గుజరాత్ టైటాన్స్
గుజరాత్ టైటాన్స్ ఒక ప్రొఫెషనల్ ఫ్రాంచైజీ క్రికెట్ జట్టు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో టైటాన్స్ పాల్గొంటుంది. గుజరాత్ టైటాన్స్ హోమ్ గ్రౌండ్ మోటెరాలోని నరేంద్ర మోడీ స్టేడియం. ఫ్రాంచైజీ CVC క్యాపిటల్ పార్ట్‌నర్స్ యాజమాన్యంలో ఉంది. ఆశిష్ నెహ్రా కోచ్ అయిన తర్వాత, గుజరాత్ టైటాన్స్‌కు మొదటి సీజన్‌లో హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా ఉన్నాడు. ఇప్పుడు హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్‌లో చేరాడు. ప్రస్తుతం జట్టుకు శుభమాన్ గిల్ కెప్టెన్‌గా ఉన్నాడు. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో గుజరాత్ 2022 సీజన్‌లో తమ మొదటి టైటిల్‌ను గెలుచుకుంది.
2023లో గుజరాత్ టైటాన్స్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. ప్రస్తుతం ఆ జట్టుకు కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ ఉన్నాడు. కోచ్‌గా ఆశిష్ నెహ్రా, యజమాని CVC క్యాపిటల్ పార్ట్‌నర్స్, మేనేజర్ సత్యజిత్ పరబ్. టీమ్ థీమ్ సాంగ్ ‘ఆవా దే’. అరంగేంట్ర సీజన్‌లోనే విజేతగా నిలిచిన గుజరాత్ జట్టు.. రెండో సీజన్‌లో రన్నరప్‌గా నిలిచింది. ఇక మూడో ఏడాది ఏ ప్లేస్‌లో నిలుస్తుందో చూడాలి.