలిఫైయర్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) జట్లు తలపడుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. మంచు ప్రభావం ఉండే అవకాశం ఉండటంతో ఛేజింగ్‌కే మొగ్గు చూపాడు గిల్.

లీగ్ దశలో ఆర్సీబీ, గుజరాత్ రెండు జట్లు కూడా తలో 18 పాయింట్లు సాధించి సత్తా చాటాయి. అయితే, మెరుగైన నెట్ రన్ రేట్ ఉండటంతో రజత్ పాటిదార్ సేన టేబుల్ టాపర్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది (క్వాలిఫైయర్-2 ఆడాల్సి ఉంటుంది). ఈ సీజన్‌లో ఇప్పటికే రెండుసార్లు తలపడగా, రెండు జట్లు చెరో మ్యాచ్ గెలిచి సమానంగా ఉన్నాయి. దీంతో ఈ మూడో పోరులో ఎవరు పైచేయి సాధిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

ఆర్సీబీకి విరాట్ కోహ్లీ అనుభవం కొండంత అండగా నిలుస్తోంది. కెప్టెన్ రజత్ పాటిదార్ కూడా సూపర్ ఫామ్‌లో ఉండి ఆర్సీబీ 200 పైచిలుకు స్కోర్లను అలవోకగా బాదేస్తోంది. మరోవైపు గుజరాత్ టీమ్‌లో శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, జోస్ బట్లర్ వంటి స్టార్ బ్యాటర్లు ఉన్నారు. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటర్లు.. గుజరాత్ పేసర్లయిన సిరాజ్, రబడాలను ఎలా ఎదుర్కొంటారనేది కీలకం కానుంది. అలాగే ఆర్సీబీ పేసర్ భువనేశ్వర్ కుమార్ (పర్పుల్ క్యాప్ హోల్డర్) స్పెల్ కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

ధర్మశాల పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది. పైగా బౌండరీలు చిన్నవి కావడంతో 220-250 పరుగులు చేసినా సేఫ్ కాదని ఆర్సీబీ కెప్టెన్ పాటిదార్ అభిప్రాయపడ్డారు. గాయం నుంచి కోలుకున్న ఫిలిప్ సాల్ట్ ఆర్సీబీ జట్టులోకి రావడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. అటు రషీద్ ఖాన్ మాయాజాలాన్ని అడ్డుకోవడం ఆర్సీబీ మిడిల్ ఆర్డర్‌కు పెద్ద సవాలే. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్‌కు.. భారీ స్కోరు లక్ష్యంగా ఆర్సీబీ బ్యాటర్లు రెడీ అవుతున్నారు.

గుజరాత్ టైటాన్స్ ప్లేయింగ్ 11 :  సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, నిషాంత్ సింధు, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, కుల్వంత్ ఖేజ్రోలియా, కగిసో రబడ, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయింగ్ 11 : వెంకటేష్ అయ్యర్, విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్, రజత్ పటీదార్ (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జాకబ్ డఫీ, జోష్ హాజిల్‌వుడ్, రసిఖ్ సలాం దార్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us